Skinimalism: స్కినిమలిజం అంటే ఏంటి? మీ చర్మ సంరక్షణలో ఇది ఎలా ఉపయోగపడుతుంది?.. తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

లాక్​డౌన్​ కారణంగా సుదీర్ఘకాలం పాటు అంతా ఇంటికే పరిమితమయ్యారు.ఈ సమయంలో అందం గురించి ప్రాధాన్యత పెరిగింది. ఇది ‘స్కినిమలిజం’ అనే

  • Share this:
లాక్​డౌన్​ కారణంగా సుదీర్ఘకాలం పాటు అంతా ఇంటికే పరిమితమయ్యారు.ఈ సమయంలో అందం గురించి ప్రాధాన్యత పెరిగింది. ఇది ‘స్కినిమలిజం’ అనే కొత్త ఉద్యమానికి దారితీసింది. బయట బ్యూటీ పార్లర్లు మూసివేయడంతో ఎక్కువ మంది నేచురల్​ స్కిన్​పై దృష్టి పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే, కెమికల్​ లేని ప్రోడక్ట్స్​తో చర్మ సౌదర్యాన్ని పెంపొందించుకునేందుకు అంతా ప్రాధాన్యతనిచ్చారు. దీంతో ఆన్​లైన్​లో స్కినిమలిజం అనే కొత్త ఉద్యమం ట్రెండీగా నిలిచింది. అసలు ఇంతకీ స్కినిమలిజం అంటే ఏంటి? అది ఎందుకు ట్రెండింగ్​లో ఉందో తెలుసుకుందాం.

స్కినిమలిజం అంటే ఏమిటి?
ఎటువంటి కెమికల్​ ప్రొడక్ట్స్ వాడకుండా, నేచురల్​ ప్రొడక్ట్స్​తో చర్మాన్ని సంరక్షించుకోవడమే స్కినిమలిజం. చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి పారాబెన్స్, థాలెట్స్, పిఈజిలు, సింథటిక్ సుగంధాలు వంటి రసాయనాలు లేని ఉత్పత్తులతో చర్మాన్ని రక్షించుకోవడమే ఈ ఉద్యమం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. ఎందుకంటే రసాయనాలు కలిగిన ప్రొడక్ట్స్​ వాడకంతో అనేక చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రధానంగా హార్మోన్ అంతరాయం, క్యాన్సర్, చర్మం వంటి హానికరమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల, ఇటీవలి కాలంలో సహజమైన మేకప్​కు ప్రాధాన్యత పెరుగుతుంది. లాక్​డౌన్​ కారణంగా అంతా ఇంటికే పరిమితమైనందున ఇది ట్రెండింగ్​లో నిలిచింది. ఈ కాలంలో ఎక్కువ మంది నేచురల్​ ప్రొడక్ట్స్​తో తయారు చేసిన క్రీముల వైపే మొగ్గుచూపారు. సహజమైన చర్మం ప్రాధాన్యత తెలుసుకున్నారు.

ఎందుకు ట్రెండింగ్‌లో ఉంది?

‘‘ముఖంపై సహజంగా ఏర్పడే మచ్చలు, మొటిమలు, రంధ్రాలు వంటివి మన చర్మ సౌందర్యానికి ఆటకం కలిగిస్తుంటాయి. మనలోని ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇవి దెబ్బతీస్తాయి. ఈ పరిస్థితి పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అందంగా కనిపించాలనే తపన వారిలోనే ఎక్కువగా ఉంటుంది’’ అని ఇండియా స్కిన్ కేర్ సహ వ్యవస్థాపకుడు తన్వి మాలిక్ అన్నారు. ఈ కారణంగా ‘స్కినిమలిజం’ అనే నూతన ఉద్యమం ట్రెండింగ్​గా మారింది. దీని వల్ల విస్తృతమైన చర్మ సంరక్షణ విధానాలు బాగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ విధానాలు అవలంభించడం ద్వారా మొటిమలు, పొడిబారడం, నిర్జలీకరణం, అలసిపోయిన చర్మం, వృద్ధాప్య చర్మం వంటి నిర్దిష్ట చర్మ సమస్యలకు నేచురల్ ప్రొడక్ట్స్​తోనే చెక్​ పెట్టవచ్చు. ఈ విధానంతో చర్మం ఎంతో రిఫ్రెష్​గా కనిపిస్తుంది.

స్కిన్​ కేర్​ కోసం పాటించాల్సినవి..

స్కినిమలిజంను అవలంభించే వారు రోజుకు రెండుసార్లు ముఖం శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. నేచురల్​ ఆయిల్​ను తొలగించకుండా మీ చర్మాన్ని శుభ్రపరిచే హైడ్రేటింగ్​ ప్రొడక్ట్స్​ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. అయితే, మీ చర్మాన్ని తేమగా మార్చడం మాత్రం మర్చిపోవద్దు. తేలికపాటి, జిడ్డు లేని మాయిశ్చరైజర్‌ను రోజుకు కనీసం రెండుసార్లు వాడాలి. గ్లిజరిన్, హైఅలురోనిక్ ఆమ్లం, షియా బటర్, పెట్రోలియం లేదా కొబ్బరి నూనె వంటి వాటితో తయారైన నేచురల్​ ఉత్పత్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
Published by:Krishna Adithya
First published: