నట్స్ : జీడిపప్పు, వాల్నట్స్, బాదంలు ఇలా నట్స్‌ని తింటే వీటిలో ఉండే గ్లూటెన్ ఆరోగ్యానికి మంచిది. ఇందులోని ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులుంటాయి. వీటిని నానబెట్టి లేదా వేయించి కార్న్‌తో కలిపి తీసుకుంటే మంచిది.
శెనగలు: ప్రోటీన్స్, పీచు పదార్థాలు జీర్ణశక్తిని పెంచుతాయి. వీటిని తినడం వల్ల త్వరగా ఆకలేయదు. కాబట్టి వీటిని మీ డైట్లో చేర్చుకోండి.
స్ప్రౌట్స్: కేలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువుండే ఈ మొలకెత్తిన గింజల్లో జీర్ణక్రియకు ఉపయోగపడే పీచు ఉంటుంది. ఇందులో ఖర్జూరం కలిపి తీసుకుంటే చప్పగా కూడా అనిపించవు.
తామరగింజలు: ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, కాల్షియం ఎక్కువ మోతాదులో ఉండే ఇవి హెల్దీ స్నాక్స్ అని చెప్పొచ్చు. అదేవిధంగా కొలెస్ట్రాల్, సోడియం వంటివి అసలుండవు.
బఠాణి: ప్రోటీన్స్, కొవ్వు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఎండు బఠాణీ తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండి బరువు తగ్గుతారు.
వీటితో పాటు ఎక్కువగా ఆకుకూరలు, నీరు తీసుకోండి.. ఖచ్చితంగా ఫలితంగా కనిపిస్తుంది.
ఈ వీడియో కూడా చూడండి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Tips, HOME REMEDIES, Tips For Women, Weight loss