Emergency Care Skills: ఎమర్జెన్సీలో ఎలా కాపాడుకోవాలి? తప్పక తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

Emergency Care Skills: కళ్లు తిరిగి ఉన్నట్టుండి కుప్పకూలితే (collapse) గారబా పడకండి. ఎందుకంటే ఓ మనిషి కుప్పకూలడానికి ఎన్నో కారణాలుండవచ్చు. ఏ గుండెనొప్పో అని మాత్రమే ఆలోచించి బెదిరిపోకండి.

  • Share this:
ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. యాక్సిడెంట్ కావచ్చు. హార్ట్ ఎటాక్ రావొచ్చు. ఏదైనా జరగవచ్చు. మరి అలాంటి పరిస్థితులు ఎదురయినప్పుడు ఏం చేయాలి? ప్రాణాలు కాపాడుకునేందుకు ఎలా వ్యహరించాలి? మీకు CPR, First-aid స్కిల్స్ మీకు తెలుసా? మీ ఇంట్లో ఉండే పెద్దలు, టీనేజర్లకు వీటిపై అవగాహన కల్పించండి. అంబులెన్స్ వచ్చేలోగా అందించే ప్రాథమిక చికిత్స ప్రాణాలు కాపాడుతుంది. బేసిక్ సీపీఆర్ ఎలా చేయాలి, కళ్లు తిరిగి పడిపోతే తక్షణం ఏం చేయాలి, ఇంట్లో ఉండాల్సిన కనీస మెడికల్ కిట్ ఏంటి, కరెంట్ షాక్ తగిలితే ఏంచేయాలి వంటి వాటిపై కనీస అవగాహన ఉంటే సరిపోతుంది.

CPR అంటే..
కార్డియో పల్మనరీ రెససిటేషన్‌ను సీపీఆర్ అంటారు. లైఫ్ సేవింగ్ టెక్నిక్ (life saving technic) గా దీన్ని భావిస్తారు. గుండె నొప్పి వంటివి వచ్చినప్పుడు ఇదే శ్రీరామ రక్షలా పనిచేస్తుంది. కానీ అతిగా ఏదో చేసి నిజంగా ప్రాణాల మీదకు మాత్రం రాకుండా జాగ్రత్త పడటం ప్రధానమైన కర్తవ్యం. వెంటనే ఆసుపత్రికి ఫోన్ చేస్తే సరిపోతుంది.

సృహతప్పి పడిపోతే..
సడన్‌గా కళ్లు తిరిగి, స్పృహ తప్పి పడిపోతే అలా పడిపోయిన వారి భుజాలు చిన్నగా తట్టి, ఏమాత్రం వారు స్పృహలో ఉన్నారో చెక్ చేయాలి. అయినా వారు ఏమాత్రం స్పందించలేదంటే మాత్రం వెంటనే సాయం కోసం కాల్ చేయండి, లేదా ఇరుగు పొరుగును పిలవండి. దీంతోపాటు వారి గొంతు దగ్గర శ్వాస నాళం వద్ద పల్స్ చెక్ చేయండి. 10 సెకెన్లపాటు చెస్ట్ భాగాన్ని కూడా చెక్ చేయండి. పల్స్ చిక్కలేదంటే మాత్రం గుండె నొప్పి వచ్చినట్టు లెక్క. చెస్ట్ భాగంలో నొక్కుతూ, నోటి ద్వారా కొంచెం శ్వాస అందేలా సాయం చేయండి.

దెబ్బలు తగిలితే

పిల్లలు లేదా పెద్దలకు ప్రమాదవశాత్తూ దెబ్బలు తగిలితే బేసిక్ ఫస్ట్ ఎయిడ్ చేశాక వైద్యుల వద్దకు వెళ్లండి. ఫ్రాక్చర్లు అయినా కూడా ఇదే విధానాన్ని అనుసరించండి. ఏమైనా కోసుకున్నా, బొబ్బులు వంటివి వచ్చినా, తక్షణం వాటిని శుభ్రం చేయండి, యాంటీసెప్టిక్ లోషన్ లేదా నీటితో క్లీన్ చేయండి. రక్త స్రావం అవుతుంటే చేతులతో కొంచెం నొక్కి పెట్టినట్టు చేయండి. ఇక ఫ్రాక్చర్ అయితే మాత్రం ఆయా శరీర భాగాన్ని కదలకుండా చూసుకోండి. ఇందుకు అవసరమైతే కార్డు బోర్డు లేదా కట్టె సాయం తీసుకోండి. ఇక ఏదైనా షార్ప్ గా ఉన్న వస్తువు గుచ్చుకుంటే మాత్రం వాటిని బలవంతంగా తీసేసే ప్రయత్నం చేయకుండా, అలాగే ఉంచి, వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. చేత్తో చిన్నగా మర్ధన చేసినట్టు చేస్తే తీవ్ర రక్తస్రావం కాస్త ఆగే అవకాశం ఉంటుంది.

