Home /News /life-style /

HEALTH VASTU TIPS KEEP AROWANA FISH AT HOME TO WARD OFF EVIL FORCES GH VB

Vastu Tips: మీ ఇంట్లో ఆ విగ్రహం ఉంటే.. అన్నీ శుభాలే.. వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Vastu Tips: నిర్మాణ నివాసాలలో విధివిధానాలను శాసించే శాస్త్రాన్నే వాస్తు శాస్త్రం అని పిలుస్తుంటారు. వాస్తు దోషాలతో గృహాలతో ఇళ్లు నిర్మిస్తే ఆర్థిక నష్టాలు, అనారోగ్యాలు వెంటాడుతుంటాయి. పూర్వకాలం నుంచి దేవాలయాలు, ఇళ్లను వాస్తు శాస్త్రానికి అనుగుణంగానే నిర్మిస్తున్నారు.

ఇంకా చదవండి ...
నిర్మాణ నివాసాలలో విధివిధానాలను శాసించే శాస్త్రాన్నే వాస్తు శాస్త్రం అని పిలుస్తుంటారు. వాస్తు దోషాలతో గృహాలతో ఇళ్లు నిర్మిస్తే ఆర్థిక నష్టాలు, అనారోగ్యాలు వెంటాడుతుంటాయి. పూర్వకాలం నుంచి దేవాలయాలు, ఇళ్లను వాస్తు శాస్త్రానికి అనుగుణంగానే నిర్మిస్తున్నారు. భారతీయ పురాణాల ప్రకారం, వాస్తుపురుషుడు అభ్యర్థన మేరకు సమస్త మానవాళి బాగు కోసం బ్రహ్మ దేవుడు వాస్తు-శాస్త్ర నియమాలు సృష్టించాడు. అందుకే, మీ ఇంటిని నిర్మించేటప్పుడు వాస్తు దోషాలు లేకుండా జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. ఇంకా ఏదైనా వాస్తు దోషం ఉన్నట్లయితే, అది ఇంట్లో సమస్యలను సృష్టిస్తుంది. అయినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వాస్తు దోషాలను కొన్ని జాగ్రత్తలతో తొలగించవచ్చని పండితులు చెబుతున్నారు. ఇంటి వాస్తుదోష సవరణకు అనేక పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు.

Peddapalli: ఆమె అక్కడ వంట ఎందుకు చేస్తుందో తెలుసా.. ఆమె ఇంట్లో జరిగే ఘటనలతో ఊరంతా ఆశ్చర్యం..


అయితే, ఇంటి నిర్మాణ సమయంలో వాస్తు దోషాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడం ముఖ్యం. ఒకవేళ నిర్మాణం పూర్తయ్యాక ఏదైనా వాస్తు దోషాలు ఉన్నట్లు తెలిసినా.. ఆందోళన పడక్కర్లేదు. ఎందుకంటే ఈ దోషాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా.. ముఖ్యంగా అరోవానా(Arowana) వంటి చేపలు ఇంట్లో ఉంచడం ద్వారా తొలగిపోతాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

వాస్తు శాస్త్రంలో అరోవానా చేప ప్రాముఖ్యత
వాస్తు-శాస్త్రం ఇంటి లోపల లేదా బయట ఉంచిన వస్తువుల ప్రాముఖ్యత గురించి స్పష్టంగా వివరించింది. మీ ఇంట్లో ఉంచిన వస్తువులు పాజిటివ్, నెగిటివ్ ఎనర్జీని నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాటిలో అరోవానా చేప ఒకటి. మీరు అరోవానా చేపలను ఇంట్లో ఉంచుకుంటే వాస్తు పరంగా ఎంతో మేలు చేకూరుతుంది. గోల్డ్ ఫిష్‌తో పాటు అరోవానా చేప(Arowana fish)చాలా పవిత్రమైనదిగా వాస్తు-శాస్త్రం చెబుతోంది. అరోవానా చేపని ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలకు, శక్తికి చిహ్నంగా వాస్తు శాస్త్ర నిపుణులు పరిగణిస్తారు. అందుకే దీనిని ఇంట్లో ఉంచడం ద్వారా చక్కటి ప్రయోజనాలు పొందవచ్చు.

Love Marriage: ప్రేమించి పెళ్లి చేసుకున్నావ్.. ఇదేం బుద్ది మరి.. అలాంటప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఎందుకు..


అరోవానా చేప విగ్రహం
అరోవానా చేప దుష్ట శక్తులను దూరం చేస్తుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపేందుకు అరోవానా చేప బాగా ఉపయోగపడుతుంది. ఇంటి లోపల సజీవమైన అరోవానా చేపలను ఉంచలేమని భావిస్తే మీరు ఓ బంగారు అరోవానా చేప విగ్రహాన్ని కూడా ఉంచుకోవచ్చు. అయితే ఈ గోల్డెన్ చేప నోటిలో నాణెం తప్పనిసరిగా ఉండాలి. నోటిలో ఒక నాణెం కలిగిన బంగారు అరోవానా చేప విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం ద్వారా మంచి ప్రయోజనాలు చేకూరుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Lemon And Chilli: గుమ్మానికి నిమ్మకాయ, మిరపకాయ ఎందుకు వేలాడదీస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. తెలుసుకోండి..


ఈ విగ్రహాన్ని మీ ఇంట్లో ఈశాన్య లేదా తూర్పు దిశలో ఉంచాలి. కొందరు జంతుశాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం, భూకంపానికి ముందు అరోవానా చేప పర్వత ప్రాంతాలకే పరిమితం అయ్యాయట. ఈ చేప ప్రత్యేకత ఏంటంటే.. ఇది భూకంపం సంభవించడానికి ముందుగానే సంకేతాలను కనిపెడుతుందట. భూకంపం వస్తుందని ఇవి అందరికంటే ముందుగానే గ్రహించి అప్రమత్తం చేస్తాయని.. తద్వారా ప్రకృతి వైపరీత్యం సంభవించక ముందే సురక్షితమైన ప్రాంతానికి తరలి పోవచ్చని కొందరు చెబుతుంటారు.
Published by:Veera Babu
First published:

Tags: Lifestyle, Vastu, Vastu Tips

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు