Health : మెంతులతో మన ఆరోగ్యానికి ఎంతో మేలు

Health Benefits of Methi | మన అదృష్టం కొద్దీ మన దేశంలో ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలు, మూలికలూ ఉన్నాయి. వాటిలో ఒకటైన మెంతులతో ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

news18-telugu
Updated: February 26, 2020, 8:26 AM IST
Health : మెంతులతో మన ఆరోగ్యానికి ఎంతో మేలు
మెంతులతో ఆరోగ్య ప్రయోజనాలు...
  • Share this:
మెంతుల్ని చూడగానే చాలా మంది... "అవా... వద్దురా బాబూ... చేదుగా ఉంటాయ్" అంటూ పక్కన పెడతారు. కానీ కాకరకాయ్, మెంతుల వంటివి చేదుగా ఉన్నా... మన ఆరోగ్యాన్ని అవి విపరీతంగా కాపాడతాయి. కాబట్టి... మెంతులు మనం రెగ్యులర్‌గా వాడాలి. మన ఇళ్లలో పోపు డబ్బాల్లో మిగతావాటితో పాటూ... మెంతులు కూడా కచ్చితంగా ఉండాలి. పాంచ్ ఫోరాన్ అనేవి ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు. ఆ పాంచ్ ఫోరాన్లలో మెంతులు కూడా ఉంటాయి. అంటే మెంతులకు ఉన్న ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు. అందుకే మెంతుల్ని పచ్చళ్లు, పుసులులు, పోపుల్లో వాడుతుంటారు. వాటిని డైరెక్టుగా వాడినా, నానబెట్టి వాడినా, మెలకల రూపంలో తీసుకున్నా... పొడి చేసి వాడినా... ఎలాగైనా ప్రయోజనమే. ఆ ఉపయోగాలేంటో తెలుసుకుందాం.

- మెంతుల్లో పోషకాలు, ఫైబర్, ఐరన్, విటమిన్ C, B1, B2, కాల్షియం బాగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

- జుట్టు సమస్యలకు సరైన పరిష్కారం మెంతులు. మెంతులను నానబెట్టి ఆ నీటిని జుట్టుకి పట్టించండి. మంచి ఫలితం ఉంటుంది. మెంతుల్ని పెరుగులో నానబెట్టి మిక్సీ జ్యూస్‌లా చెయ్యాలి. దాన్ని తలకి ప్యాక్‌లా వేసుకుని ఆరిన తర్వాత కడిగేస్తే చాలు. జుట్టు సమస్యలు దూరం అవుతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. రంగు కూడా నెరవకుండా ఉంటుంది. ఎన్నో లాభాలుంటాయి.

- జీర్ణ సమస్యలతో బాధపడేవారు మెంతుల్ని వాడితే చాలు. వాటిలో ఫైబర్... ఆహారం చక్కగా జీర్ణమయ్యేలా చేస్తుంది. మెంతుల్ని నానబెట్టి ఆ నీరు తాగితే ప్రయోజనం ఉంటుంది.



- ఓ గ్లాస్ నీటిలో టీ స్పూన్ మెంతుల్ని నానబెట్టి... ఆ నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల మలబద్ధకం, జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

- బాలింతలు మెంతుల్ని నేరుగా తీసుకున్నా పొడి రూపంలో తీసుకున్నా పాల ఉత్పత్తి పెరుగుతుంది. మెంతుల్ని కషాయంగా చేసుకుని తాగినా... మెంతికూర పప్పు తిన్నా... పాల ఉత్పత్తి పెరుగుతుంది.

- షుగర్ వ్యాధితో బాధపడేవారు మెంతుల నీటిని రెగ్యులర్‌గా తాగడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది.-కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యానికి మెంతులు ఎంతో ఉపయోగపడుతుంది.

-శరీరంలో కొలస్ట్రాల్ సరైన మోతాదులో ఉంచేందుకు, శరీరంలో వ్యర్థంగా ఉన్న కొవ్వును తగ్గించుకునేందుకు ఇది మేలు చేస్తుంది.

- కండరాల నొప్పులకు కూడా మెంతులు ఓ అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది.

మరెందుకు ఆలస్యం...మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మెంతులను ఇప్పటికే మీ వంట గది నుంచి బహిష్కరించి ఉంటే...ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాటిని తిరిగి మీ వంట గదికి ఆహ్వానించండి.
First published: February 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు