Home /News /life-style /

Wellness Tourism: కరోనాతో వెల్​నెస్​ టూరిజంకు పెరుగుతున్న ఆదరణ.. పకృతి ఒడిలో వైద్యానికి మంచి డిమాండ్​

Wellness Tourism: కరోనాతో వెల్​నెస్​ టూరిజంకు పెరుగుతున్న ఆదరణ.. పకృతి ఒడిలో వైద్యానికి మంచి డిమాండ్​

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మందులు, శస్త్రచికిత్సలతో కాకుండా యోగా, ధ్యానం, సౌండ్ హీలింగ్, పవర్ వాక్, వెట్​నెస్ టాక్స్ వంటి సులభమైన విధానాలతో ప్రకృతి వైద్యం చేస్తామని ఆయా సంస్థలు చెబుతున్నాయి. ఈ వెల్​నెస్​ టూరిజం ద్వారా వ్యక్తుల్లో ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇంకా చదవండి ...
దేశంలో కరోనా విజృంభనతో దాదాపు సంవత్సరం నుంచి అంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. దీని నుంచి బయటపడేందుకు, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు వెల్​నెస్​ టూరిజాన్ని ఆశ్రయిస్తున్నారు. కరోనా కారణంగా ఎక్కువ మంది ప్రజలు ప్రకృతికి దగ్గరగా, జనావాసాలకు దూరంగా ఉండేందుకు ఇష్టపడతున్నారని శాన్ బెనిటోలోని ది ఫార్మ్ మెడికల్ డైరెక్టర్ హోమర్ లిమ్ చెప్పారు. ముఖ్యంగా, అనేక దేశాలు తమ సరిహద్దులను తెరవగానే ఈ దోరణి స్పష్టంగా కన్పించదని ఆయన వెల్లడించారు. ఇది రాబోయే కాలంలో పర్యాటక పరిశ్రమకు దోహదం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ వెల్​నెట్​ టూరిజంపై పనిచేస్తున్న ‘ది ఫార్మ్’ అనే రిసార్ట్​ మేనేజ్​మెంట్​ స్పందిస్తూ "పర్యావరణ అనుకూలమైన వ్యాపారం రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. నగరాల్లో, పట్టణాల్లో నివసించే ప్రజలు జనారన్యానికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ ధోరణి కరోనా తర్వాత మరింత పెరిగింది. కేవలం, ఎకోఫ్రెండ్లీ వాతావరణం కల్పించడమే కాకుండా. హెల్తీ ప్రమోషన్, వ్యాధి నివారణ, రోగనిరోధక సహాయ కార్యక్రమాలను మేం రూపొందిస్తున్నాం. ఆరోగ్య భీమాతో వైద్య సేవలను కూడా అందిస్తున్నాం. దీని కోసం మా ఫార్మ్ అన్ని అవసరమైన అనుమతులను పొందింది. ఈ సేవలను గతేడాది మే నుంచే ప్రారంభించాం. దీనికి అనూహ్యమైన రెస్పాన్స్​ వస్తోంది. కరోనా తర్వాత వెల్​నెస్​ టూరిజానికి పెరిగిన ఆదరణే దీనికి నిదర్శనం. " అని లిమ్ చెప్పారు.

ప్రకృతి ఒడిలో చికిత్స..
ఇక, ఇదే తరహాలో సిజి హాస్పిటాలిటీ కూడా ఎకోఫ్రెండ్లీ మెడికల్​ సేవలు అందిస్తుంది. ప్రస్తుతం​ ఇది- నేపాల్​లోని గ్రీన్​ ఫారెస్ట్​లో తమ సేవలందిస్తుంది. దీనికి ప్రముఖుల నుండి తాకిడి పెరిగిందని హాస్పిటాలిటీ​ స్పష్టం చేసింది. తమ సేవలపై సిజి హాస్పిటాలిటీ స్పందిస్తూ ‘‘సాధారణంగా వ్యక్తులు కరోనా నుంచి కోలుకున్నాక.. "పోస్ట్-కోవిడ్ సిండ్రోమ్" తో బాధపడుతుంటారు. ఈ సిండ్రోమ్​ సాధారణంగా ఆరు నెలల వరకు ఉంటుంది. ఇది దగ్గు, రుచి, వాసన కోల్పోవడం వంటి నిరంతర లక్షణాలతో నిండి ఉంటుంది. ఈ సమయంలో అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కండరాలు, కీళ్ల నొప్పులు, జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వీటన్నింటికీ ప్రకృతి ఒడిలో వైద్యం చేయడమే వెల్​నెస్​ టూరిటం స్పెషాలిటీ.” అని పేర్కొంది. ఇక్కడ సేదతీరే వారికి సేంద్రీయ శాకాహారి భోజనం, డిటాక్స్ జ్యూస్​, బ్రెయిన్ బయోఫీడ్‌బ్యాక్, బ్లడ్​ అనాలసిస్​, ఆక్యుపంక్చర్, విటమిన్ ఇన్ఫ్యూషన్‌తో సహా అనేక పోస్ట్-కోవిడ్ రికవరీ ప్రోగ్రామ్‌లను అమలు చేస్తుంది. ఇక, మందులు, శస్త్రచికిత్సలతో కాకుండా యోగా, ధ్యానం, సౌండ్ హీలింగ్, పవర్ వాక్, వెట్​నెస్ టాక్స్ వంటి సులభమైన విధానాలతో ప్రకృతి వైద్యం చేస్తామని ఆయా సంస్థలు చెబుతున్నాయి. ఈ వెల్​నెస్​ టూరిజం ద్వారా వ్యక్తుల్లో ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
First published:

Tags: Coronavirus

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు