హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Dengue Vaccine: ఇండియాలో డెంగీ వ్యాక్సిన్ ఎందుకు అందుబాటులోకి రాలేదు.. ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ ఉందా..?

Dengue Vaccine: ఇండియాలో డెంగీ వ్యాక్సిన్ ఎందుకు అందుబాటులోకి రాలేదు.. ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ ఉందా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Dengue Vaccine: డెంగీ జ్వరానికి ఇప్పటివరకు సురక్షితమైన, సమర్థవంతమైన టీకాని అభివృద్ధి చేయలేదు. ఇప్పట్లో వ్యాక్సిన్ వస్తుందనే సూచనలు కూడా కనిపించడం లేదు. దీనికి కారణం ఏంటి? వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? వంటి విషయాలు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...

కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టేసరికి ప్రజలందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ కరోనా వ్యాధి తీవ్రత తగ్గినా.. ప్రస్తుతం డెంగీ కేసులు మాత్రం నిర్విరామంగా పెరిగిపోతూ అందర్నీ వణికిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా వైద్యులు, హెల్త్ కేర్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. డెంగీ కేసుల్లో భారీ పెరుగుదల నమోదు కావడమే కాదు కొత్త జాతుల విజృంభన వల్ల సంబంధిత లక్షణాలు మరింత తీవ్రమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో డెంగీ వ్యాక్సిన్ శ్రీరామరక్ష కానుంది. కానీ దేశంలో డెంగీ జ్వరానికి ఇప్పటివరకు సురక్షితమైన, సమర్థవంతమైన టీకాని అభివృద్ధి చేయలేదు. ఇప్పట్లో వ్యాక్సిన్ వస్తుందనే సూచనలు కూడా కనిపించడం లేదు. దీనికి కారణం ఏంటి? వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? వంటి విషయాలు తెలుసుకుందాం.

Zodiac Signs: ఈ రాశుల వారి సెక్స్ లైఫ్ అద్భుతంగా ఉంటుంది.. మరికొన్ని రాశుల వారి పరిస్థితి ఏంటి.. తెలుసుకోండి..


డెంగీ అంటే ఏంటి?

డెంగీ అనేది డెంగీ వైరస్ వల్ల దోమల ద్వారా సంక్రమించే వైరల్ వ్యాధి. ఉష్ణమండల వాతావరణం (tropical environments)లో వైరల్ ఇన్‌ఫెక్షన్ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. డెంగీ ప్రధానంగా ఈడెస్ ఈజిప్టి(Aedes Aegypti) జాతికి చెందిన ఆడ దోమల ద్వారా వస్తుంది. అలాగే కొంతమేర ఏఈ (Ae) ఆల్బోపిక్టస్ ద్వారా కూడా డెంగీ వ్యాపిస్తుంది. ఇది డీఈఎన్వీ (DENV) అనే డెంగీ వైరస్ వల్ల వస్తుంది.

డబ్ల్యూహెచ్ఓ ప్రకారం చాలా డెంగీ ఇన్‌ఫెక్షన్లు అంతగా ప్రమాదకరమైనవి కావు. ఇంట్లో చికిత్స ద్వారా వీటి నుంచి బయటపడొచ్చు. కానీ చికిత్స పొందకుండా నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాలు హరించే తీవ్రమైన డెంగీగా అభివృద్ధి చెందుతుంది. ఫ్లావివిరిడే కుటుంబానికి చెందిన డెంగీ అనేది DENV-1, DENV-2, DENV-3, DENV-4 అనే నాలుగు విభిన్న సెరోటైప్‌(serotypes)ల వల్ల వస్తుంది. అన్ని జాతులలో DENV 2 లేదా స్ట్రెయిన్ D2 అత్యంత తీవ్రమైనదిగా పరిగణిస్తారు. ఇది అంతర్గత రక్తస్రావం, డెంగీ షాక్‌ సిండ్రోమ్‌కు కూడా దారితీయవచ్చు.

పెరుగుతున్న డెంగీ కేసులు.. ఆందోళన రేకెత్తిస్తున్న D2 జాతి

కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాలతో సహా భారతదేశంలో డెంగీ ఇన్ఫెక్షన్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. రుతుపవనాలు, కాలానుగుణ మార్పులు అంటువ్యాధుల పెరుగుదలకు దారితీస్తున్నాయి. ఈ ఏడాది దోమల వల్ల సంక్రమించే వ్యాధుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

Central Government: బిజినెస్ చేయాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం చక్కటి ఆఫర్.. వివరాలిలా..