కుప్ప కూలితే..

కళ్లు తిరిగి ఉన్నట్టుండి కుప్పకూలితే (collapse) గారబా పడకండి. ఎందుకంటే ఓ మనిషి కుప్పకూలడానికి ఎన్నో కారణాలుండవచ్చు. ఏ గుండెనొప్పో అని మాత్రమే ఆలోచించి బెదిరిపోకండి. షుగర్, బీపీలో తీవ్ర హెచ్చుతగ్గులు, బాగా నీరసం ఆవహించడం, ఫిట్స్ వంటివి వచ్చి కుప్పకూలవచ్చు. ఇలాంటప్పుడు పల్స్ చూడండి, ఎడమవైపుకు రోగిని తిప్పండి, అప్పుడు శ్వాస అందుతుంది. ఇలాంటప్పుడు తినేందుకు, తాగేందుకు ఏమీ ఇవ్వకుండా తక్షణం వైద్యుల సాయం తీసుకోండి. ఒక వేళ ఇలా పడిపోయిన వారు డయాబెటిక్ అని మీకు ముందే తెలిసి ఉంటే వారి బీపీ, షుగర్ రెండూ తక్షణం చెక్ చేయండి. హైపోగ్లైసీమియా కారణంగా వారు పడిపోయి ఉండవచ్చు.

విద్యుత్ షాక్ (shock)

సాధారణంగా వర్షాకాలంలో హై వోల్టేజ్ కారణంగా కరెంట్ షాక్ తగిలే ప్రమాదాలు జరుగుతుంటాయి. ముందు మెయిన్ కరెంట్ స్విచ్ ఆఫ్ చేయండి. కరెంటు ప్రవాహకం కాని ఎండు కట్టె, కార్డ్ బోర్డ్, ప్లాస్టిక్ వంటివాటితో పడిపోయిన వ్యక్తిని పక్కకు తోయండి. వెంటనే సీపీఆర్ ఇవ్వండి. ఏమైనా కాలిపోయి ఉంటే ఆ కాలిన ప్రాంతంపై శుభ్రమైన గుడ్డ వేసి డాక్టర్ వద్దకు వెళ్లండి. కానీ పొరపాటున కూడా కరెంట్ షాక తగిలిన వ్యక్తిని డైరెక్ట్ గా తాకే సాహసం చేయకండి అలా చేస్తే మీకు కూడా షాక్ తగులుతుంది.

ఫస్ట్ ఎయిడ్ కిట్

ఇంట్లో తప్పని సరిగా ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచండి. ఎమర్జెన్సీ నంబర్లను కనిపించేలా రాసి పెట్టుకోండి. వీటిలో పోలీస్, డాక్టర్, ఆసుపత్రి, అంబులెన్స్ నంబర్లు ఉండేలా చూసుకోండి. మీరు కాల్ చేయగానే స్పందిస్తారన్న సన్నిహితుల నంబరు కూడా కనిపించేలా రాసి పెట్టుకోవాలి. లేదా స్పీడ్ డయల్ లో ఉంటే మరీ మంచిది.

చెప్పి వచ్చేది కాదు కనుక..

ఎమర్జెన్సీ అంటే మనకు చెప్పి రాదు కనుక మీరు సదా సిద్ధంగా ఉండాలి. మన పెద్దలన్నట్టు ముందు కీడెంచి తరువాత మేలెంచాలి కనుక ఇవన్నీ తప్పవు. ఎమర్జెన్సీ టైం అంటే అత్యవసర సమయం ఎప్పుడైనా రావచ్చు. కానీ ఇలా మెడికల్ ఎమర్జెన్సీ టైం వచ్చిందనుకోండి కాళ్లు చేతులు ఆడవు, ఏం చేయాలో బుర్రకు తోచదు. మరి ఇలాంటి సందర్భాల్లో చురుగ్గా, మెరుపు వేగంతో స్పందించకపోతే ప్రాణాలు పోతాయి. ఇందుకు స్పెషల్ నాలెడ్జ్ అవసరం లేదు, అంతేకాదు మెడికల్ ఎమర్జెన్సీల్లో ఎలా స్పందించాలో నేర్పో కోర్సులు కూడా ఏమీ లేవు. మీకై మీరు సమర్థవంతంగా ఇలాంటి క్లిష్ట సమయాల్లో బయటపడి, వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేరుకుంటే ఇక వైద్యులే చికిత్స అందించి, ప్రాణాపాయం నుంచి బయటపడేస్తారు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా CPR, First-aid స్కిల్స్ నేర్చుకుంటే సరి. ఇంట్లో ఉన్నవారు తప్పకుండా ఇలాంటి బేసిక్ స్కిల్స్ నేర్చుకోవాలి. ముఖ్యంగా పెద్దలు, రిటైర్ అయినవారు, టీనేజర్లు ఇంట్లో ఉంటారు కనుక వీరందరికీ ఈ స్కిల్ తెలిసి ఉంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: