వృద్ధాప్యానికి సమీపిస్తున్న ప్రతి ఒక్కరూ సాధారణంగా ఎదుర్కొనే ఇబ్బంది మోకాలి కీళ్ల నొప్పులు. చాలా మందికి మోకాలి చిప్పలు అరిగిపోయి నడవడానికి ఇబ్బంది పడతారు. అయితే, రోబోటిక్ చికిత్సా పద్ధతిలో మోకాలి మార్పిడి చేసి ఆ ఇబ్బందులు తొలగించే అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను పంచుకున్నారు డాక్టర్ సమర్థ్ ఆర్య. ఈ కొత్త పద్ధతులను సాధ్యమైనంత వేగంగా అందిపుచ్చుకోవాలని ఆయన చెబుతున్నారు. ఎందుకంటే, కొత్త పద్ధతులను అవలంబించడంలో ఫెయిల్ అయితే, రోగులకు పనికొచ్చే సాంకేతిక పురోగతిని తిరస్కరించటమే అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
* రోబోటిక్ టీకేఏ(TKA)
రోబోట్ అనేది రోబోటా అనే పోలిష్ పదం నుంచి పుట్టింది. టోటల్ నీ (knee) ఆర్థ్రోప్లాస్టీ (TKA) అనే మోకాలి చికిత్సను రోబో స్వయంగా చేస్తుంది కాబట్టి దీన్ని రోబోటిక్ టీకేఏ అని అంటున్నారు. ఇన్నాళ్లు వైద్యులే చికిత్స చేసి మోకీలు మార్చేవారు. ఇప్పుడు వైద్యుల స్థానంలో రోబోటిక్స్ వచ్చాయి. దీనికి తగిన టెక్నాలజీ అభివృద్ధి ఈ రంగంలో జరిగింది.
* యూని-కంపార్ట్‌మెంటల్ మోకాలి ఆర్థ్రోప్లాస్టీ (UKA)
యూని-కంపార్ట్‌మెంటల్ మోకాలి ఆర్థ్రోప్లాస్టీ(UKA) అనేది సింగిల్-కంపార్ట్‌మెంట్ ఆస్టియో ఆర్థరైటిస్ (OA) ఉన్న రోగులకు, ఎక్కువ శాతం వైకల్యం లేదా లిగమెంటస్ లోపం లేనివాళ్లకు అనుకూలమైన వైద్య చికిత్స. యూని-కంపార్ట్‌మెంటల్ నీ ఆర్థ్రోప్లాస్టీ(UKA), టోటల్ నీ ఆర్థ్రోప్లాస్టీ(TKA) చికిత్సలు రెండింటిలోనూ మోకాలి ఎముక తయారీ, కాంపోనెంట్ అలైన్‌మెంట్‌లో పర్ఫెక్షన్ ఉంటుంది. అవుట్‌లైనర్స్‌ని తగ్గించి, టార్గెట్ గోల్‌కి 2° లేదా 3° పరిధిలోనే అలైన్ అయ్యే కాంపోనెంట్ల శాతాన్ని పెంచుతుంది.
* సమానంగా బరువు పంపిణీ
కరోనల్ ప్లేన్‌లో 3° కంటే ఎక్కువ వరస్ లేదా వాల్గస్ మాలిలైన్‌మెంట్ ప్రొస్థెసిస్ ద్వారా మోకాలిపై బరువు అసమానంగా పడుతుంది. ఇది ప్రీ రేడియోగ్రాఫిక్ లైసిస్‌కు దారి తీస్తుంది. ఆ తర్వాత అసెప్టిక్ లూజు అయ్యే ప్రమాదం ఉంది. ఇంప్లాంట్ సైజింగ్, కాంపోనెంట్ పొజిషనింగ్, బోన్ ప్రిపరేషన్‌లో కచ్చితత్వాన్ని పెంచటం కోసం రోబోటిక్ సిస్టమ్స్ డెవలప్ అయ్యాయి. అవుట్‌లైయర్స్ ప్రమాదాన్ని ఇవి మరింత తగ్గిస్తాయి. క్లినికల్ రిజల్ట్‌ను మెరుగుపర్చి ఎక్కువ రోజులపాటు మనుగడ ఉండేలా ఇవి మెరుగుపరుస్తాయి.
* రోబోటిక్ డిజైన్స్
మోకాలి కీళ్లకు సంబంధించి ఒక్కో రోగికీ ఒక్కో రకమైన చికిత్స అందించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పలు రకాల రోబో డిజైన్లను చేశారు. వాటిలో కొన్ని ఇక్కడ చూద్దాం.
1. యాక్టివ్
సర్జన్‌తో సంబంధం లేకుండా విధిని నిర్వహిస్తాయి
2. పాసివ్
నిరంతరం, ప్రత్యక్ష సర్జన్ నియంత్రణలోనే పూర్తిగా ఉంటుంది
3. సెమీ యాక్టివ్
సర్జన్ ప్రమేయం అవసరం. కానీ ఫీడ్‌బ్యాక్‌ను ఇది అందిస్తుంది.
* ప్రయోజనాలు
రోబోటిక్ సర్జరీలతో కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కచ్చితత్వం, స్వల్ప గాయం, అధిక భద్రత, పెరిగిన స్థిరత్వం, మెరుగైన కచ్చితత్వం, వేగవంతమైన రికవరీ, తగ్గిన రిహాబిలిటీ, సౌలభ్యత, నమ్మకం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. సర్జన్ పరిధిలోనే ఆపరేషన్ జరిగినా, ఇది పూర్తిగా రోబోటిక్ ద్వారానే జరుగుతుంది, ఈ అడ్వాన్స్‌డ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ వైద్యపరంగా నిరూపితమైంది.
* పరిమితులు
ఈ విభాగంలో రోబోటిక్స్ సర్జరీలపై దీర్ఘకాలిక ఫలితాల అధ్యయనాలు అందుబాటులో లేవు. ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెట్టుబడిపై ఆందోళన కూడా ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health care, Health Tips, Knee pain, Robotics