• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • HEALTH WHAT IS INTELLECTUAL PROPERTY DO LAWS PROTECT INTELLECTUAL PROPERTY RIGHTS IN INDIA SU GH

Intellectual property: మేధో సంపత్తి అంటే ఏంటి? భారత్‌లో మేధో సంపత్తి హక్కులకు చట్టాలు రక్షణ కల్పిస్తున్నాయా? పూర్తి వివరాలు..

Intellectual property: మేధో సంపత్తి అంటే ఏంటి? భారత్‌లో మేధో సంపత్తి హక్కులకు చట్టాలు రక్షణ కల్పిస్తున్నాయా? పూర్తి వివరాలు..

ప్రతీకాత్మ కచిత్రం

ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ లేదా మేధో సంపత్తి అనేది మనిషి తెలివితేటలకు సంబంధించిన ఆస్తిగా భావిస్తారు. వీటిపై లభించే హక్కులకు చట్టపరమైన రక్షణ లభిస్తుంది.

  • Share this:
ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ లేదా మేధో సంపత్తి అనేది మనిషి తెలివితేటలకు సంబంధించిన ఆస్తిగా భావిస్తారు. వీటిపై లభించే హక్కులకు చట్టపరమైన రక్షణ లభిస్తుంది. మేధస్సు లేదా తెలివితేటల ద్వారా మనుషులు సృష్టించిన వస్తువులు, ఇతర కష్టార్జితంపై అన్ని హక్కులు.. దాని సృష్టికర్తకే ఉంటాయి. దీన్ని వ్యక్తుల మేధస్సుకు లభించే కనిపించని ఆస్తిగా భావిస్తారు. మన దేశంలో చాలా రకాల మేధో సంపత్తి హక్కులు అమల్లో ఉన్నాయి. కాపీరైట్‌, పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌లు, ట్రేడ్ సీక్రెట్లు.. వంటివన్నీ ఈ విభాగంలో ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాల చట్టాల్లో మేధో సంపత్తి హక్కులను చేర్చారు. న్యాయ వ్యవస్థల్లో దీనికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

* ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ (IP) లేదా మేధో సంపత్తి అంటే ఏంటి?
మేధో సంపత్తి అనేది కంటికి కనిపించని ఆస్తుల్లో భాగంగా ఉంటుంది. మనుషులు తమ తెలివితేటలతో సృష్టించే ఆవిష్కరణ, సాహిత్య, కళాత్మక పని, డిజైన్లు, చిహ్నాలు (సింబల్స్), పేర్లు, చిత్రాలు (ఇమేజెస్) వంటివి ఈ జాబితాలో ఉంటాయి. వీటికి వ్యక్తుల మనసు, తెలివితేటలు ప్రాణం పోస్తాయి. వీటి సృష్టికి సంబంధించిన ఐడియాలు కంటికి కనిపించవు. ఈ ఐడియాలనే మేధో సంపత్తి అంటారు.

* మేధో సంపత్తికి చట్టం రక్షణ కల్పించాల్సిన అవసరం ఏంటి?
మేధో వస్తువుల (ఇంటలెక్చువల్ గూడ్స్) సృష్టిని ప్రోత్సహించడమే మేధో సంపత్తి చట్టం (IP law) ముఖ్య ఉద్దేశం. వ్యక్తులు కనిపెట్టిన లేదా సృష్టించిన వస్తువులకు లభించే గుర్తింపు, వాటి ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాలపై పూర్తి హక్కులు సృష్టికర్తలకే చెందాలని ఈ చట్టాలు చెబుతున్నాయి. సృజనాత్మకత, ఆవిష్కరణలు వృద్ధి చెందే వాతావరణాన్ని పెంపొందించడం దీని లక్ష్యం.

* భారత్‌లో ఎన్ని రకాల మేధో సంపత్తి హక్కులు ఉన్నాయి?
కాపీరైట్, పేటెంట్, ట్రేడ్‌మార్క్‌, ఇండస్ట్రియల్ డిజైన్స్, జియోగ్రాఫికల్ ఇండికేషన్స్, ట్రేడ్ సీక్రెట్స్.. వంటివి మేధో సంపత్తి హక్కుల జాబితాలో ఉన్నాయి.

* కాపీరైట్ అంటే ఏంటి?
కాపీరైట్ అనేది ఒక రచయిత లేదా యజమానికి చట్టం కల్పించిన హక్కుల జాబితా. ఒక రచనపై దాన్ని రచించిన లేదా సృష్టించిన వ్యక్తికే సర్వ అధికారాలు ఉంటాయి. సాహిత్యం, నాటక రంగం, సంగీతం, కళాత్మక రచనలు, సినిమాటోగ్రాఫిక్ ఫిల్మ్, సౌండ్ రికార్డింగ్‌.. వంటి విభాగాలకు కాపీరైట్ వర్తిస్తుంది.

* పేటెంట్లు అంటే?
ఒక ఆవిష్కరణపై యజమానికి కల్పించే హక్కును పేటెంట్ అంటారు. పేటెంట్ అనేది యజమానికి తన ఆవిష్కరణను ఎలా ఉపయోగించాలి, దాని ద్వారా ఎలా డబ్బు సంపాదించాలి.. అనే నిర్ణయంపై పూర్తి హక్కును కల్పిస్తుంది.

* ట్రేడ్‌మార్క్‌ అంటే?
ట్రేడ్ మార్క్స్ చట్టం, 1999 ప్రకారం.. ట్రేడ్ మార్క్ అనేది ఒక గుర్తు. ఒక వ్యక్తికి సంబంధించిన వస్తువులు లేదా సేవలను ఇతరుల ఉత్పత్తుల నుంచి వేరు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండే గ్రాఫికల్ రిప్రజెంటేషన్‌ను ట్రేడ్‌మార్క్ అంటారు. వస్తువుల ఆకారం, వాటి ప్యాకేజింగ్, కలర్ కాంబినేషన్.. వంటివన్నీ ట్రేడ్‌మార్క్ కిందకు వస్తాయి.

* జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ (GI) అంటే?
ఏదో ఒక నిర్దిష్ట ప్రాంతంలో రూపొందించే వస్తు సేవలను.. అవి ఆ ప్రాంతానికి చెందిన ప్రత్యేకమైన ఉత్పత్తులుగా ధ్రువీకరిస్తూ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ లేదా GI ఇస్తారు. దీంట్లో వస్తువుల లక్షణాలు, వాటి ప్రాధాన్యత, కీర్తి.. వంటి వాటిని భౌగోళిక మూలాలకు ఆపాదిస్తారు.

* మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘన అంటే ఏంటి?
చట్టపరంగా యజమానులకు లభించిన మేధో సంపత్తి హక్కులను అక్రమంగా వినియోగించినప్పుడు.. హక్కుల ఉల్లంఘన జరిగిందని భావిస్తారు. ఈ హక్కులను ఉల్లంఘించిన వారిపై మేధో సంపత్తి రకం, అధికార పరిధి, చర్య స్వభావాన్ని బట్టి.. సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు.

* IP చట్టం ఎందుకు ముఖ్యమైనది?
IP చట్టం.. మేధో సంపత్తికి సంబంధించిన చట్టపరమైన హక్కులను నిర్వచిస్తుంది. మేధో సంపత్తి వినియోగం, వాణిజ్యపరమైన ఉపయోగాలు, మార్కెటింగ్, పంపిణీ, ఉల్లంఘన, ఇతర అంశాలపై.. యాజమాన్యం వినియోగ హక్కులకు రక్షణ కల్పిస్తుంది.

* భారతదేశంలో మేధో సంపత్తిని రక్షించే చట్టాలు ఏమున్నాయి?
భారతదేశంలో కాపీరైట్ చట్టం- 1957 (2012లో సవరణలు చేశారు); ట్రేడ్ మార్క్ చట్టం- 1999; డిజైన్ చట్టం- 2000, పేటెంట్ చట్టం- 2005... వంటి చట్టాలు వివిధ రకాల మేధో హక్కులకు రక్షణ కల్పిస్తున్నాయి.
Published by:Sumanth Kanukula
First published: