హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Vitamin B12: విటమిన్ B12 లోపిస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

Vitamin B12: విటమిన్ B12 లోపిస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

శరీరానికి విటమిన్ B12 చాలా అవసరం. శరీరానికి అవసరమైన శక్తి ఈ విటమిన్ నుంచి అందుతుంది. విటమిన్ B12 లోపం కారణంగా శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది శారీరక, మానసిక, నరాల సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

మంచి జీవనశైలి, పోషకాహారం, తగినంత నిద్ర, వ్యాయామం ఉంటే ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవు. సాధారణంగా శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్స్ సమృద్ధిగా అందితే ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే ఏదో ఒక అనారోగ్య సమస్య బారిన పడే అవకాశం ఉంటుంది. శరీరానికి విటమిన్ B12 చాలా అవసరం. శరీరానికి అవసరమైన శక్తి ఈ విటమిన్ నుంచి అందుతుంది. విటమిన్ B12 లోపం కారణంగా శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది శారీరక, మానసిక, నరాల సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. ఒకవేళ విటమిన్ బీ12 లోపిస్తే ఎలాంటి లక్షణాలు ఎదురవుతాయి, ఏ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం.

* B12 లోపిస్తే కనిపించే లక్షణాలు

శరీరంలో విటమిన్ బీ12 లోపిస్తే సాధారణంగా బలహీనంగా ఉండడం, ఊపిరి ఆడకపోవడం, నోటిలో పుండ్లు, ఫింగర్స్ పిగ్మెంటేషన్, మతిమరుపు, యూరినరీ ఇన్ఫెక్షన్స్ వంటివి కనిపిస్తాయి. అదే విధంగా తరచుగా డిప్రెషన్‌కు గురికావడం, పనిపై దృష్టి పెట్టలేకపోవడం, జుట్టు రాలడం వంటి సమస్యలు సాధారణంగా ఉంటాయి.

* ఆరోగ్య సమస్యలు

శరీరంలో విటమిన్ బీ12 లోపిస్తే నరాలకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కాళ్లు, చేతులు బలహీనంగా మారుతాయి. అలాగే చేతులు, కాళ్లను సరిగా కదిలించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా నాలుక రుచి తగ్గిపోవడం, దృష్టి, యూరినరీ సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది.

* గుండె జబ్బులు

బీ12 లోపం కారణంగా గుండెకు సంబంధించి అనేక సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కరోనరీ ఆర్టరీ, పెరిఫెరల్ వాస్కులర్ వ్యాధులు చుట్టుముట్టే అవకాశం ఉంది. విటమిన్ బీ12 పుష్కలంగా లభించే ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఈ సమస్యలు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంది.

* గర్భధారణ సమస్యలు

విటమిన్ బీ12 లోపం కారణంగా గర్భిణులలో కూడా అనేక ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయి. ముఖ్యంగా పిండం ఎదుగుదలకు విటమిన్ బీ 12 లోపం శాపంగా మారుతుంది. కాబట్టి గర్భిణులు ఎప్పటికప్పుడు విటమిన్ B12 లెవల్స్‌ను చెక్ చేయించుకోవాలి.

* రక్తహీనత

శరీరంలో విటమిన్ బీ 12 లోపం కారణంగా రక్తహీనతకు దారితీయవచ్చు. అయితే ఇందుకు మరిన్ని టెస్ట్‌లు చేయాల్సి ఉంటుంది. రక్తహీనత కారణంగా మనిషి ఏ పనిపై సక్రమంగా దృష్టి సారించలేడు. పైగా ఇది మరిన్ని జబ్బులకు కారణమవుతుంది.

* B12 లోపాలను ఇలా గుర్తించండి

విటమిన్ బీ12 లోపానికి ప్రధాన కారణం, అది లభించే పదార్థాలను తగినంత తీసుకోకపోవడమే అని నిపుణులు అంటున్నారు. ఎముక మజ్జ పరీక్ష, గ్యాస్ట్రో-ఎండోస్కోపీ, రక్త పరీక్షలు వంటి వాటి ద్వారా విటమిన్ B12 లోపాన్ని గుర్తించవచ్చు.

* అధిగమించే మార్గాలు

శరీరంలో ఎర్ర రక్త కణాలు, నరాల కణాలు, DNA తయారు కావడానికి విటమిన్ B12 కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో విటమిన్ బీ 12 లోపాన్ని అధిగమించాలంటే మాంసం, పాల ఉత్పత్తులు, గుడ్లు వంటి వాటిని తరచూ డైట్‌లో చేర్చుకోవాలి. అలాగే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ఆల్కహాల్ వినియోగాన్ని పరిమితం చేయాలి.

First published:

Tags: Vitamins

ఉత్తమ కథలు