శృంగారంలో సత్తా చాటేందుకు ఆ మందులు వాడితే అంతే సంగతులు...

వయాగ్రాలోని సిల్డెనఫిల్ సిట్రేట్ రక్తప్రసరణను తాత్కాలికంగా పెంచి అంగస్థంభనలు జరిగేలా చేస్తుంది. అయితే ఇలా చేస్తే గుండెకు సంబంధించిన వ్యాధులు తప్పవని, వైద్యులు పేర్కొంటున్నారు.

news18-telugu
Updated: August 5, 2019, 11:08 PM IST
శృంగారంలో సత్తా చాటేందుకు ఆ మందులు వాడితే అంతే సంగతులు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దంపతుల మధ్య శృంగార జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, మాత్రం పురుషపుంగవులు వయాగ్రా లాంటి శృంగార ఉద్దీపనలకు దూరంగా ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు. బెడ్రూమ్ లో రెచ్చిపోవాలని తరచూ వయాగ్రా లాంటి మందులకు అలవాటు పడితే తాత్కాలికంగా ప్రయోజనం దక్కుతుందే తప్ప దీర్ఘకాలంలో సైడ్ ఎఫక్ట్స్ తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వయాగ్రాలోని సిల్డెనఫిల్ సిట్రేట్ రక్తప్రసరణను తాత్కాలికంగా పెంచి అంగస్థంభనలు జరిగేలా చేస్తుంది. అయితే ఇలా చేస్తే గుండెకు సంబంధించిన వ్యాధులు తప్పవని, వైద్యులు పేర్కొంటున్నారు. అయితే శృంగార సామర్థ్యం కోసం తాత్కాలికంగా పనిచేసే వయాగ్రాకు దూరంగా ఉండి, రెగ్యులర్ గా వ్యాయామం చేయడంతో పాటు గుండె ఆరోగ్యం మెరుగుపడే ఎక్సర్‌సైజులు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

ప్రతీ రోజు వ్యాయామంలో రన్నింగ్ తో పాటు స్విమ్మింగ్ లాంటివి కూడా చేస్తే గుండె ఆరోగ్యంతో పాటు లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే కొవ్వు పదార్థాలను ఆహారంలో తగ్గించాలని సీ ఫుడ్ ప్రిఫర్ చేయాలని చెబుతున్నారు. ముఖ్యంగా సాల్మన్ చేపలు, టూనా చేపల్ల ఒమెగా ఫ్యాటీ ఆసిడ్స్ సమృద్ధిగా ఉంటాయని వైద్యులు నిర్ధారించారు. అలాగే శృంగారం చేసే సమయంలో చక్కటి సంగీతం వినడం, మానసిక ప్రశాంతత కోసం చక్కటి సాహిత్యం చదవడం వంటివి చేయాలని వైద్యులు చెబుతున్నారు.
First published: August 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading