Home /News /life-style /

HEALTH WELLNESS 10 BEST WINTER FRUITS YOU SHOULD EAT TO STAY HEALTHY MK GH

10 Best Winter Fruits: శీతాకాలంలో ఆరోగ్యానికి తీసుకోవాల్సిన పండ్లు ఇవే...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

శీతాకాలంతో ఏవి తినాలో, ఏవి తినకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా కూరగాయలు మరియు పండ్లు మన శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తాయన్న విషయం తెలిసిందే. అందువల్ల ఆరోగ్యకరమైన జీవనశైలికి మీ ఆహారంలో ఈ కింది పండ్లను చేర్చండి.

    శీతాకాలం చాలామందికి అత్యంత ఇష్టమైన సీజన్. ఏడాది పొడవునా ఎండలో ఉండే మనకు శీతాకాలం ప్రకృతి ఇచ్చే ఒక గొప్ప వరం. ఎందుకంటే శీతాకాలం మనకు మంచి అనుభవాలని మిగిల్చుతుంది. అయితే, ఈ శీతాకాలంలో అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎదుర్కోడానికి మన ఆహారపు అలవాట్లలో చిన్నచిన్న మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ శీతాకాలంలో మనం తీసుకునే కొన్ని ఆహారాలు మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. అందువల్ల ఈ శీతాకాలంతో ఏవి తినాలో, ఏవి తినకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా కూరగాయలు మరియు పండ్లు మన శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తాయన్న విషయం తెలిసిందే. అందువల్ల ఆరోగ్యకరమైన జీవనశైలికి మీ ఆహారంలో ఈ కింది పండ్లను చేర్చండి.

    winter seasonal fruits, fruits for diabetic, winter fruits, diabetes health tips, how to control sugar, fruits for sugar patients, హెల్త్ టిప్స్, హెల్త్, టిప్స్, ఆరోగ్యం, ఆరోగ్య చిట్కాలు,
    ప్రతీకాత్మక చిత్రం


    ద్రాక్షపండ్లు

    తీపిగా మరియు రుచికరంగా ఉండే ద్రాక్షపండ్లు తీసుకుంటే శీతాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నుండి బయటపడొచ్చు. ఈ పండ్లు సాధారణంగా జనవరిలో లభిస్తాయి. ద్రాక్షా పండ్లలో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్–సి మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, మీ ఎముకలను బలోపేతం చేయడానికి మరియు మీ గాయాలను వేగంగా నయం చేయడానికి సహాయపడుతుంది. ద్రాక్షపండ్లలో విటమిన్ సితో పాటు విటమిన్ ఎ కూడా పుష్కలంగా లభిస్తుంది.

    పియర్స్

    పియర్స్లో విటమిన్ సి లేదా ఎ లేదా డి లభించదు. కానీ దీనిలో డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియకు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరంలో కొవ్వు కరిగించడానికి మీరు ప్రయత్నిస్తుంటే తక్కువ కేలరీలు గల పియర్స్ పండ్లను మీ ఆహారంలో చేర్చిండి.



    దానిమ్మ

    దానిమ్మ పండ్లలో టన్నుల కొద్ది యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇది క్యాన్సర్ వ్యాధి నివారణకు సహాయపడుతుంది. మీ శీతాకాలపు ఆహారంలో దానిమ్మ పండ్లను జోడించడం ద్వారా అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను మరియు తీపి పుల్లని రుచిని ఆస్వాదించవచ్చు. శీతాకాలపు ప్రయాణాల్లో ఒక గ్లాసు దానిమ్మ రసాన్ని తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

    నారింజ

    శీతాకాలంలో విరివిగా లభించే ముఖ్యమైన పండ్లలో నారింజ ఒకటి. నారింజ పండ్లను మీరు ప్రయాణ సమయంలో స్నాక్ ఫుడ్గా కూడా తీసుకోవచ్చు. అయితే, నారింజ శీతాకాలపు పంట కానప్పటికీ, ఎల్లప్పుడూ అన్ని సీజన్లలో అందుబాటులో ఉంటాయి. నారింజ పండ్లలో పుష్కలమైన పోషకాలు మరియు విటమిన్–డి లభిస్తుంది.



    అరటి

    శీతాకాలం సీజన్లో చాలా చౌకగా మరియు లభించే పండ్లలో అరటి ముఖ్యమైనది. అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా లభిస్తుంది. ఇది ఆందోళన మరియు ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాక కణాలను బలోపేతం చేయడానికి మరియు నిర్మించడానికి సహాయపడే B-6 విటమిన్ దీనిలో పుష్కలంగా లభిస్తుంది. మీరు అరటిపండ్లను ముక్కలుగా చేసి, రుచికరమైన పండ్ల కప్పును తయారు చేయవచ్చు.

     కాన్ బెర్రీస్

    కాన్ బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు పోషకాలు అధికంగా లభిస్తాయి. ఇది క్యాన్సర్లు, గుండె జబ్బులు మరియు మంటల నివారణకు సహాయపడుతుంది. శీతాకాలంలో సాధారణంగా వచ్చే జలుబును ఎదుర్కోవాలనుకుంటే కాన్ బెర్రీస్ ఎక్కువగా తీసుకోవాలి.



    పైనాపిల్

    పైనాపిల్లో విటమిన్ సి మరియు మాంగనీస్ అనే చాక్ నిండి ఉంటుంది. ఇది మీ శరీరంలోని ఎముకలు ఏర్పడటానికి మరియు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఫైనాపిల్ పండ్లలో చక్కని పోషకాలు లభిస్తాయి.

    పెర్సిమోన్స్

    పెర్సిమోన్ పండ్లు సీజన్తో సంబంధం లేకుండా లభిస్తుంది. ఈ చిన్న, టొమాటో- వలే ఉండే ఈ పండు ఆరోగ్యకరమైన గుండెను కాపాడుకోవటానికి, మీ జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేయడానికి మరియు మీ కంటి చూపును బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాక ఇవి చాలా రుచికరమైనవిగా ఉండటంతో పాటు వీటిని అనేక వంటకాల్లో ఉపయోగించవచ్చు.

    Coronavirus Pandemic, Coronavirus food, how to increase immunity, immunity foods, immunity fruits, కరోనావైరస్ మహమ్మారి, కరోనా వైరస్ ఆహార పదార్థాలు, ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి, రోగనిరోధక శక్తి ఎలా పెంచుకోవాలి, రోగనిరోధక శక్తిని పెంచే పండ్లు
    3. కివీ ఫ్రూట్.


    కివీస్

    కివీస్ పండ్లలో విటమిన్ సితో పాటు విటమిన్ ఇ మరియు కె పుష్కలంగా లభిస్తుంది. కివీస్ పండ్లు ఎంతో రుచికరంగా ఉంటాయి. ఇవి మనిషికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఈ శీతాకాలంలో చలిని ఎదుర్కోవటానికి కివీస్ పండ్లను తీసుకోవడం ఎంతో ఉత్తమం

    ఆపిల్స్

    ఆపిల్స్ పండ్లు చాలా పోషకాలతో నిండినందున వాటిని సూపర్‌ఫుడ్‌లతో పోల్చారు. దీనిలో విటమిన్ బి మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాక, ఆపిల్ పండ్లు అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడుతాయి. ఇవి ఈ శీతాకాలంలో మిమ్మల్ని డాక్టర్ నుండి దూరంగా ఉంచుతాయి.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: WINTER

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు