హోమ్ /వార్తలు /life-style /

Broken Heart Syndrome: బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటే ఏంటి..? ఒత్తిడి గుండెపై ఎలా ప్రభావం చూపుతుంది?

Broken Heart Syndrome: బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటే ఏంటి..? ఒత్తిడి గుండెపై ఎలా ప్రభావం చూపుతుంది?

Broken Heart Syndrome: బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటే ఏంటి..? ఒత్తిడి గుండెపై ఎలా ప్రభావం చూపుతుంది?

Broken Heart Syndrome: బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటే ఏంటి..? ఒత్తిడి గుండెపై ఎలా ప్రభావం చూపుతుంది?

Broken Heart Syndrome: సాధారణంగా ఎదురయ్యే ఒత్తిడికి, తీవ్రమైన ఒత్తిడికి తేడా ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడి కారణంగా గుండెపై ప్రభావం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులను సకాలంలో గుర్తించకపోతే ముప్పు తప్పదు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

జీవితంలో ఏదో ఒక దశలో అందరూ ఒత్తిడికి లోనవుతారు. కానీ సాధారణంగా ఎదురయ్యే ఒత్తిడికి, తీవ్రమైన ఒత్తిడికి తేడా ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడి కారణంగా గుండెపై ప్రభావం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులను సకాలంలో గుర్తించకపోతే ముప్పు తప్పదు. ఎమోషనల్‌, ఫిజికల్‌, మెంటల్‌గా ప్రభావితమైనప్పుడు శరీరంలో స్ట్రెస్‌ హార్మోన్‌ కార్టిసాల్ విడుదలవుతుంది. దీంతో పాటు రక్తపోటు, స్లీపింగ్‌ ప్యాటర్న్స్‌, బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌, హార్ట్‌ రేట్‌న ప్రభావితం చేసే అడ్రినలిన్‌ కూడా రిలీజ్‌ అవుతుంది. తీవ్రమైన ఒత్తిడి కారణంగా సంభవించే గుండె సంబంధిత సమస్యను తకోట్సుబో కార్డియోమయోపతి లేదా బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటారు.

ఒత్తిడి వ్యక్తికి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. ఇందులో అక్యూట్‌, ఎపిసోడిక్ అక్యూట్‌ స్ట్రెస్‌, క్రోనిక్‌ స్ట్రెస్‌ వంటివి ఉన్నాయి. వీటిని లక్షణాలు, సంకేతాలు, వ్యవధి, చికిత్స విధానాల ఆధారంగా విభజించారు. ఒత్తిడిని ఎల్లప్పుడూ చెడ్డ విషయంగా పరిగణించరు, రోజువారీ పనికి ప్రతిస్పందనగా భావిస్తారు. సరైన మొత్తంలో ఒత్తిడి ఒక వ్యక్తిని అప్రమత్తంగా ఉండటానికి, ఆలోచించడానికి మోటివేట్‌ చేస్తుంది. కానీ అధిక ఒత్తిడి మాత్రం హానికరమని చెబుతున్నారు బెంగళూరులోని రిచ్‌మండ్ రోడ్ ఫోర్టిస్ హాస్పిటల్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ డైరెక్టర్, డాక్టర్ రాజ్‌పాల్ సింగ్. ఎక్కువ స్ట్రెస్‌ కారణంగా టెన్షన్‌, ఆత్రుత పెరుగుతాయని, కొన్ని తీవ్రమైన అనారోగ్యాలకు దారి తీస్తుందని వివరించారు. స్ట్రెస్‌ లక్షణాలు, చికిత్స గురించి ఆయన చెప్పిన వివరాలు చూద్దాం.

** ఒత్తిడి మూడు రకాలు

* అక్యూట్‌ స్ట్రెస్‌(తీవ్రమైన ఒత్తిడి)

అక్యూట్‌ స్ట్రెస్‌ అత్యంత సాధారణ రకాల్లో ఒకటి. ఇది తరచుగా వస్తుంది, చాలా తక్కువ కాలం ఉంటుంది. ఇది ప్రధానంగా అతిగా ఆలోచించడం, సమీప భవిష్యత్తులో ఏదైనా సంఘటనలు లేదా డిమాండ్లపై నెగిటివ్‌గా థింక్‌ చేయడం కారణంగా సంభవిస్తుంది. తాత్కాలిక మానసిక క్షోభ, తలనొప్పి, మెడ నొప్పి, కొన్నిసార్లు తాత్కాలిక కడుపు నొప్పి, పేగు సమస్యలు, గుండెల్లో మంట, గ్యాస్‌ సమస్యలు, అతిసారం, మలబద్ధకం వంటి సమస్యల ద్వారా గుర్తించవచ్చు.

Dr Rajpal Singh, Director, Interventional Cardiology, Fortis Hospital, Richmond Road, Bengaluru

* ఎపిసోడిక్ అక్యూట్ స్ట్రెస్

ఈ రకమైన ఒత్తిడిలో వ్యక్తి తరచుగా తీవ్రమైన ఒత్తిడిని అనుభవిస్తాడు. గందరగోళం, సంక్షోభాల జీవితాన్ని గడుపుతారు. వారి భావోద్వేగాలు పూర్తిగా ఒత్తిడతో, అన్‌ ఆర్గనైజ్డ్‌గా ఉంటాయి. ఈ రకమైన ఒత్తిడిని టైప్ ఎ, వర్రియర్(Worrier) వంటి రెండు విభిన్న వ్యక్తిత్వాలలో గుర్తించవచ్చు. టైప్ A వ్యక్తిత్వం ఉన్న వారిలో తీవ్రమైన ఒత్తిడిని తరచుగా గుర్తించవచ్చు. ఈ సమయంలో వారు దూకుడుగా, అసహనంతో, అత్యవసరంగా పనులు చేపట్టాలన్నట్లు ప్రవర్తిస్తారు. ఈ లక్షణాలు కరోనరీ హార్ట్ డిసీజెస్‌కు దారితీస్తాయి. ఎక్కువ ఆందోళన చెందే వ్యక్తులు, ప్రతిదానిపై నెగెటివ్‌ థాట్స్‌తో ఉంటారు.

