HEALTH WITH THE ONSET OF MONSOON IN HYDERABAD CASES OF VECTOR AND WATER BORNE DISEASES HAVE WITNESSED A SURGE IN THE CITY BS
విష జ్వరాలతో బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ నగరవాసులు..
ప్రతీకాత్మక చిత్రం
Viral Fever: హైదరాబాద్ నగరవాసులు డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా, టైఫాయిడ్ రోగాలతో బెంబేలెత్తిపోతున్నారు. ఫీవర్ ఆస్పత్రికి చెందిన ఓ వైద్యుడు తెలిపిన వివరాల ప్రకారం.. అంతకుముందు 225 మంది జ్వరంతో ఆస్పత్రిలో చేరగా, గత బుధవారం నాటికి ఆ సంఖ్య వెయ్యికి చేరింది.
వానాకాలం వచ్చేసింది.. దానితో పాటు విష జ్వరాలనూ తెచ్చేసింది.. చిత్తడి నేలలు, నీటి కుంటల్లో దోమలు నివాసం ఏర్పర్చుకొని మనపై దాడి చేస్తున్నాయి. ఫలితంగా వందలాది మంది మంచాన పడుతున్నారు. జ్వరాలు, దగ్గు, జలుబుతో పాటు జాండిస్(పసిరికలు) కూడా ఆవహిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులు డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా, టైఫాయిడ్ రోగాలతో బెంబేలెత్తిపోతున్నారు. ఫీవర్ ఆస్పత్రికి చెందిన ఓ వైద్యుడు తెలిపిన వివరాల ప్రకారం.. అంతకుముందు 225 మంది జ్వరంతో ఆస్పత్రిలో చేరగా, గత బుధవారం నాటికి ఆ సంఖ్య వెయ్యికి చేరిందంటేనే అర్థం చేసుకోవచ్చు వ్యాధులు ఎంత తీవ్రంగా మారాయో. కేవలం జూలై మాసంలోనే ఇప్పటి వరకు 50 జాండిస్ కేసులు నమోదయ్యాయట. కేవలం 15 రోజుల వ్యవధిలో రెండు డెంగ్యూ, ఒక చికున్‌గున్యా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించామని వైద్యుడు తెలిపారు.
సెప్టెంబరు నాటికి వైరల్ ఫీవర్ బాధితులు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. దోమలు నివాసం ఉంటే చోట్ల ఉండరాదని, ఆయా స్థలాల్లో తయారు చేసే తినుబండారాలు తినవద్దని, ఆరోగ్యకర ఆహారాన్ని మాత్రమే సేవించాలని సూచించారు. వీలైనంత వరకు ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఇంటి ఆవరణలో నీటి కుంటలు, మురికి లేకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.