#Health Tips: విటమిన్ డి మాత్రలు.. ఊపిరితిత్తులకు మేలు..

ప్రతీకాత్మక చిత్రం

Vitamin D Benefits: సాధారణంగా ఎముకలు బలహీనంగా మారినప్పుడు.. విటమిన్ డి మాత్రలు వేసుకుంటాం. కానీ, వీటిని వేసుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

  • Share this:
కాళ్లు, చేతులు లాగడం.. ఎముకల్లో నొప్పులు రావడం ఇటువంటి సమస్యల కారణంగా విటమిన్ డి ట్యాబ్లెట్స్ వేసుకుంటుంటాం. అయితే, ఈ మాత్రలు వేసుకోవడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు కూడా తగ్గించుకోవచ్చని బ్రిటన్ క్వీన్ మేరీ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. దాదాపు 500 మందిపై కొనసాగిన అధ్యయనంలో శాస్త్రవేత్తలు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. విటమిన్ డి మాత్రలు వేసుకోవడం చాలా సురక్షితం.. పిల్లలకు కూడా చాలా మంచిది.. వారిలో మెదుడు ఎదుగుదలకు ఈ మాత్రలు ఉపయోగపడతాయి.

జలుబు, జ్వరం, ఆస్తమా సమస్యలను విటమిన్ డి మాత్రలు నిరోధిస్తాయి. విటమిన్ డి లోపం ఉన్నవారిలో ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఊపిరితిత్తులపై జరిగే దాడులను 45శాతం వరకూ తగ్గిస్తుంది.
-క్వీన్ మేరీ యూనివర్సిటీ శాస్త్రవేత్త అడ్రియన్ మార్టినీ


ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యలకు విటమిన్ ‌డి మాత్రలు చక్కని ఔషధం అని తేల్చారు శాస్త్రవేత్తలు. ఈ మధ్యకాలంలో వీటివల్ల ఎంతో మంది తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. 2015లో ప్రపంచవ్యాప్తంగా ఊపిరి సంబంధిత సమస్యలతో 3.2 మిలియన్ మంది ప్రాణాలు విడిచారు.

అయితే, మంచిది కదా అని వీటిని అతిగా వాడడం శ్రేయస్కరం కాదని సూచిస్తున్నారు. వైద్యుల సలహాతో వీటిని తీసుకోవాలని తెలిపారు.
అందరికీ అందుబాటులో ఉండే ఈ మాత్రల ఖర్చు కూడా తక్కువే..
First published: