ప్రపంచవ్యాప్తంగా కరోనా(Corona) మహమ్మారి ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు(Scientists) వైరస్ (Virus) ఉనికిని కనిపెట్టడానికి నూతన మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు నిపుణులు ఎంతో కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మసాచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), హార్వర్డ్ యూనివర్సిటీ ఇంజనీర్లు కోవిడ్-19 నిర్ధారణ చేయగల సరికొత్త ఫేస్ మాస్క్‌ను రూపొందించారు. త్వరలోనే అందుబాటులోకి వచ్చే ఈ ఫేస్ మాస్క్‌ను ఎవరైనా సరే ధరించి సుమారు 90 నిమిషాల్లోనే తమకు కరోనా వైరస్ సోకిందో లేదో నిర్ధారించుకోవచ్చు.
ఈ మాస్క్‌లు ఇతర ఫేస్ మాస్క్‌లతో పాటు ధరించవచ్చు. ఇందుకుగాను వీటిలో చిన్న, డిస్పోసబుల్ సెన్సార్‌లు అమర్చామని పరిశోధకులు తెలిపారు. ఈ మాస్క్‌లను ఇతర వైరస్‌లను గుర్తించడానికి కూడా ఉపయోగించవచ్చని పరిశోధకుల వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఒక నివేదిక పేర్కొంది.
ఎబోలా, జికా వంటి వైరస్‌ల కోసం పేపర్ డయాగ్నస్టిక్స్‌లో యూజ్ చేసిన ఫ్రీజ్-డ్రై-సెల్యులార్ మెషినరీపై ఈ మాస్క్ సెన్సార్లు ఆధారపడి ఉన్నాయి. ఈ సెన్సార్లను పరిశోధన బృందం గతంలోనే అభివృద్ధి చేసింది. తాజా అధ్యయనంలో భాగంగా సెన్సార్‌లను ఫేస్ మాస్క్‌ల్లో మాత్రమే కాకుండా ల్యాబ్ కోట్లు వంటి దుస్తులలో కూడా అమర్చవచ్చని పరిశోధకులు చేసి చూపించారు. తద్వారా హెల్త్ కేర్ వర్కర్స్ దరిచేరే వివిధ రకాల వ్యాధికారకాలు లేదా ఇతర హానికారకాలు పర్యవేక్షించడానికి తమ మాస్క్ లు కొత్త మార్గాన్ని కనిపెడుతున్నాయన్నారు.
"వైరల్, బ్యాక్టీరియల్ న్యూక్లియిక్ ఆమ్లాలను, నరాల టాక్సిన్‌లతో సహా విష రసాయనాలను గుర్తించడానికి విస్తృత శ్రేణి సింథటిక్ బయాలజీ సెన్సార్‌లను ఫ్రీజ్-డ్రై చేయగలమని మేము నిరూపించాము. మా ప్లాట్‌ఫాం ఫ్రంట్ లైన్ వారియర్స్, హెల్త్ కేర్ సిబ్బంది, సైనిక సిబ్బంది కోసం నెక్స్ట్ జనరేషన్ వేరబుల్స్ బయోసెన్సర్‌లకు నాంది పలుకుతుందని చెప్పగలం." అని అధ్యయన సీనియర్ రచయిత ప్రొఫెసర్ జేమ్స్ కాలిన్స్(James Collins) చెప్పారు. జేమ్స్ కాలిన్స్ MIT ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ (IMES) డిపార్ట్‌మెంట్‌లో మెడికల్ ఇంజనీరింగ్, బయోలాజికల్ ఇంజనీరింగ్ లో సైన్స్ టెర్మీర్ ప్రొఫెసర్ గా వ్యవహరిస్తున్నారు.
జేమ్స్ కాలిన్స్ అనేక సంవత్సరాల క్రితం అభివృద్ధి చేయడం ప్రారంభించిన టెక్నాలజీపైనే ఈ కొత్త వేరబుల్ సెన్సార్లు, డయాగ్నొస్టిక్ ఫేస్ మాస్క్ ఆధారపడి ఉన్నాయి. నిర్దిష్ట టార్గెటెడ్ అణువులకు ప్రతిస్పందించి కాగితంలో అమర్చగల సింథటిక్ జన్యు నెట్‌వర్క్‌లను సృష్టించడానికి ప్రోటీన్లు, న్యూక్లియిక్ ఆమ్లాలు అవసరమని 2014లో కాలిన్స్ చూపించారు. ఎబోలా, జికా వైరస్‌ల కోసం పేపర్ డయాగ్నోస్టిక్స్ సృష్టించడానికి ఈ విధానాన్ని ఉపయోగించానని ఆయన చెప్పారు.
ఇక ఇటీవలే పరిశోధకులు తమ సరికొత్త మాస్క్ టెక్నాలజీపై పేటెంట్ కోసం దాఖలు చేశారు. వీరు సెన్సార్‌లను మరింత అభివృద్ధి చేయడానికి ఒక సంస్థతో కలిసి పనిచేయాలని భావిస్తున్నారు. అయితే ఫేస్ మాస్క్ అందుబాటులో ఉండే మొదటి అప్లికేషన్ అని కాలిన్స్ చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Corona mask