HEALTH USED TO FIGHT COVID GILOY CAN LEAD TO LIVER FAILURE GH VB
Giloy Diadvantages: ఈ ఆయుర్వేద మూలికతో లివర్ ప్రాబ్లమ్స్.. పరిశోధకుల సంచలన వాస్తవాలు.. తప్పక తెలుసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
కోవిడ్-19కి(Covid-19) బూస్టర్ అని చెబుతున్న తిప్పతీగ(Giloy) వల్ల లివర్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు భారత్‌కు చెందిన పరిశోధకులు. కొన్నిసార్లు ఇది కాలేయం విఫలమయ్యే సమస్యకు దారితీస్తుందని స్పష్టం చేశారు.
కరోనా మహమ్మారి(Corona) తర్వాత ఆయుర్వేదంపై ప్రజల ఆలోచన విధానం మారింది. ఈ మందులు బాగా పనిచేస్తాయని భావిస్తున్న ప్రజలు, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఆయుర్వేద పద్ధతులను పాటించేవారు సైతం పెరిగారు. ముఖ్యంగా కొన్ని రకాల ఆకులతో రోగనిరోధక శక్తి(Immunity Power) పెరుగుతుందని నమ్ముతున్నారు. ఇందులో వాస్తవం లేకపోలేదు. అయితే అన్ని ఆయుర్వేద మందులతోనూ మంచి ప్రయోజనాలుంటాయని చెప్పలేం. కొన్నింటిని వాడటం వల్ల ప్రతికూల ఫలితాలు తలెత్తవచ్చు. కోవిడ్-19కి(Covid-19) బూస్టర్ అని చెబుతున్న తిప్పతీగ(Giloy) వల్ల లివర్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు భారత్‌కు చెందిన పరిశోధకులు. కొన్నిసార్లు ఇది కాలేయం విఫలమయ్యే సమస్యకు దారితీస్తుందని స్పష్టం చేశారు. తిప్పతీగను వైజ్ఞానిక భాషలో టినొస్పోరా కార్డిఫోలియా (Tinospora Cordifolia) అంటారు.
13 నగరాల్లోని పరిశోధకులు కలిసి ఈ మల్టీ సెంటర్ రీసెర్చ్‌ను నిర్వహించారు. ఈ బృందంలో వైద్య పరిశోధకులతో పాటు లివర్ స్పెషలిస్టులు కూడా ఉన్నారు. ఈ అధ్యయనాన్ని సైంటిఫిక్ జర్నల్ హెపటాలజీ కమ్యూనికేషన్స్‌లో ప్రచురించారు. హైదరాబాద్ ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, హెపటాలజీకి విభాగానికి చెందిన వైద్యులు ఈ బృందంలో పనిచేశారు. తాము 43 మంది రోగులకు 46 రోజుల పాటు తిప్పతీగను వినియోగించామని అన్నారు. వీరిలో సగానికి పైగా మహిళలున్నారని, వారంతా హెపటైటిస్, కాలేయ వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు. తిప్ప తీగ ఆకులను వినియోగించిన తర్వాత కాలేయం ప్రమాదం 67.4 శాతం పెరిగిందని తెలిపారు.
చాలా మంది తిప్పతీగ ఆకులను కోవిడ్-19కి చెక్ పెట్టే ఆయుర్వేద మందుగా ఉపయోగిస్తున్నారని పరిశోధకులు స్పష్టం చేశారు. అయితే వీరి లివర్ టిష్యూ తీసుకుని పరీక్షించినప్పుడు కాలేయం ప్రమాదానికి కారణమైన ఆటోఇమ్యూన్ ఫీచర్లు ఉన్నాయని తెలిపారు. తిప్పతీగలో తీవ్ర హెపటైటిస్‌తో పాటు ఆటో ఇమ్యూన్ ఫీచర్లు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. కాబట్టి ఆయుర్వేదాన్ని తీవ్రంగా ప్రమోట్ చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని దృష్టిలో ఉంచుకోవాలని ఈ అధ్యయనం ద్వారా హెచ్చరించారు.
భారత్‌లో ఇంకా ఐవర్ మెట్రిన్ లాంటి ఔషధాల గురించి సమగ్రంగా తెలియదని, కానీ విస్తృతంగా వినియోగిస్తున్నారని వారు తెలిపారు. అంతేకాకుండా విటమిన్-సీ, డీ, జింక్ లాంటి ప్రత్యామ్నాయ మందుల్లోనూ లోపాలు ఉన్నాయని, వాటిని కోవిడ్ నిరోధకంగా ఉపయోగిస్తున్నారని అన్నారు. ఆయుర్వేద లేదా సహజ మందులంటే చాలా మంది సురక్షితమైన భావన కలిగి ఉన్నారని, అయితే అన్ని రకాల ఔషధాలు మంచినే చేకూరుస్తాయనడం సరికాదని ఈ స్టడీ స్పష్టం చేసింది. సంప్రదాయ నమ్మకాల ఆధారంగా కాకుండా పరీక్షించని ఆయుర్వేద ఉత్పత్తులకు వ్యతిరేకంగా పబ్లిక్ హెల్త్ అధికారులు చర్య తీసుకోవాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని పరిశోధకులు తెలిపారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.