Home /News /life-style /

HEALTH WHAT ARE STEROIDS AND WHAT ARE THE USES SIDE EFFECTS AND RISKS GH SSR

Steroids: కరోనా తరువాత పెరిగిన స్టెరాయిడ్స్ వాడకం.. అసలు వీటిని వాడితే ఏమౌతుంది..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా మహమ్మారి వైద్య, ఆరోగ్య రంగంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపింది. వైరస్ సోకిన చాలామంది దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వైరల్ లోడ్ ఎక్కువగా ఉన్న వారిని కాపాడటానికి వైద్యులు స్టెరాయిడ్స్ ఉపయోగించారు.

కరోనా మహమ్మారి వైద్య, ఆరోగ్య రంగంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపింది. వైరస్ సోకిన చాలామంది దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వైరల్ లోడ్ ఎక్కువగా ఉన్న వారిని కాపాడటానికి వైద్యులు స్టెరాయిడ్స్ ఉపయోగించారు. దీంతో కోవిడ్ అనంతరం, ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ సమయంలో వీటి వాడకం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో అసలు స్టెరాయిడ్స్ అంటే ఏంటి? అవి ఎలా పనిచేస్తాయి? వీటి ఉపయోగాలు, దుష్ప్రభావాలు.. తదితర విషయాల గురించి తెలుసుకుందాం.

* స్టెరాయిడ్స్ అంటే ఏంటి?
స్టెరాయిడ్స్ అనేవి మన శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు. మన శరీరంలో ఉండే అడ్రినలిన్ గ్రంథి గ్లూకోకార్టికాయిడ్స్ వంటి స్టెరాయిడ్‌లను ఉత్పత్తి చేస్తుంది. అయితే వీటిని కృత్రిమంగా కూడా తయారు చేయవచ్చు. వివిధ రకాల చికిత్సల్లో వీటిని వైద్యులు ఉపయోగిస్తున్నారు.

* స్టెరాయిడ్స్ ఎలాంటి పనులు చేస్తాయి?
శరీరంలో ఉత్పత్తి అయ్యే స్టెరాయిడ్‌లు వివిధ విధులను నిర్వర్తిస్తుంటాయి. ఉదాహరణకు.. మనం వ్యాయామాలు, వర్కవుట్లు చేసిన వెంటనే మన శరీరంలో చక్కెర స్థాయిలు తగ్గిపోవు. షుగర్ లెవల్స్ పడిపోకుండా స్టెరాయిడ్స్ నిరోధిస్తాయి. రక్తపోటు స్థాయిలను, పల్స్ రేటును నిర్వహించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ప్రమాదం లేదా అనారోగ్యం ఎదురైనప్పుడు.. మన శరీరంలోని ఏదైనా అవయవం అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోకుండా కాపాడతాయి.

* స్టెరాయిడ్స్‌ను మెడిసిన్‌గా ఎందుకు వాడుతున్నారు?
స్టెరాయిడ్స్‌కు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఏవైనా అనారోగ్యాలు ఎదురైనప్పుడు.. అవయవాల వాపుకు కారణమయ్యే రసాయనాల ఉత్పత్తిని ఇవి నిరోధిస్తాయి. ఫలితంగా కీలకమైన అవయవాల్లో వాపు ఏర్పడకుండా కాపాడతాయి. సాధారణంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సకు స్టెరాయిడ్లను ఉపయోగిస్తారు. మెదడులో వాపు, బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడేవారికి సైతం.. వాపును కంట్రోల్ చేసేందుకు స్టెరాయిడ్స్‌ను సిఫారసు చేస్తారు. రోగనిరోధక వ్యవస్థ శరీర కణాలపై దాడి చేసేందుకు కారణమయ్యే ఆటో- ఇమ్యూన్ వ్యాధులకు చికిత్సగా స్టెరాయిడ్స్‌ ఉపయోగిస్తారు. కోవిడ్ కారణంగా ఊపిరితిత్తుల్లో వాపు ఏర్పడుతుంది. అందువల్ల దీన్ని నిరోధించేందుకు స్టెరాయిడ్లను రోగులకు ఇస్తున్నారు.

ఇది కూడా చదవండి: Drinking Coffee: కాఫీ అంటే మీకు ఇష్టమా? ఇలాంటి సమస్యలు ఉంటే మాత్రం తప్పక మానేయాల్సిందే..

* స్టెరాయిడ్లతో దుష్ప్రభావాలు ఉన్నాయా?
స్టెరాయిడ్స్ మన శరీరానికి మేలు చేస్తాయి. అయితే కృత్రిమంగా తీసుకునే స్టెరాయిడ్‌లు మన శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఇది మధుమేహానికి కారణమవుతుంది. స్టెరాయిడ్లు మన శరీరంలో రక్తపోటు స్థాయిలను కూడా పెంచుతూ, అధిక రక్తపోటుకు కారణమవుతాయి. దీంతోపాటు ఇవి మన ఎముకల నుంచి కాల్షియంను తొలగిస్తాయి. ఫలితంగా బోలు ఎముకల వ్యాధి (ఆస్టియోపోరోసిస్) బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ దుష్ప్రభావాలను దృష్టిలో పెట్టుకొని పెద్ద మొత్తంలో స్టెరాయిడ్‌లను వైద్యులు సిఫారసు చేయరు. కొన్ని సందర్భాల్లో బాధితుల ప్రాణాలను కాపాడటానికి, శరీర భాగాల్లో ఏర్పడే వాపును తగ్గించడానికి మాత్రమే కృత్రిమ స్టెరాయిడ్లను రోగులకు ఇస్తారు.

* ఇంతకీ వీటిని వాడాలా? వద్దా?
స్టెరాయిడ్స్ ద్వారా బాధితుల ప్రాణాలను కాపాడవచ్చు. ఇదే సమయంలో వీటిని అతిగా వాడితే మధుమేహం, రక్తపోటు వంటి తీవ్రమైన దుష్ప్రభావాలు ఎదురవుతాయి. అందువల్ల నిపుణుల సూచనలతోనే, అదికూడా పరిమితంగానే వీటిని వాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని సొంతంగా వాడకూడదు. అయితే చికిత్సలో భాగంగా, తప్పని పరిస్థితుల్లో స్టెరాయిడ్లు వాడాల్సి వచ్చినప్పుడు.. వీటి వాడకాన్ని నిరోధించకూడదు. ఒకవేళ దుష్ప్రభావాలు ఎదురైతే వైద్యులను సంప్రదించాలి.
Published by:Sambasiva Reddy
First published:

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు