పర్యావరణం(Ecosystem)లో సమతుల్యతను కాపాడటంలో తేనెటీగ(Bees)ల పాత్ర కీలకం. తేనెటీగలు అంతరించిపోతే ఆహార కొరత ముప్పు తప్పదు. ప్రపంచవ్యాప్తంగా తేనెను (Honey) ఎక్కువగా ఉపయోగిస్తారు. చాలా మంది తేనెటీగల పెంపకం పై ఆధారపడి కూడా జీవిస్తున్నారు. వీటి ప్రాముఖ్యతను వివరించేందుకు ఏటా మే నెలలో ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం మే 20న ప్రపంచ తేనెటీగ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. పర్యావరణంలో తేనెటీగలు(Bees), ఇతర పరాగ సంపర్కాల ప్రాముఖ్యతను గుర్తించడం కోసం తేనెటీగల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటారు. జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడంలో తేనెటీగల ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. పరాగ సంపర్కాలను, వాటి ఆవాసాలను రక్షించేందుకు, మెరుగుపరిచేందుకు, వాటి సంఖ్యను పెంచడానికి, తేనెటీగల పెంపకం దీర్ఘకాలిక అభివృద్ధికి తోడ్పడే చర్యలను ప్రోత్సహించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు, పౌర సమాజాలు, పౌరులకు ఇది అవకాశాన్ని అందిస్తుంది.
ప్రపంచ తేనెటీగల దినోత్సవం థీమ్, చరిత్ర
2022 ప్రపంచ తేనెటీగల దినోత్సవం థీమ్‌గా “బీ ఎంగేజ్డ్: సెలబ్రేటింగ్ ది డైవెర్సిటీ ఆఫ్ బీస్ అండ్ బీ కీపింగ్ సిస్టమ్’ను ప్రకటించారు. తేనెటీగల పెంపకంలో అగ్రగామి అంటోన్ జాన్సా జయంతిని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి మే 20ని ప్రపంచ తేనెటీగ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. స్లోవేనియా ప్రభుత్వం Apimondia అనే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మద్దతుతో 2016లో మే 20ని ప్రపంచ తేనెటీగల దినోత్సవంగా జరుపుకునే ఆలోచనను ప్రతిపాదించింది.
Motorola Edge 30: మోటోరోలా ఎడ్జ్ 30 సేల్ ఈరోజే... తొలి సేల్‌లో భారీ డిస్కౌంట్
2017లో ప్రపంచ తేనెటీగ దినోత్సవంగా గుర్తించాలనే స్లోవేనియా ప్రతిపాదనను UN సభ్య దేశాలు ఆమోదించాయి. నిర్దిష్ట పరిరక్షణ చర్యలను అమలు చేయాలని తీర్మానం చేశారు. తేనెటీగ సంరక్షణ ప్రాముఖ్యతను మానవాళికి వివరించారు. 2018లో తొలిసారిగా ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని పాటించారు.
ప్రాముఖ్యత
మానవులు, మొక్కలు, జంతువులు, పర్యావరణం మధ్య సమతుల్యతను కాపాడుకోవడంలో తేనెటీగలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. తేనెటీగలు లేకపోతే ఆహార కొరత ఏర్పడుతుంది. జనాభా ఎక్కువ భాగం ఆకలితో నశించిపోతుంది. ఎందుకంటే తేనెటీగలు పరాగసంపర్కం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తిని పెంచుతాయి. మానవ కార్యకలాపాల ఫలితంగా తేనెటీగలు ఎదుర్కొంటున్న ముప్పుల గురించి అవగాహన కల్పించడానికి, మన జీవవైవిధ్యంలో తేనెటీగల ప్రాముఖ్యతను గుర్తించడానికి ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
సెలబ్రేషన్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంతో నిర్వహిస్తారు. తేనెటీగల ప్రాముఖ్యతను తెలియజేసే కార్యకలాపాలు, వర్క్‌షాప్‌లు, కార్యక్రమాలను నిర్వహించడానికి అనేక సంస్థలు ముందుకు వచ్చి సహకారం అందిస్తాయి. తేనెటీగల సంరక్షణ కోసం ప్రజలు నిధులను అందించడానికి స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా జరుగుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.