Weight Loss Tips : ఈ స్నాక్స్ తింటూనే బరువు తగ్గండి..

Weight Loss Tips: బరువు తగ్గేందుకు పలువురు ఏవేవే టిప్స్ పాటిస్తుంటారు.. ఎన్నెన్నో వర్కవుట్స్ చేస్తుంటారు. కొత్త కొత్త ప్రయోగాలు ట్రై చేస్తుంటారు. ముఖ్యంగా స్నాక్స్ పక్కనపెడతారు.. కానీ.. స్నాక్స్‌ని తింటూ బరువు తగ్గించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఆ స్నాక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Janardhan V | news18-telugu
Updated: August 23, 2019, 5:33 PM IST
Weight Loss Tips : ఈ స్నాక్స్ తింటూనే బరువు తగ్గండి..
ప్రతీకాత్మక చిత్రం
Janardhan V | news18-telugu
Updated: August 23, 2019, 5:33 PM IST
నట్స్ : జీడిపప్పు, వాల్‌నట్స్, బాదంలు ఇలా నట్స్‌ని తింటే వీటిలో ఉండే గ్లూటెన్ ఆరోగ్యానికి మంచిది. ఇందులోని ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులుంటాయి. వీటిని నానబెట్టి లేదా వేయించి కార్న్‌తో కలిపి తీసుకుంటే మంచిది.

శెనగలు: ప్రోటీన్స్, పీచు పదార్థాలు జీర్ణశక్తిని పెంచుతాయి. వీటిని తినడం వల్ల త్వరగా ఆకలేయదు. కాబట్టి వీటిని మీ డైట్‌లో చేర్చుకోండి.

స్ప్రౌట్స్: కేలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువుండే ఈ మొలకెత్తిన గింజల్లో జీర్ణక్రియకు ఉపయోగపడే పీచు ఉంటుంది. ఇందులో ఖర్జూరం కలిపి తీసుకుంటే చప్పగా కూడా అనిపించవు.

తామరగింజలు: ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, కాల్షియం ఎక్కువ మోతాదులో ఉండే ఇవి హెల్దీ స్నాక్స్ అని చెప్పొచ్చు. అదేవిధంగా కొలెస్ట్రాల్, సోడియం వంటివి అసలుండవు.



బఠాణి: ప్రోటీన్స్, కొవ్వు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఎండు బఠాణీ తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండి బరువు తగ్గుతారు.
వీటితో పాటు ఎక్కువగా ఆకుకూరలు, నీరు తీసుకోండి.. ఖచ్చితంగా ఫలితంగా కనిపిస్తుంది.

ఈ వీడియో కూడా చూడండి..
Loading...
First published: August 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...