Viral: జంక్‌ఫుడ్‌ను రెండేళ్లు దాచిపెడితే ఏమవుతుంది..? ప్రయోగంలో షాకింగ్ విషయాలు..

ప్రతీకాత్మక చిత్రం

జంక్ ఫుడ్‌ ఆరోగ్యానికి మంచి కాదు.. ఈ మాటను చాలా కాలంగా పెద్దలు, ఆరోగ్య నిపుణులు, వైద్యులు చెబుతూనే ఉన్నారు. అయితే వాటి వినియోగం తగ్గడం మాట అటుంచితే, అవి అమ్మే దుకాణాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అదే క్రమంలో వాటికి ఆదరణ కూడా ఉంటోంది. జంక్‌ ఫుడ్‌ వల్ల వచ్చే ఇబ్బందుల గురించి చెప్పడానికి ఓ పోషకాహార నిపుణురాలు చేసిన పని ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

  • Share this:
జంక్ ఫుడ్‌ ఆరోగ్యానికి మంచి కాదు.. ఈ మాటను చాలా కాలంగా పెద్దలు, ఆరోగ్య నిపుణులు, వైద్యులు చెబుతూనే ఉన్నారు. అయితే వాటి వినియోగం తగ్గడం మాట అటుంచితే, అవి అమ్మే దుకాణాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అదే క్రమంలో వాటికి ఆదరణ కూడా ఉంటోంది. కరోనా దేశంలోకి ఎంటర్‌ అయ్యాక.. అక్కడికి వెళ్లే వాళ్ల సంఖ్య తగ్గింది కానీ.. వాటిని ఇంటికి తెప్పించుకుని తినేవాళ్ల సంఖ్య మాత్రం తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. దీంతో జంక్‌ ఫుడ్‌ వల్ల వచ్చే ఇబ్బందుల గురించి చెప్పడానికి ఓ పోషకాహార నిపుణురాలు చేసిన పని ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఎప్పుడో రెండేళ్ల క్రితం మొదలుపెట్టిన పని.. ఇప్పుడు ఎందరికో కనువిప్పు కలిగేలా చేయాలని పోషకాహార నిపుణురాలి కుమార్తె .. ఈ మొత్తం వ్యవహారాన్ని టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ చేసింది.  ఎలిఫ్‌ కాండెమిర్‌ అనే టిక్‌టాకర్‌ ఇటీవల ఓ వీడియో షేర్‌ చేశారు. అందులో చూస్తే.. ఓ కప్‌బోర్డ్‌లో చిన్న చిన్న బాక్స్‌ల్లో బర్గర్‌లు, చికెన్‌ నగెట్స్‌, సాసేజ్‌ రోల్స్‌, పిజ్జాలు, డోనట్ష్‌ ఉన్నాయి. తినడానికి అన్నేసి తెచ్చి పెట్టుకున్నారా.. పాడైపోవు అనే డౌట్‌ వస్తోందా? అవన్నీ రెండేళ్ల నుంచి ఆ కప్‌బోర్డ్‌లో అలాగే ఉంటున్నాయి.

ఎలిఫ్‌ తల్లి ఓ పోషకాహార నిపుణురాలు. జంక్‌ ఫుడ్‌ తినడం వల్ల వచ్చే సమస్యల్ని వివరిస్తూ ఉంటారట. దీని కోసం ఆమె జంక్‌ ఫుడ్‌ని ఇలా కప్‌బోర్డ్‌లో దాచి ఉంచారట. రెండేళ్లు అలా ఉంచినా.. ఆ ఫుడ్‌ పాడవలేదని, సాధారణ ఆహారం అయితే కొన్ని రోజులు, గంటలకే పాడవుతుందని ఆమె వివరించే ప్రయత్నం చేశారు. ప్రాసెస్‌ చేయడం వల్ల జంక్‌ ఫుడ్‌ ఇలా ఎక్కువ రోజులు ఉంటోందని, ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆమె సూచన. టిక్‌ టాక్‌లో ఈ వీడియోకు మంచి స్పందన వస్తోందట. సుమారు నాలుగు మిలియన్ల వ్యూస్‌తో వీడియో దూసుకుపోతోందని విదేశాల్లో ఉన్న టిక్‌టాక్‌ యూజర్లు చెబుతున్నారు.

ఫాస్ట్‌ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌ వినియోగాన్ని తగ్గించడానికి నిపుణులు చాలా ఏళ్లుగా ఇలాంటి ప్రయోగాలు, సూచనలు చేస్తూనే ఉన్నారు. వీటిని చూసి చాలామంది జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని పాటిస్తున్నారు కూడా. లైఫ్‌ స్టైల్‌, ఫుడ్‌ హ్యాబిట్స్‌ అనేవి ఈ కరోనా కాలంలో చాలా అవసరం. అందువల్ల అనారోగ్యాలకు కారణమయ్యే ఆహారం, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని ఈ టిక్‌టాక్ వీడియోలో క్లుప్తంగా వివరించారు. కాబట్టి జంక్‌ ఫుడ్‌కి దూరంగా ఉందాం... ఆరోగ్యంగా ఉందాం.
Published by:Veera Babu
First published: