హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Crackers: కొన్ని రకాల బిస్కెట్లకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి..? వాటి ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి..!

Crackers: కొన్ని రకాల బిస్కెట్లకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి..? వాటి ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి..!

క్రాకర్స్‌లోని చిన్న రంధ్రాలను "డాకర్స్" అని కూడా పిలుస్తారు. ఇవి బేకింగ్ (Baking) ప్రక్రియలో ఆవిరి క్రాకర్స్‌ గుండా ప్రయాణించేందుకు ఉపయోగపడతాయి. దీని ద్వారా క్రాకర్స్‌ ఇతర బిస్కెట్లు లేదా బ్రెడ్‌ల వలె పైకి ఉబ్బకుండా ఉంటాయి.

కొన్ని రకాల బిస్కెట్లకు రంధ్రాలు(Holes) ఉంటాయి. క్రాకర్స్‌ విభాగానికి చెందిన బిస్కెట్లలో రంధ్రాలు ఉంటాయి. ఈ క్రాకర్స్‌(Crackers) చాలా రకాల రుచులు, పరిమాణాలు, ఆకారాలతో అందుబాటులో ఉంటాయి. కానీ అన్నింటిలో సాధారణంగా కనిపించేవి వాటిల్లో ఉండే రంధ్రాలు. ఆ రంధ్రాలు(Holes) అలంకరణ కోసం ఉన్నాయా? ఇంకేదైనా పర్పస్ ఉందా అనేది ఆసక్తికరమైన ప్రశ్న(Question). ఈ క్రాకర్స్‌లోని చిన్న రంధ్రాలను "డాకర్స్(Doctors)" అని కూడా పిలుస్తారు. ఇవి బేకింగ్ (Baking) ప్రక్రియలో ఆవిరి క్రాకర్స్‌ గుండా ప్రయాణించేందుకు ఉపయోగపడతాయి. దీని ద్వారా క్రాకర్స్‌ ఇతర బిస్కెట్లు(Biscuits) లేదా బ్రెడ్‌ల వలె పైకి ఉబ్బకుండా ఉంటాయి. బుడగలు వంటివి ఏర్పడకుండా ఈ రంధ్రాలు నిరోధిస్తాయి. ఆ రంధ్రాలు అలంకరణ కోసం కాదు.. వాటితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

రంధ్రాలు ఉండే క్రాకర్స్‌ బిస్కెట్స్ ఎలా తయారు చేస్తారు?

క్రాకర్స్‌ను తయారు చేసేందుకు అవసరమైన మిశ్రమాన్ని.. పిండి, చక్కెర(Sugar), ఉప్పు(Salt)ను ఉపయోగించి తయారు చేస్తారు. షీట్లలో ఫ్లాట్ రోల్స్‌గా పిండిని ఉంచుతారు. ఈ షీట్లపై ఉండే మిశ్రమంపై "డాకర్ ప్రికిల్ హోల్స్" అని పిలిచే ఒక యంత్రంతో రంధ్రాలు చేస్తారు.

ViewSonic: హోమ్‌, ఆఫీస్‌ల కోసం వ్యూసోనిక్‌ బడ్జెట్‌ మానిటర్లు.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే..!

క్రాకర్స్‌లో హోల్స్‌ ఎందుకు?

రంధ్రం లేకుండా క్రాకర్స్‌ సరిగా కాలవు. క్రాకర్స్‌ తయారీకి ముందు సిద్ధం చేసిన మిశ్రమంలో సాధారణంగా చాలా గాలి బుడగలు ఉంటాయి. క్రాకర్స్‌ను మైక్రోవేవ్‌ అవెన్‌లో వేడి చేసినప్పుడు అవి విస్తరిస్తాయి. క్రాకర్స్‌లోని రంధ్రాలను డాకింగ్ హోల్స్ అంటారు. ఈ బుడగలు విస్తరించకుండా, పగిలిపోకుండా ఆపడానికి డాకర్ అనే యంత్రంతో రోల్స్‌పై ఉంచిన పిండి మిశ్రమంపై రంధ్రాలు చేస్తారు. అప్పుడే క్రాకర్స్‌ సక్రమంగా కాలుతాయి. గాలి బుడగలను తగ్గించడంతో పాటు, క్రాకర్స్‌ క్రిస్పీగా ఉండేలా రంధ్రాలు ఉపయోగపడుతాయి.

Interest Rates: కొత్త ఆర్థిక సంవత్సరంలో PPF, NSC వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి.. ఇతర పథకాల వడ్డీ రేట్లను పరిశీలించండి..

ఇంట్లో తయారు చేసిన క్రాకర్స్‌ను నిల్వ చేయడం ఎలా?

ఇంట్లో సిద్దం చేసిన క్రాకర్స్‌ను మూసివేసిన గాలి చొరబడని పాత్రల్లో నిల్వ చేయాలి. క్రాకర్స్‌ను గాలి చొరబడని బ్యాగ్‌లో లేదా గాజు లేదా ప్లాస్టిక్ బాక్స్‌లలో నిల్వ చేస్తే మంచిది. చీకటి క్యాబినెట్‌లో ఆ పాత్రలను ఉంచాలి. ఇంట్లోనే గోధుమ పిండితో తయారు చేసే క్రాకర్స్‌ ఆరోగ్యానికి మంచివి. బయట మార్కెట్లో దొరికే వాటికి వీలైనంత దూరంగా ఉండటమే మేలు. రాగి, ఓట్స్‌తో కూడా క్రాకర్స్‌ తయారు చేస్తారు. హెల్తీ స్నాక్స్‌గా వీటిని తీసుకోవడం మేలు. ఇంట్లో తయారుచేసుకొనే గ్రాహం క్రాకర్స్ కూడా సూక్ష్మంగా మృదువైన, తేలికగా ఉంటాయి. తేనె తరహాలో తియ్యగా ఉంటాయి. పిల్లలు వీటిని ఎక్కువగా ఇష్టపడతారు.

First published:

Tags: Biscuits, Crackers, Health benefits, Holes, Lifestyle, Two childrens

ఉత్తమ కథలు