Type 2 Diabetes: ఈ వంటింటి చిట్కాల‌తో మధుమేహానికి చెక్.. 30 నిమిషాల్లో షుగర్ లెవల్స్ త‌గ్గించుకోండిలా..

ప్రతీకాత్మక చిత్రం

Type 2 Diabetes: టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వాళ్లు త‌క్కువ కార్బోహైడ్రేట్ ఉన్న ఆహారం, త‌క్కువ షుగ‌ర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. హైప్రొటీన్ ఉన్న డైట్‌ను తీసుకోవాలి. వీటితో పాటు మ‌న వంటింట్లో ఉండే కొన్ని ప‌దార్థాల‌తో త‌క్కువ స‌మ‌యంలో షుగ‌ర్‌ను అదుపులో పెట్టుకోవ‌చ్చు.

  • Share this:
షుగ‌ర్.. డ‌యాబెటిస్ (Type 2 Diabetes) లేదా మ‌ధుమేహం పేరు ఏదైనా ఈ వ్యాధి వ‌ల్ల ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలామంది బాధ‌ప‌డుతున్నారు. ప్ర‌తి ప‌ది మందిలో ఇద్ద‌రి నుంచి ముగ్గురు షుగ‌ర్ వ్యాధికి గుర‌యినవారే. సాధార‌ణంగా డ‌యాబెటిస్‌లో రెండు ర‌కాలు ఉంటాయి. ఒక‌టి టైప్ 1, ఇంకోటి టైప్ 2 డ‌యాబెటిస్. ప్ర‌స్తుతం ఎక్కువ‌మంది టైప్ 2 డ‌యాబెటిస్‌తోనే బాధపడుతున్నారు. శ‌రీరంలో ఉన్న పాన్‌క్రియాస్ అనే గ్రంథి కావాల్సిన ఇన్సులిన్‌ను రిలీజ్ చేయ‌క‌పోవ‌డం, దాన్ని షుగ‌ర్‌గా మార్చి సెల్స్‌లోకి ఎన‌ర్జీ కోసం పంపించే ప్రాసెస్‌లో ఫెయిల్ అవ‌డం వ‌ల్ల ఎన్నో స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. దాని వ‌ల్ల గుండె జ‌బ్బులు, ఒబెసిటీ, కిడ్నీ స‌మ‌స్య‌లు.. ఇలా ఎన్నో వ‌చ్చే ప్ర‌మాదం ఉంది.టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వాళ్లు త‌క్కువ కార్బోహైడ్రేట్ ఉన్న ఆహారం, త‌క్కువ షుగ‌ర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. హైప్రొటీన్ ఉన్న డైట్‌ను తీసుకోవాలి. వీటితో పాటు మ‌న వంటింట్లో ఉండే కొన్ని ప‌దార్థాల‌తో త‌క్కువ స‌మ‌యంలో షుగ‌ర్‌ను అదుపులో పెట్టుకోవ‌చ్చు.

* షుగ‌ర్‌ను అదుపులో పెట్టుకోవ‌డం ఎలా?

ఎక్కువ‌గా ప్రాచుర్యంలో ఉన్న ఏషియ‌న్, చైనీస్ ఫుడ్‌లో వెనిగ‌ర్‌కు చాలా ప్రాధాన్య‌త ఇస్తారు. ఎందుకంటే.. వెనిగ‌ర్ శ‌రీరంలోని షుగ‌ర్ లేవ‌ల్స్‌ను అదుపులో ఉంచుతుంది. అస‌లు వెనిగర్‌కు, షుగ‌ర్‌కు సంబంధం ఏంటి అనే దానిపై రీసెర్చ్ చేశారు కొంద‌రు ప‌రిశోధ‌కులు. దాన్నే నేచర్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు.

ఇది కూడా చదవండి : Vastu Tips: దుర్గమ్మ పూజకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పూలు వాడకండి..!

కొంద‌రు పార్టిసిపెంట్స్‌కు మూడు లేవ‌ల్స్‌లో వెనిగర్‌ను అందించారు. రాత్రి పూట ఫాస్టింగ్ ఉంచి.. ఆ త‌ర్వాత వెనిగ‌ర్‌తో పాటు 50 గ్రాముల‌ పిండిప‌దార్థాలు ఉన్న వైట్ బ్రెడ్‌ను వాళ్ల‌కు పెట్టారు. మ‌రికొంద‌రికి పిండిప‌దార్థాలు అందించారు కానీ.. వెనిగ‌ర్ ఇవ్వ‌లేదు. వాళ్ల గ్లూకోజ్‌, ఇన్సులిన్ స్థాయిల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మానిట‌ర్ చేస్తూ వ‌చ్చారు. కేవ‌లం 30 నిమిషాల్లో వెనిగ‌ర్ తీసుకున్న వాళ్ల శ‌రీరంలోని ర‌క్తంలో ఉన్న గ్లూకోజ్ స్థాయి అదుపులోకి వ‌చ్చింది.

ఇది కూడా చదవండి : Chris Gayle : " ఆ దిగ్గజ క్రికెటర్ పై ఉన్న గౌరవం చచ్చిపోయింది " .. క్రిస్ గేల్ సంచలన వ్యాఖ్యలు..

ఆ త‌ర్వాత ఇన్సులిన్ స్థాయి కూడా అదుపులోకి వ‌చ్చిన‌ట్టు గుర్తించారు. అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహార ప‌దార్థాలు తీసుకున్నా.. వాటితో పాటు కొంచెం వెనిగ‌ర్‌ను కూడా రోజువారి ఆహారంలో భాగంగా చేసుకుంటే అది వెంట‌నే శ‌రీరంలో షుగ‌ర్ లేవ‌ల్స్‌ను అదుపులో ఉంచుతుంద‌ని దీని ద్వారా ప‌రిశోధ‌కులు రుజువు చేశారు. వెనిగ‌ర్ ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లో ఉండే పదార్థ‌మే. అందుకే.. కిచెన్‌లో ఉండే ఈ ప‌దార్థంలో అర‌గంట‌లో షుగ‌ర్‌ను అదుపులో పెట్టుకోవ‌చ్చు.
Published by:Sridhar Reddy
First published: