Sexual Health: వయసు పెరిగాక మహిళల్లో శృంగార కోరికలు ఎందుకు తగ్గుతాయి..? పునరుత్తేజం పొందాలంటే ఏం చేయాలి..

ప్రతీకాత్మక చిత్రం

శృంగారం (Sex​) అనేది జీవితంలో ఓ భాగమే అయినా.. దాని గురించి బయటకు మాట్లాడటాన్ని చాలా మంది సిగ్గుగా భావిస్తారు. దీంతో సెక్సువల్ హెల్త్ గురించి సమస్యలు ఎదుర్కొంటున్నా స్వేచ్ఛగా ఎదుటివారికి చెప్పుకోలేకపోతున్నారు. కొన్నిసార్లు ఆన్​లైన్​లో అసంబద్ధమైన సమాచారాన్ని తీసుకుంటున్నారు. అలాగే కొందరు స్నేహితులు చెప్పే ఆన్​సైంటిఫిక్ విధానాలను ఫాలో అవుతున్నారు.

  • Share this:
శృంగారం (Sex​) అనేది జీవితంలో ఓ భాగమే అయినా.. దాని గురించి బయటకు మాట్లాడటాన్ని చాలా మంది సిగ్గుగా భావిస్తారు. దీంతో సెక్సువల్ హెల్త్ గురించి సమస్యలు ఎదుర్కొంటున్నా స్వేచ్ఛగా ఎదుటివారికి చెప్పుకోలేకపోతున్నారు. కొన్నిసార్లు ఆన్​లైన్​లో అసంబద్ధమైన సమాచారాన్ని తీసుకుంటున్నారు. అలాగే కొందరు స్నేహితులు చెప్పే ఆన్​సైంటిఫిక్ విధానాలను ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలో శృంగారం, సెక్సువల్​ లైఫ్​పై సరైన సమాచారం ఇచ్చేందుకు న్యూస్18.కామ్ ప్రతీ శుక్రవారం వీక్లీ కాలమ్ “లెట్స్ టాక్ సెక్స్” పేరుతో విడుదల చేస్తోంది.

Eating at Work Place: వర్క్ ఫ్రం హోం చేస్తూ.. వాటిని తింటున్నారా.. అయితే జాగ్రత్త.. లేదంటే..


కొంత వయసు వచ్చిన తర్వాత మహిళల్లో శృంగార కాంక్ష తగ్గిపోతుంటుంది. సెక్స్ పట్ల వారు అంత ఆసక్తిగా ఉండరు. కారణమేంటి.. దీన్ని ఎలా అధిగమించాలో వివరిస్తున్నారు సెక్సాలజిస్ట్ డాక్టర్​ సరంశ్ జైన్​. మహిళలు 30, 40ల్లో ఉన్నప్పుడు తక్కువ సెక్స్ కోరికలు అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. హార్మోన్లు తగ్గిపోవడం, ఉద్యోగ ఒత్తిడి, రిలేషన్స్​లో సమస్యలతో పాటు మరిన్ని ఇబ్బందులు, కారణాల వల్ల మహిళల్లో సెక్స్ కోరికలు తగ్గిపోతున్నాయి.

Sex problems: 30 ఏళ్లు దాటితే లైంగిక వాంఛలు తగ్గుతాయా? ఇందులో వాస్తవమెంత? తెలుసుకుందాం..


శృంగార కోరికలు తగ్గడాన్ని సైన్స్ పరిభాషలో హైపో యాక్టివ్ సెక్సువల్ డిజైర్ డిజార్డర్ (హెచ్​ఎస్​డీడీ) అంటారు. వయసు ఎక్కువగా ఉన్న మహిళల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న మహిళల్లో మూడింట ఒకరికి సెక్స్​పై అంతగా ఆసక్తి ఉండదని ఇటీవల ఓ సర్వే వెల్లడించింది. టెస్టోస్టిరాన్​ హార్మోన్ తక్కువగా ఉండటం, సంబంధాల్లో సమస్యలు, సోషియోకల్చర్​ పరిస్థితులు, వైద్య సమస్యలు, మెడికేషన్​.. సెక్స్ వాంఛలు తగ్గేందుకు కారణం కావచ్చు.

శృంగార వాంఛలు మళ్లీ కలిగేదెలా..?
శృంగార వాంఛలను మళ్లీ పెంచుకునేందుకు కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయి. అయితే సెక్స్ కోరికలు ఎందుకు తగ్గాయో కూడా గుర్తించడం ముఖ్యం. అందుకు తగ్గట్టుగా ముందుకు సాగాలి. కొన్ని పరిష్కారాలివే
ఫోర్ ప్లేపై దృష్టి పెట్టాలి: ​ బెస్ట్ సెక్స్ ఎక్స్​పీరియన్స్​ను పొందాలంటే ఫోర్ ప్లే చాలా ముఖ్యం. శృంగారానికి ముందు ఫోర్​ ప్లే బాగా సాగితే కోరికలు బాగా పెరిగి సెక్స్ అనుభూతిని ఎక్కువగా పొందుతారు.

Acidity Prevention: ఎసిడిటీతో బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాలు పాటిస్తే క్షణాల్లో మాయం..


నాణ్యమైన నిద్ర: నిద్రలో నాణ్యత కూడా వ్యక్తుల మూడ్​ను, శక్తిని పెంచుతుంది. సాధారణంగా నాణ్యమైన నిద్రపోయే వారిలో సెక్స్ వాంఛలు తగ్గడం లాంటి సమస్యలు తక్కువగా ఉంటాయని కొన్ని అధ్యయనాలు కూడా స్పష్టం చేశాయి.
బంధాన్ని పటిష్టం చేసుకోవాలి: భాగస్వామితో బంధం సరిగా లేకపోవడం కూడా సెక్స్ కోరికలు తగ్గేందుకు కారణం కావొచ్చు. ఇదే కోరికలు తగ్గిపోవడానికి కారణం అయితే, రిలేషన్‌షిప్‌లో నాణ్యతను పెంచుకోవాలి.

నిత్యం వ్యాయామం చేయడం, ప్రస్తుత మెడికేషన్​ను డాక్టర్​ను సంప్రదించి మార్చడం, ఆరోగ్య పరిస్థితిని సమీక్షించుకోవడం లాంటివి చేయడం వల్ల కూడా సెక్స్ కోరికలు పెంచుకోవచ్చు. అలాగే టెస్టోస్టిరాన్ తగ్గిపోతే గైనకాలజిస్ట్​ను సంప్రదించి టెస్టోస్టిరాన్ హార్మోన్ థెరపీని పాటించడం మంచిది. ఒత్తిడిని తగ్గించుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం, వల్ల కూడా శృంగార కోరికలను మెరుగుపరచుకోవచ్చు.
Published by:Veera Babu
First published: