Home /News /life-style /

World AIDS Day: హెచ్ఐవీ వ్యాప్తి ఎన్ని దశలుగా ఉంటుంది? బాధితులంతా ఎయిడ్స్‌ దశకు చేరుకుంటారా?

World AIDS Day: హెచ్ఐవీ వ్యాప్తి ఎన్ని దశలుగా ఉంటుంది? బాధితులంతా ఎయిడ్స్‌ దశకు చేరుకుంటారా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

World AIDS Day: HIV వ్యాప్తిలో వివిధ దశలు ఉన్నాయి. బాధితులకు కొన్ని సంవత్సరాలు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ రోగనిరోధక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైనప్పుడు బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, దీర్ఘకాలిక అనారోగ్యాలు, తరచుగా జ్వరం రావడం వంటి లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి.

ఇంకా చదవండి ...
ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 1న ఎయిడ్స్ దినోత్సవాన్ని (World AIDS Day) నిర్వహిస్తుంటారు. హెచ్‌ఐవీ వైరస్, ఎయిడ్స్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు. హెచ్‌ఐవీ HIV (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్) అనేది ఎయిడ్స్ AIDS (అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్)కి దారితీసే అత్యంత భయంకరమైన వైరస్. హెచ్‌ఐవీ, ఎయిడ్స్ రెండూ ఒకటేనని చాలామంది భావిస్తుంటారు. కానీ ఈ అభిప్రాయం తప్పు. HIV లేదా హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ వివిధ దశలను కలిగి ఉంటుంది. వీటిలో AIDS చివరి దశ. శరీర రోగనిరోధక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు, వైరస్ బాధితులు తీవ్రమైన ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఇది సంభవిస్తుంది. ప్రతిరోజూ హెచ్‌ఐవీ మందులు తీసుకోవడం ద్వారా ఇది ఎయిడ్స్‌గా మారకుండా నిరోధించవచ్చు. చాలా మంది హెచ్‌ఐవీ రోగులు ఇలా మందులు వాడుతూ ఎయిడ్స్‌ ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తపడుతున్నారు.

Omicron: ఒమిక్రాన్ ముప్పు.. డయాబెటిక్ పేషెంట్లు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి.

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈ రోజు HIV/AIDS గురించి ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కల్పిస్తారు. ఇది అత్యంత విస్తృతంగా ప్రాచుర్యం పొందిన ప్రపంచ ఆరోగ్య దినాలలో ఒకటిగా మారింది. ఎయిడ్స్ డే సందర్భంగా ప్రజలకు హెచ్‌ఐవీ వైరస్ వ్యాప్తిపై అవగాహన పెంచడం, మరణించిన వారిని స్మరించుకోవడం, వ్యాధికి చికిత్స, నివారణ మార్గాలు.. వంటి అంశాలపై ఆరోగ్య సంస్థలు దృష్టి సారిస్తాయి.

* HIV ఎందుకు ప్రాణాంతకం?
ఈ ప్రాణాంతక వైరస్, బాధితుల రోగనిరోధక శక్తిని లక్ష్యంగా చేసుకుంటుంది. కాలక్రమంలో రోగుల ఇమ్యూనిటీని దెబ్బతీస్తుంది. సరైన రోగనిరోధక వ్యవస్థ లేకపోవడంతో బాధితులు కొన్ని రకాల క్యాన్సర్లు, ఇతర ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. హెచ్‌ఐవీని పూర్తిగా నయం చేయలేకపోవడంతో ఇది మరింత ప్రాణాంతకంగా మారుతుంది.

World Aids Day : మొదటిసారిగా ఎయిడ్స్ ఎప్పుడు.. ఎవరికి వచ్చిందంటే..?

HIV సోకిన రోగిని తాకడం వల్ల, దగ్గు ద్వారా, ఆహారం, పానీయాలను పంచుకోవడం ద్వారా వైరస్ ఇతరులకు వ్యాపించదు. వ్యాధి సోకిన వారికి వాడిన సూదులను ఇతరులకు వాడినప్పుడు, రక్త మార్పిడి ద్వారా, వైరస్ సోకిన తల్లి గర్భంలోని నవజాత శిశువుకు హెచ్‌ఐవీ వ్యాపిస్తుంది. ముఖ్యంగా వ్యాధి సోకిన వ్యక్తితో అసురక్షిత లైంగిక సంబంధం ద్వారా వైరస్ వ్యాపిస్తుంది.

* HIV వ్యాప్తి ఎన్ని దశలుగా ఉంటుంది?
HIV వ్యాప్తిలో వివిధ దశలు ఉన్నాయి. బాధితులకు కొన్ని సంవత్సరాలు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ రోగనిరోధక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైనప్పుడు బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, దీర్ఘకాలిక అనారోగ్యాలు, తరచుగా జ్వరం రావడం వంటి లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. వ్యాధి తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఇది అత్యంత ప్రమాదకరమైన AIDSగా మారుతుంది. ఈ స్థితికి చేరుకున్న బాధితుల్లో అవయవ వైఫల్యం కారణంగా పరిస్థితి చేజారిపోతుంది.

Weight loss Facts: పరగడుపున నిమ్మరసం తాగితే బరువు తగ్గుతారా..? వాస్తవం తెలిస్తే షాక్

* సాధారణంగా HIV వ్యాప్తిని నాలుగు దశలుగా వర్గీకరించవచ్చు.

మొదటి దశ: తీవ్రమైన ఇన్ఫెక్షన్
వైరస్ సోకిన తరువాత 2 నుంచి 4 వారాలను ప్రారంభ దశగా గుర్తిస్తారు. ఈ దశలో బాధితుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ వారి నుంచి వైరస్ ఇతరులకు సోకుతుంది. వ్యాధి సోకిన తరువాత రక్త పరీక్షలో పాజిటివ్ రావడానికి కొంత సమయం పడుతుంది. దీన్ని "విండో పీరియడ్" అంటారు. సాధారణంగా ఈ వ్యవధి మూడు నెలల వరకు ఉండవచ్చు. విండో పీరియడ్‌కు ముందే హెచ్‌ఐవీ టెస్ట్ చేసినా, పరీక్షల్లో కచ్చితమైన ఫలితం చూపకపోవచ్చు. హైచ్‌ఐవీ మొదటి దశలో ART (యాంటీరెట్రోవైరల్ థెరపీ) చికిత్సను వైద్యులు సూచిస్తారు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ చికిత్స ద్వారా బాధితుల శరీర అవయవాలు దెబ్బతినకుండా కాపాడటంతో పాటు వారి జీవితకాలాన్ని పొడిగించవచ్చు.

రెండో దశ: లక్షణాలు కనిపించని దశ (Asymptomatic)
ఈ దశ చాలా సంవత్సరాలు కొనసాగవచ్చు. కొందరు వ్యక్తులు డాక్టర్ చెకప్‌లు, సాధారణ మందులతో పదేళ్లు, అంతకు మించి సాధారణ జీవనశైలిని కొనసాగించవచ్చు. ఈ దశలో పరీక్షలు నిర్వహించనంత కాలం.. చాలామంది రోగులకు తాము వ్యాధి బారిన పడినట్లు కూడా తెలియకపోవచ్చు.

Winter Health: వింటర్ లో సాధారణంగా వచ్చే సమస్యలు ఇవే.. ఈ చిట్కాలతో చెక్

మూడో దశ: వ్యాధి లక్షణాలు కనిపించే దశ
బాధితుల్లో క్రమంగా రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినడం వల్ల ప్రతి చిన్న ఇన్‌ఫెక్షన్‌కు శరీరం స్పందిస్తుంది. ఈ దశ ప్రారంభంలో బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, దీర్ఘకాలిక లూజ్ మోషన్స్, తీవ్రమైన జ్వరం, నోటి పొక్కులతో పాటు ఇతర లక్షణాలు కూడా కనిపించవచ్చు. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడం వల్ల శరీరం ఇన్‌ఫెక్షన్లతో పోరాడలేదు. దీంతో చిన్నపాటి ఇన్‌ఫెక్షన్‌ కూడా పెద్ద సమస్యగా మారుతుంది. దీంతో బాధితులు క్షయ, టాక్సోప్లాస్మోసిస్, కపోసి సార్కోమా వంటి ఇతర దీర్ఘకాల అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

నాలుగో దశ: ఎయిడ్స్ (AIDS)
రెండు నుంచి మూడో దశకు.. లేదా మూడు నుంచి నాలుగో దశకు మధ్య కచ్చితమైన కాలపరిమితి అంటూ ఉండదు. HIV సోకిన ప్రతి వ్యక్తి చివరకు ఎయిడ్స్‌ దశకు చేరుకుంటారని చెప్పలేం. సరైన మందులు, చికిత్సతో హెచ్‌ఐవీ బాధితులు ఎయిడ్స్‌ దశకు చేరుకునే సంఖ్య బాగా తగ్గిపోయింది. కానీ ఎయిడ్స్‌తో బాధపడే వారు అధిక ఇన్‌ఫెక్షన్‌ల కారణంగా అవయవ వైఫల్యం బారిన పడవచ్చు. దీర్ఘకాలంలో ఇది మరణానికి సైతం దారితీయవచ్చు. అయితే ఎయిడ్స్‌ దశకు చేరుకోకుండా, హెచ్‌ఐవీతో మంచి జీవితాన్ని గడుపుతున్న చాలా మంది వ్యక్తులు ప్రస్తుత సమాజంలో ఉన్నారని నిపుణులు చెబుతున్నారు.
First published:

Tags: Aids, HIV, Life Style, Lifestyle

తదుపరి వార్తలు