Home /News /life-style /

HEALTH WHAT IS THE IDEAL AGE FOR MEN TO HAVE CHILDREN RNK

పురుషులు సంతానం పొందేందుకు అనువైన వయస్సు ఏది? ఈ వయసుకు మించి...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Men fertility rate: మగవారు తండ్రి అవ్వడానికి అత్యంత అనుకూలమైన కాలం 20 ఏళ్ల చివరి నుండి 30 ఏళ్ల వరకు ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

సంతానోత్పత్తి (Fertility) పై వయస్సు వల్ల కలిగే సమస్యలు ,ప్రభావాలను తగ్గించడానికి స్త్రీలు ,పురుషులు ఇద్దరూ నిర్దిష్ట వయస్సు కంటే ముందే పిల్లలను కనాలి. అది తెలివైన పని. చాలా మంది పురుషులు ప్రసవం విషయంలో తమ వయస్సు అడ్డంకి కాదని జన్మనిచ్చే తల్లికి మాత్రమే జీవ గడియారం (Life cycle) ముఖ్యమని భావిస్తారు. కానీ మగవారి వయస్సుతో వారి స్పెర్మ్ సంఖ్య ,నాణ్యత తగ్గుతుంది. జీవసంబంధమైన దృక్కోణం నుండి నిపుణులు తండ్రికి అత్యంత అనుకూలమైన కాలం అతని 20 ఏళ్ల చివరి నుండి 30 ఏళ్ల వరకు ఉంటుందని సూచిస్తున్నారు.

పురుషులు 50 ఏళ్లు ,అంతకంటే ఎక్కువ వయస్సులో కూడా బిడ్డకు తండ్రి కావచ్చు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం 92 ఏళ్ల వృద్ధుడు ఒక బిడ్డకు జన్మనిచ్చాడు. అయితే, మగవారి వయస్సు దంపతులు గర్భం దాల్చే అవకాశాలపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు కనుగొన్నారు. సంతానోత్పత్తి విషయానికి వస్తే 40 ఏళ్లు పైబడిన పురుషులు విజయం సాధించే అవకాశం తక్కువగా ఉంటుందని కూడా చెప్పబడింది. పురుషుల స్పెర్మ్ ఉత్పత్తి సాధారణంగా ఆగిపోకపోయినా, పురుషులకు స్త్రీల వలె 'బయోలాజికల్ క్లాక్' లేదని దీని అర్థం కాదు. మగవాడికి వయసు పెరిగే కొద్దీ అతని స్పెర్మ్ జన్యుపరమైన మార్పులకు లోనవుతుంది. ఈ పరిస్థితి మగ స్పెర్మ్ DNA దెబ్బతినడానికి సంభావ్యతను పెంచుతుంది. ఇది సంతానోత్పత్తిని ప్రభావితం చేయడమే కాకుండా, భవిష్యత్తులో ఒక నిర్దిష్ట మగవారికి జన్మించిన పిల్లల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది.వయస్సు మీరిన తండ్రులకు పుట్టిన పిల్లలు న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్స్‌తో పుట్టే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. 40 ఏళ్లు పైబడిన పిల్లలను కలిగి ఉన్న పురుషుల సంతానం ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌ను అభివృద్ధి చేసే అవకాశం ఐదు రెట్లు ఎక్కువగా ఉందని కొన్నేళ్ల క్రితం నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.

ఇది కూడా చదవండి: ఉడికించిన చికెన్ ఫ్రిజ్ లో పెట్టి తినడం సురక్షితమేనా? తెలుసుకోండి..!


వంధ్యత్వాన్ని నిరోధించే జీవనశైలి..
ధూమపానం, మద్యపానం, ఊబకాయంతో సహా చెడు ఆహారపు అలవాట్లు పురుషులలో స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేసే ప్రధాన జీవనశైలి కారకాలు. స్పెర్మ్ చలనశీలత అనేది స్త్రీ పునరుత్పత్తి మార్గం ద్వారా అండాన్ని చేరుకోవడానికి, సారవంతం కావడానికి స్పెర్మ్ సామర్థ్యాన్ని సూచిస్తుంది. ధూమపానం స్పెర్మ్ కౌంట్ తక్కువతుంది.మెరుగైన స్పెర్మ్ ఉత్పత్తి చేయడానికి...
సంతానోత్పత్తి రేటును పెంచడానికి ఉత్తమమైన స్పెర్మ్‌ను ఉత్పత్తి చేయడానికి పురుషులు ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. మీరు అధిక బరువు కలిగి ఉంటే బరువు తగ్గడం వల్ల గర్భం దాల్చడం సులభం అవుతుంది. మీరు మద్యం, ధూమపానం కలిగి ఉంటే క్రమంగా మానేయడం స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరచడానికి ఉత్తమ మార్గం.

ఇది కూడా చదవండి:  బ్రెస్ట్ కేన్సర్ లక్షణాలు.. రొమ్ముసైజు ఇలా మారితే ప్రమాదమేనట..!


అదనంగా, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. లోయర్ హిప్స్ చల్లగా ఉన్నప్పుడు మంచి స్పెర్మ్ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి పురుషులు ఈ ప్రాంతాలను చల్లగా ఉంచాలి. చాలా బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం, ల్యాప్‌టాప్‌తో ఎక్కువ సేపు పని చేయడం లేదా వేడి వాతావరణంలో ఎక్కువ సమయం గడపడం లేదా ఎక్కువసేపు కూర్చోవడం మానుకోండి.
Published by:Renuka Godugu
First published:

Tags: Health news, Infertility

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు