ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 1ని ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా (AIDS Day) పాటిస్తున్నారు. హెచ్‌ఐవితో (HIV) జీవిస్తున్న వారికి భరోసానిచ్చేందుకు, ప్రజల్లో ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించేందుకు ఏటా డిసెంబర్ 1న అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సారి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాలను ‘అసమానతలను అంతం చేయండి. ఎయిడ్స్‌ను అంతం చేయండి.’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ (WHO), దాని అనుబంధ సంస్థల భాగస్వామ్యంతో అనేక అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. హెచ్ఐవీ రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సేవలను పొందడంలో పెరుగుతున్న అసమానతలను ఈ కార్యక్రమాల్లో హైలైట్ చేయనున్నారు. 1988 నుంచి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్ (AIDS) అనేది హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV) వల్ల వచ్చే దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. తద్వారా ఇతర వ్యాధులతో పోరాడే సామర్థ్యం తగ్గుతుంది.
ఎయిడ్స్ బారిన పడటానికి గల కారణాలేంటి?
ఎయిడ్స్ వ్యాధి ఒకరి నుంచి మరొకరి సంక్రమిస్తుంది. ఈ వైరస్ రక్తం, వీర్యం, ప్రీ-సెమినల్ ద్రవం, యోని, మల ద్రవాల ద్వారా ఇతరులకు సోకుతుంది. హెచ్ఐవీ సోకిన స్త్రీ తల్లి పాల నుంచి కూడా సంక్రమించే అవకాశం ఉంది. వ్యాధి సోకిన వ్యక్తితో అసురక్షిత సెక్స్‌లో పాల్గొంటే ఈ వ్యాధి సంక్రమించే ప్రమాదం ఉంది. వ్యాధి సోకిన వ్యక్తికి ఉపయోగించిన ఇంజక్షన్ సూదులు, రేజర్ బ్లేడ్లను మీరు ఉపయోగించడం వల్ల కూడా వ్యాధి సోకే ప్రమాదం ఉంది.
Foods and Habits: కరోనా థర్డ్ వేవ్ వస్తుందని భయపడుతున్నారా ?.. రోగ నిరోధక శక్తిని ఇలా పెంచుకోండి..
హెచ్ఐవీ సోకిన వారిలో కొన్ని లక్షణాలు బయటపడతాయి. జ్వరం, గొంతు నొప్పి, చర్మంపై దద్దుర్లు, వాంతులు, వికారం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే అప్రమత్తమై వైద్యుడిని సంప్రదించాలి.
Ghee: నెయ్యితో గుండె ఆరోగ్యం దెబ్బతింటుందా? బరువు తగ్గాలనుకునే వారు దీన్ని వాడొచ్చా? లేదా?
ఎయిడ్స్‌కు చికిత్స ఉందా?
వైద్య రంగంలో అనేక రోగాలకు మందులు, చికిత్సలు కనుగొన్నా.. ఎయిడ్స్‌కు మాత్రం ఇంకా మందు అందుబాటులోకి రాలేదు. అయితే, ప్రస్తుతం ఉన్న కొన్ని చికిత్సా విధానాలతో వ్యాధి పూర్తిగా నయం కాదు కానీ వ్యాధి సంక్రమించకుండా నిరోధించవచ్చు. దీనికి గాను మన దైనందిన జీవితంలో కొన్ని రక్షణ చర్యలు అనుసరించాలి. చికిత్సలో భాగంగా యాంటీ రెట్రో వైరల్ థెరపీ (ART) వ్యాధి సంక్రమణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రస్తుతం హెచ్‌ఐవి ఎయిడ్స్‌కు సరైన చికిత్స లేనందున నివారణ ఒక్కటే ఏకైక మార్గం. దీన్ని నివారించేందుకు సెక్స్ సమయంలో కండోమ్ వంటి రక్షణ సాధనాలను ఉపయోగించాలని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాదు, ఇతర వ్యక్తులకు ఉపయోగించిన సూదులు, బ్లేడ్‌లు మొదలైన వాటిని పంచుకోకూడదు. రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారాన్ని తీసుకోవాలి.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.