తీవ్ర లక్షణాలతో కూడిన కేసుల సంఖ్య హఠాత్తుగా పెరగడానికి DENV-2 లేదా స్ట్రెయిన్ D2 సెరోటైప్‌ కారణమని వైద్యాధికారులు వెల్లడించారు. కొత్త జాతి వల్ల అధిక స్థాయి జ్వరం, వాంతులు, కీళ్ల నొప్పులు, సెన్సోరియం, డెంగీ హెమరేజిక్ ఫీవర్, డెంగీ షాక్ సిండ్రోమ్‌ వంటి ప్రాణాంతక సమస్యలు వచ్చే ముప్పు ఉందని నిపుణులు భావిస్తున్నారు.

డెంగీ ఇన్ఫెక్షన్‌లను నివారించవచ్చా?

సరైన జాగ్రత్తలతో డెంగీ ఫీవర్ వ్యాప్తిని నివారించవచ్చు. పరిశుభ్రతను పాటిస్తూ.. నిల్వ ఉన్న నీటి వనరులను శుభ్రపరచడం.. క్రిమిసంహారక మందులు పిచికారి చేయడం, నీటి మడుగులు ఏర్పడకుండా జాగ్రత్త పడటం ద్వారా డెంగీని నివారించవచ్చు. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే పొడవైన బట్టలు ధరించడం.. అలాగే దోమల నివారణ మందులను వాడటం ద్వారా కూడా డెంగీ వైరల్ వ్యాధికి చెక్ పెట్టొచ్చు.

డెంగీ వ్యాక్సిన్ నివారణ చర్యల్లో ఎందుకు భాగం కాదు?

డెంగీ నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. అయినప్పటికీ, ఫ్లూ షాట్ లేదా కోవిడ్-19 వ్యాక్సిన్‌ల వలె డెంగీ కోసం సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్ ఇప్పటికీ భారత దేశంలో అందుబాటులో లేదు. అయితే డెంగీ నివారణగా మొదటి వ్యాక్సిన్ గా డెంగ్వాక్సియా (Dengvaxia- CYD-TDV) అనే డెంగీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఇది 2015లో లైసెన్స్ పొందింది. దీనిని కొన్ని దేశాల్లో 9-45 ఏళ్ల వయస్సు గల వ్యక్తులకు అందిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ గతంలో డెంగీ వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయిన వ్యక్తులకు మాత్రమే ఇవ్వాలని డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసింది.

ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్న వారికి గతంలో డెంగీ వైరస్ సంక్రమించకుండా.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే సంక్రమిస్తే.. అది తీవ్ర డెంగీగా అభివృద్ధి చెందే ప్రమాదం ఉందని వ్యాక్సిన్ తయారీదారు సనోఫీ పాశ్చర్, 2017లో వెల్లడించినట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది.

ఇప్పటికే ఉన్న డెంగీ వ్యాక్సిన్ వాడకం ఎందుకు పరిమితం అయ్యింది?

డెంగీ వైరస్‌లో ఉండే DENV-1, DENV-2, DENV-3, DENV-4 అనే సెరోటైప్‌లలో వ్యాక్సిన్ ఒక సెరోటైప్‌ నుంచి మాత్రమే రక్షణ అందిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ వ్యాక్సిన్ మిగిలిన మూడింటికి వ్యతిరేకంగా శాశ్వత రోగనిరోధక శక్తిని ఉత్పత్తి చేయదు. తద్వారా దీన్ని అసమర్ధమైన వ్యాక్సిన్ గా వైద్యులు పరిగణిస్తుంటారు.

ఒక వైరల్ సెరోటైప్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక యాంటీబాడీస్ ఉత్పన్నం అవ్వటం వల్ల రోగికి వేరే సెరోటైప్ నుంచి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. డబ్ల్యూహెచ్ఓ కూడా వ్యాక్సినేషన్ తర్వాత డెంగీ సోకితే అది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని తెలిపింది.

డెంగీ వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసే రేసులో భారతదేశం స్థానం ఏంటి?

బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (NCBS)-టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌కు చెందిన భారతీయ శాస్త్రవేత్తలు డెంగీ వైరస్‌ నివారణకు డీఎన్ఏ వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసినట్లు ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి. ఈ పరిశోధకులు వైరస్ నాలుగు సెరోటైప్‌ల నుండి EDIII అని పిలిచే అత్యంత ముఖ్యమైన వైరల్ ప్రోటీన్‌లో కొంత భాగాన్ని ఎంచుకున్నారు. వారు తీవ్రమైన డెంగీకి కారణమయ్యే DENV2 సెరోటైప్ నుంచి NS1 ప్రోటీన్‌ను కూడా ఎంచుకున్నారు. తద్వారా తీవ్రమైన డెంగీని నివారించాలని కృషి చేస్తున్నారు. భారతదేశం అంతటా అన్ని వైద్య బృందాలు కలిసి డెంగీకి సమర్థవంతమైన వ్యాక్సిన్‌ని తీసుకువచ్చే ప్రయత్నాలు, ప్రయోగ దశలు కొనసాగుతున్నాయి.

First published:

Tags: Dengue fever

ఉత్తమ కథలు