Epilepsy: ఈ రోజుల్లో మూర్ఛ వ్యాధి బారిన పడుతున్న మహిళల సంఖ్య పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వయసు, జెండర్‌తో సంబంధం లేకుండా మూర్ఛ వస్తుంది. కానీ మహిళలు మాత్రం ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బ్రెయిన్ డిజార్డర్ ద్వారా మూర్ఛ లేదా ఫిట్స్ వస్తాయి. మెదడులో ప్రభావితమైన భాగంపై ఆధారపడి మూర్ఛ లక్షణాలు ఉంటాయి. అవయవాలు వణకడం, తదేకంగా చూడటం, ఆకస్మికంగా పడిపోవడం, కన్‌ఫ్యూజన్, స్పృహ కోల్పోవడం, స్ట్రేంజ్ ఎమోషనల్ ఫీలింగ్, ఆందోళన, సైకోసిస్ వంటి ఇతర లక్షణాలు కనిపిస్తాయి.
ఈ సమస్య ఉన్న మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, చికిత్స తదితర వివరాలను బెంగళూరు, ఎలక్ట్రానిక్ సిటీ, కావేరి హాస్పిటల్స్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ ఎపిలెప్టాలజిస్ట్, MD, DM (న్యూరాలజీ) డాక్టర్ సోనియా తాంబే తెలిపారు.
* హార్మోనల్/మెన్‌స్ట్రువల్ సైకిల్
మహిళల్లో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ముఖ్యమైన హార్మోన్లు. ప్రో-కన్వల్సెంట్‌లో ఈస్ట్రోజెన్ (మూర్ఛ ప్రమాదాన్ని పెంచుతుంది), ప్రొజెస్టెరాన్ యాంటీ కన్వల్సెంట్ (మూర్ఛ ప్రమాదాన్ని తగ్గిస్తుంది). స్త్రీ జీవితంలో యుక్తవయసు, పీరియడ్స్, గర్భం, రుతువిరతి అంతటా హార్మోన్ లెవల్స్, హార్మోన్ల సమతుల్యతలో మార్పులు జరుగుతాయి. ఈ పరిస్థితులలో మూర్ఛ ప్రమాదం పెరుగుతుంది. కొంతమంది స్త్రీలకు వారి రుతుచక్రం చుట్టూ నిర్దిష్ట సమయంలో మూర్ఛ వస్తుంది, ప్రత్యేకంగా రుతుస్రావం ముందు, దీనిని "కాటామెనియల్ ఎపిలెప్సీ" అంటారు (కటామెనియోస్ అనేది రుతుక్రమానికి లాటిన్ పదం).
* మూర్ఛ ఉన్న స్త్రీలకు గర్భనిరోధకం (బర్త్ కంట్రోల్)
యాంటీ-సీజర్ డ్రగ్స్ హార్మోనల్ బర్త్ కంట్రోల్‌ను తక్కువ ప్రభావవంతంగా చేస్తాయి. కొన్ని సందర్భాల్లో హార్మోనల్ బర్త్ కంట్రోల్ యాంటీసీజర్ డ్రగ్స్‌ను తక్కువ ప్రభావం చూపేలా చేస్తుంది. అందుకే గర్భనిరోధకం కోసం అవరోధ పద్ధతులైన (కండోమ్/డయాఫ్రాగమ్), లేదా గర్భాశయంలో డివైజ్‌ను ఉపయోగించడం మూర్ఛ ఉన్న స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది.
* స్త్రీలలో మూర్ఛ, సంతానోత్పత్తి
అధ్యయనాల ప్రకారం.. మూర్ఛ ఉన్న స్త్రీలకు తక్కువ మంది పిల్లలు ఉన్నారు. సాధారణంగా పుట్టుకతో లోపాలు వస్తాయనే భయం, లైంగిక సామర్థ్యం, అనోవ్లేటరీ సైకిల్స్ (అండాశయం నుంచి గుడ్డు విడుదల చేయని చక్రాలు), పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్‌తో బిడ్డ పుడుతుందనే కారణాలు కనిపిస్తున్నాయి. అయితే 2018లో అధ్యయనం ప్రకారం.. వంధ్యత్వం లేదా సంబంధిత రుగ్మత ముందస్తు నిర్ధారణ లేకుండా మూర్ఛ ఉన్న స్త్రీలు, మూర్ఛ లేని వారితో పోలిస్తే ఒకే విధమైన గర్భధారణ రేటు నమోదైంది. ఇలాంటి అంశాల్లో తరచూ హెల్త్ కేర్ ప్రొవైడర్‌ను సంప్రదించాలి.
* మూర్ఛ, గర్భం
మూర్ఛతో బాధపడుతున్న చాలా మంది స్త్రీలు అసమంజసమైన గర్భధారణ కాలాన్ని కలిగి ఉంటారు. కొంతమంది మహిళలు ముఖ్యంగా అనియంత్రిత మూర్ఛలు ఉన్నవారికి తరచూ మందులు, పర్యవేక్షణ అవసరం. కొన్ని మందులు పుట్టబోయే బిడ్డలో పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదాన్ని పెంచుతాయని పరిశోధనలో తేలింది.
వాల్ప్రోయిక్ ఆమ్లం, కార్బమాజెపైన్, ఫెనోబార్బిటల్, ఫెనిటోయిన్, టోపిరామేట్ వంటి మందులు ఉన్నాయి. అత్యంత సాధారణంగా పుట్టుకతో వచ్చే లోపాలలో వెన్నెముక సమస్యలు, స్పైనా బిఫిడా, చీలిక పెదవి, గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయి. అదే విధంగా పిల్లలలో ఆలస్యంగా మాటలు రావడం, లాంగ్వేజ్, జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అందుకే వీరు గర్భధారణకు ముందు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకోవడం ప్రారంభించాలి. గర్భధారణ సమయంలో యాంటీసీజర్ మందులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. మూర్ఛ ఉన్న స్త్రీల్లో బేబీ గ్రోత్ ఎలా ఉందనేది ఎప్పటికప్పుడు వైద్యులతో మానిటరింగ్ చేయించాలి.
* తల్లిపాలు, మూర్ఛ మందులు
తల్లిపాలు ఇవ్వడం ద్వారా బిడ్డకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. శిశువు ఆరోర్యం మెరుగవుతుంది, తల్లితో బాండింగ్ ఏర్పడుతుంది. చాలా యాంటిసీజర్ మందుల ప్రభావం తల్లిపాలలో చాలా తక్కువగా ఉంటుంది. శిశువుకు తల్లిపాలు ఇవ్వడం సురక్షితం. చురుకుదనం, నిద్రలేమి, బరువు పెరగకపోవడం, ఎదుగుదల సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించడం అవసరం. కొన్ని చిట్కాలు పాటిస్తే శిశువుపై తల్లి తీసుకునే మందుల ప్రభావాన్ని తగ్గించవచ్చు. శిశువు ఎక్కువసేపు నిద్రించే సమయంలో రోజుకు ఒకసారి మందులు తీసుకోవాలి. మందులు తీసుకునే ముందే బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలి.
Life Style: 5000కే అద్భుతమైన ఎయిర్ కూలర్స్ ..ఆ 5 రకాల కూలర్స్ డిటెయిల్స్
* సోషల్ సర్కిల్, ఫ్యామిలీలో కష్టాలు
మూర్ఛ ఉన్న స్త్రీలపై మానసిక సామాజిక ఒత్తిడి ఉంటుంది. వారు విద్య , ఉపాధి, మొబిలిటీ, తక్కువ ఆత్మగౌరవం, సోషల్ ఇంటరాక్షన్, రిలేషన్‌షిప్‌లలో కష్టాలను అనుభవిస్తారు. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న స్త్రీలను కుటుంబాలు ఎగతాళి చేయడం, నిర్లక్ష్యం చేయడం, విడిచిపెట్టడం వంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మూర్ఛ ఉన్న స్త్రీల జీవితాలను మెరుగుపరిచేందుకు హెల్త్ కేర్ ప్రొవైడర్స్, సోషల్ వర్క్స్, పాలసీ మేకర్స్ చర్యలు తీసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health, Health alert