* క్రోనిక్‌ స్ట్రెస్‌(దీర్ఘకాలిక ఒత్తిడి)

తీవ్రమైన, దీర్ఘకాలిక, హానికరమైన ఒత్తిడి రకాన్ని క్రోనిక్‌ స్ట్రెస్‌గా పేర్కొంటారు. బాల్యంలో ఎదుర్కొన్న కఠిన పరిస్థితులు, జీవితంలో బాధాకరమైన అనుభవాల వల్ల ఈ పరిస్థితి తలెత్తవచ్చు.

* టకోట్సుబో కార్డియోమయోపతి

టకోట్సుబో కార్డియోమయోపతిని బ్రోకెన్‌ హార్ట్‌ సిండ్రోమ్ లేదా స్ట్రెస్‌ ఇండ్యూస్డ్‌ కార్డియోమయోపతి అని కూడా పిలుస్తారు. ఇది గుండె ప్రధాన గది, ఎడమ జఠరిక బలహీన పడేలా చేస్తుంది. ఇది సాధారణంగా తీవ్రమైన మానసిక లేదా శారీరక ఒత్తిడి కారణంగా సంభవిస్తుంది. సన్నిహితులను కోల్పోవడం, ఆకస్మిక ప్రమాదం, రక్తపోటులో ఆకస్మిక తగ్గుదల, తీవ్రమైన భయం వంటి కారణాలతో వస్తుంది.

* గుండెపై ఒత్తిడి ప్రభావం

ఒత్తిడి శరీరంపై, ముఖ్యంగా గుండెపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని చెప్పడంలో తప్పు లేదు. గుండెకు, ఒత్తిడికి ఎల్లప్పుడూ సంబంధం ఉంటుంది. ఒక వ్యక్తి ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు.. అమిగ్డాలా (ఒత్తిడిని పర్యవేక్షించే మెదడులోని ప్రాంతం) మరింత తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేయమని ఎముక మజ్జకు సంకేతాలు ఇస్తుంది. దీని వలన ధమనులు వాపుకు గురవుతాయి. అంతే కాకుండా గుండెపోటు, స్ట్రోక్‌, ఆంజినా (గుండెకు రక్త ప్రసరణ తగ్గడం వల్ల కలిగే ఒక రకమైన ఛాతీ నొప్పి) వంటివి ఎదురవుతాయి. బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అనేది తీవ్రమైన ఒత్తిడి వల్ల వచ్చే హృదయ సంబంధ వ్యాధులు.

* స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్ అవసరం

ఒత్తిడి ద్వారా గుండె జబ్బులను నివారించడానికి, రోజువారీ జీవితంలో కొన్ని సాధారణ టిప్స్‌ అనుసరించాలి. ఇవి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతాయి. ఒత్తిడిని నిర్వహించడం ఒక్కరోజులో సాధించలేరు, ప్రతిరోజూ సాధన చేయాలి.

** గుండెకు మేలు చేసే స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్ టిప్స్‌

* పాజిటివ్‌గా ఉండండి

మంచి నవ్వు హృదయానికి సహాయపడుతుంది. నవ్వు ఒత్తిడి హార్మోన్ల స్థాయిని తగ్గిస్తుంది. ధమనులలో వాపును తగ్గిస్తుంది. మంచి HDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

* వ్యాయామం

శరీరం శారీరకంగా చురుకుగా ఉన్న ప్రతిసారీ, ఎండార్ఫిన్‌లు అనే మానసిక స్థితిని పెంచే రసాయనాలను విడుదల చేస్తుంది. వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడిని దూరం చేయడమే కాకుండా రక్తపోటును తగ్గించి, గుండె కండరాలను బలోపేతం చేయడం ద్వారా గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. వ్యాయామం లేకపోవడం, క్రమంగా బరువు పెరగడానికి దారితీస్తుంది. తద్వారా కరోనరీ ఆర్టరీ వ్యాధి అభివృద్ధి చెందే ప్రమాదం కూడా పెరుగుతుంది. ప్రజలు ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో యోగా, ధ్యానం వంటివి చేయాలి.

* అతిగా తినడం, రక్తపోటు, మధుమేహం

ఒత్తిడి సమయంలో ప్రజలు తరచుగా అతిగా తినడానికి ఇష్టపడతారు. ఇది మధుమేహం, రక్తపోటు వంటి పరిస్థితులకు దారితీయవచ్చు. చిప్స్ బ్యాగ్‌ను తినడానికి బదులు సాల్మన్, అవకాడో, ఆస్పరాగస్, డార్క్ చాక్లెట్ వంటి పోషకాలు, యాంటీఆక్సిడెంట్‌లు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఒత్తిడితో కూడిన పరిస్థితుల నుంచి దృష్టి మరల్చడానికి స్నేహితులను కలవాలి. విశ్రాంతి తీసుకోవడానికి సమయాన్ని వెచ్చించాలి. ఒత్తిడిని ఎదుర్కోవడానికి ధూమపానం లేదా అతిగా తినడం వంటి అనారోగ్యకరమైన అలవాట్లపై ఆధారపడకుండా చూసుకోవాలి.

First published:

Tags: Health care, Heart, Heart Attack, Stress

ఉత్తమ కథలు