Home /News /life-style /

World AIDS Day: ఎంత భారతీయులు కండోమ్‌లు వాడట్లేదో తెలుసా? సర్వేలో షాకింగ్ విషయాలు

World AIDS Day: ఎంత భారతీయులు కండోమ్‌లు వాడట్లేదో తెలుసా? సర్వేలో షాకింగ్ విషయాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

World AIDS Day: భారత్​లో 57 శాతం మంది కండోమ్‌ వంటి ఏ విధమైన గర్భనిరోధకాలను ఉపయోగించట్లేదని, ఇది హెచ్​ఐవీ ఎయిడ్స్​ సంక్రమించేందుకు దారితీయవచ్చని సర్వే వెల్లడించింది. సర్వే ఫలితాలను బట్టి చూస్తే.. అత్యధికంగా గర్భనిరోధక వినియోగిస్తున్న భారతీయ నగరాల జాబితాలో ఢిల్లీ- అగ్రస్థానంలో ఉండగా.. అహ్మదాబాద్​ చిట్ట చివరి స్థానంలో ఉంది.

ఇంకా చదవండి ...
ఇవాళ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం (World AIDS Day). ఈ సందర్భంగా గురుగ్రామ్‌కు చెందిన హైజీన్ బ్రాండ్ పీ సేఫ్, ఫీమేల్​ కండోమ్‌ల తయారీ సంస్థ డొమినా సంయుక్తంగా ఓ సర్వే నిర్వహించాయి. మంగళవారం నాడు ఈ సర్వే ఫలితాలను విడుదల చేశాయి. వీటిలో అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి. దేశంలో వచ్చే పదేళ్లలో 77 లక్షల ఎయిడ్స్​ సంబంధిత మరణాలు (AIDS Deaths) సంభవించే అవకాశం ఉందని సర్వే అభిప్రాయపడింది. ఈ మరణాలను నియంత్రించేందుకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో ఎయిడ్స్​ పట్ల అవగాహన కల్పించాలని గుర్తుచేసింది.

World AIDS Day: హెచ్ఐవీ వ్యాప్తి ఎన్ని దశలు? బాధితులంతా ఎయిడ్స్‌ దశకు చేరుకుంటారా?

భారత్​లో 57 శాతం మంది కండోమ్‌ (Condom) వంటి ఏ విధమైన గర్భనిరోధకాలను (contraceptives) ఉపయోగించట్లేదని, ఇది హెచ్​ఐవీ ఎయిడ్స్​ సంక్రమించేందుకు దారితీయవచ్చని సర్వే వెల్లడించింది. సర్వే ఫలితాలను బట్టి చూస్తే.. అత్యధికంగా గర్భనిరోధక వినియోగిస్తున్న భారతీయ నగరాల జాబితాలో ఢిల్లీ- అగ్రస్థానంలో ఉండగా.. అహ్మదాబాద్​ చిట్ట చివరి స్థానంలో ఉంది. సర్వేలో భాగంగా అగర్తల, బెంగళూరు, బరేలీ, భోపాల్, ముంబై, పాట్నా, చెన్నై, నోయిడా, విశాఖపట్నం వంటి నగరాల్లోని 25,381 మంది నుంచి వివరాలు సేకరించారు. ఒక్క ఢిల్లీ నంచే దాదాపు- 4,980 మంది నుంచి వివరాలు సేకరించారు. సర్వేలో పాల్గొన్న వారిలో 70 శాతం మంది 19 నుంచి 29 సంవత్సరాల వయసు, 25.8 శాతం మంది 30 నుంచి -49 సంవత్సరాల వయసు, 1.8 శాతం మంది 50 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గలవారు.

మీ గోళ్లను చూసి మీకున్న ఆరోగ్య సమస్యలేంటో చెప్పొచ్చు.. ఎలానో తెలుసుకోండి

కండోమ్​ల వినియోగంలో ఢిల్లీ టాప్..​

సర్వేలో పాల్గొన్న వారి నుంచి బృందం అనేక ప్రశ్నలకు సమాధానాలు రాబట్టింది. మీరు ఏ రకమైన కండోమ్‌ను ఇష్టపడతారు? అనే ప్రశ్నకు, 56.15 శాతం మంది ఎక్స్​టర్నల్ లేదా మేల్ కండోమ్‌ను ఇష్టపడతారని చెప్పారు. 7.21 శాతం మంది ఇంటర్నల్​ లేదా ఫీమేల్​ కండోమ్‌ను ఇష్టపడతామని చెప్పారు. ఆశ్చర్యకరంగా 4.14 శాతం మంది మేము ఇంతకు ముందెన్నడూ ఫీమేల్​ కండోమ్ గురించి వినలేదని చెప్పారు. కోవిడ్ -ప్రేరేపిత లాక్‌డౌన్ సమయంలో డేటింగ్ యాప్‌లకు జనాదరణ విపరీతంగా పెరిగిందని, వర్చువల్ రొమాన్స్‌ పట్ల ఎక్కువ మంది ఆసక్తి కనబర్చారని మీడియా నివేదికలు గతంలో పేర్కొన్నాయి. అయినప్పటికీ, ఈ సర్వేలో దీనికి బిన్నమైన ఫలితాలొచ్చాయి.

World Aids Day : మొదటిసారిగా ఎయిడ్స్ ఎప్పుడు.. ఎవరికి వచ్చిందంటే..?

సర్వేలో పాల్గొన్న 64 శాతం మంది లాక్​డౌన్ (Lockdown)​ టైమ్​లో డేటింగ్ యాప్‌ల (Dating Apps)ను ఉపయోగించలేదని తెలిపారు. కేవలం 19.74 శాతం మంది మాత్రమే డేటింగ్​ యాప్స్​ను ఉపయోగించినట్లు సమాధానం ఇచ్చారు. లాక్​డౌన్​ టైమ్​లో సెక్స్ టాయ్‌ను ఉపయోగించారా? అనే ప్రశ్నకు 52 శాతం మంది ‘లేదు’ అని సమాధానం ఇచ్చారు. ఈ ప్రశ్నకు 15.96 శాతం మంది మాత్రమే “అవును” అని సమాధానమిచ్చారు. లాక్​డౌన్​ సమయంలో జంటలు ఇంట్లో ఎక్కువ సమయం గడిపినప్పటికీ.. 61.7 శాతం మంది లైంగిక కార్యకలాపాల్లో ఎక్కువగా పొల్గొనలేదని చెప్పారు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Aids, HIV, Life Style, Lifestyle

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు