హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Viagra for heart attack: వయాగ్రాతో గుండె పోటు ముప్పు దూరం.. తాజా అధ్యయనంలో వెల్లడి..

Viagra for heart attack: వయాగ్రాతో గుండె పోటు ముప్పు దూరం.. తాజా అధ్యయనంలో వెల్లడి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గుండె జబ్బులు ఉన్నవారు కూడా దీన్ని తీసుకోవడం వల్ల వారికి ఎలాంటి ఇబ్బందులూ కలగకపోగా.. వారి ఆయుర్ధాయం కూడా పెరిగిందని తేలింది. ఈ అధ్యయనం అటు అంగస్థంభన, ఇటు గుండె జబ్బులు రెండూ ఉన్నవారిలో చికిత్సకు కొత్త మార్గాలను తెరిచినట్లుగా భావించవచ్చు.

ఇంకా చదవండి ...

  వయాగ్రా.. సాధారణంగా పురుషుల్లో సెక్స్ కోరికలను పెంచేందుకు ఉపయోగించే ఔషధంగానే ఇది అందరికీ తెలుసు. అంగస్థంభన సమస్యలున్న వారికి ఇది పెద్ద వరం అనే చెప్పుకోవచ్చు. అయితే కేవలం సెక్స్ విషయంలోనే కాదు.. ఎక్కువ కాలం జీవించేందుకు కూడా ఇది తోడ్పడుతుందని చెబుతున్నారు నిపుణులు.

  వయాగ్రా అనేది ఒక PDE5 ఇన్ హిబిటర్ గా పనిచేస్తుందట. దీన్ని రోజూ తీసుకుంటే PDE5 లేదా ఫాస్పోడైటరేస్ 5 అనే ఎంజైమ్ ని అడ్డుకుంటుంది. దీనివల్లే అంగస్థంభన సమస్యలు తగ్గుతాయి. అంతే కాదు.. హై బీపీ సమస్యలు ఉన్నవారు కూడా దీన్ని తీసుకోవడం వల్ల ఆ సమస్య తగ్గుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. గతంలో ఇది గుండె జబ్బు ఉన్నవారు తీసుకోకూడదని నిపుణులు వెల్లడించేవారు. కానీ 2017 లో స్వీడన్ లోని కరోలిన్స్కా ఇనిస్టిట్యూట్ వారు నిర్వహించిన అధ్యయనం ప్రకారం గుండె జబ్బులు ఉన్నవారు కూడా దీన్ని తీసుకోవడం వల్ల వారికి ఎలాంటి ఇబ్బందులూ కలగకపోగా.. వారి ఆయుర్ధాయం కూడా పెరిగిందని తేలింది. ఈ అధ్యయనం అటు అంగస్థంభన, ఇటు గుండె జబ్బులు రెండూ ఉన్నవారిలో చికిత్సకు కొత్త మార్గాలను తెరిచినట్లుగా భావించవచ్చు.

  అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్ లో తాజాగా ప్రచురితమైన ఓ అధ్యయనం కూడా ఇలాంటి ఫలితాలనే తేల్చింది. 18500 మంది గుండె జబ్బు, అంగస్థంభన సమస్యలు ఉన్నవారిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. అందులో 16,500 మంది వయాగ్రా ఉపయోగిస్తుండగా 2000 మంది అల్ప్రోస్టడిల్ అనే మరో మందును ఉపయోగించారు. ఈ మందును ఇంజక్షన్ రూపంలో అందించాల్సి ఉంటుంది. ఇందులో అల్ప్రోస్టడిల్ తో పోల్చితే రోజూ వయాగ్రా తీసుకున్న వారు ఎక్కువ కాలం పాటు జీవించారని.. వారిలో గుండె జబ్బుల ముప్పు చాలా తగ్గిందని తేలింది. అంతే కాదు.. వీరిలో బైపాస్ సర్జరీ, బెలూన్ డైలేషన్ వంటి ప్రక్రియల అవసరం కూడా తగ్గిందని తేలింది. అంతే కాదు.. అల్ప్రోస్టడిల్ తీసుకున్న వారితో పోల్చితే వయాగ్రా తీసుకున్న వారు ఆరోగ్యంగా ఉండి ఇతర సమస్యలు వచ్చే ముప్పు కూడా వారిలో తక్కువగా ఉండడం విశేషం.


  అంతే కాదు.. వీరిలో అంగస్థంభన సమస్యలు తగ్గడం వల్ల శారీరకంగా, మానసికంగా కూడా వారు ఇతరులతో పోల్చితే ఆనందంగా ఉన్నారని, ఆనందమైన లైంగిక జీవితాన్ని గడిపారని తేలింది. అయితే ఈ విషయంలో మరింత లోతుగా అధ్యయనం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  First published:

  Tags: Lifestyle

  ఉత్తమ కథలు