Home /News /life-style /

HEALTH TIPS YOU CAN REDUCE YOUR AGE AND IMPROVE BEAUTY BY CONSUMING DRINKING COCONUT MILK TEA HERE IS ITS MAKING PROCESS SK

Coconut Milk Tea: కొబ్బరి పాలతో కమ్మని టీ.. వయసు తగ్గి.. అందం పెరగడం గ్యారంటీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Health and Beauty Tips in Telugu: మీరు ఒకవేళ బరువు తగ్గాలని భావివిస్తుంటే.. కొబ్బరి పాల టీ తాగండి. కొబ్బరి నీళ్లలాగే ఈ టీ కూడా బరువు తగ్గడంలో దోహదపడుతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    టీలో ఎన్నో వైరైటీలు ఉన్నాయి. మిల్క్ టీ, లెమన్ టీ, గ్రీన్ టీ , బ్లాక్ టీని వీటి గురించి మనకు తెలుసు. ఇంట్లో తయారు చేసుకుంటాం. లేదంటే టీ స్టాల్‌కి వెళ్లి తాగుతాం. కానీ మీరెప్పుడైనా కొబ్బరి పాల టీ తాగారా? మీకు దీని గురించి తెలియకుంటే.. మేం చెబుతాం. ఖచ్చితంగా ఒకసారి తాగి చూడండి. ఆ తర్వాత పదే పదే తాగుతారు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది.  మిల్క్ టీ కంటే ఆరోగ్యానికి ఎంతో మంచింది. సాధారణంగానే  కొబ్బరి పాలు చాలా ఆరోగ్యకరమైనవి. అందువల్ల వాటితో టీ తయారు చేసి తాగితే ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు. ఎండాకాలంలో  కొబ్బరి నీళ్లు తాగడం చాలా ఆరోగ్యకరం. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. డీహైడ్రేషన్ సమస్యను తగ్గిస్తుంది. మరి కొబ్బరి పాలతో చేసే టీ వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో.. ఈ టీని తయారు చేసే విధానం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

    కొబ్బరి పాల టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

    ప్రెస్‌వైర్ 18.కామ్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం ..  కొబ్బరి  పాలను గ్రీన్ లేదా బ్లాక్ టీతో కలిపి తయారు చేసిన కెఫిన్ కలిగిన పానీయమే కొబ్బరి టీ. కొబ్బరిని ఎక్కువగా పండించే ఉష్ణమండల ప్రాంతాలలో నివసించే ప్రజలు ఈ పానీయాన్ని తయారు చేస్తారు. కొబ్బరి పాలలో సంతృప్త కొవ్వు పుష్కలంగా ఉంటుంది.  ఇందులో లారిక్ యాసిడ్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ మొదలైనవి అధిక స్థాయిలో ఉంటాయి.  అందువల్ల కొబ్బరి టీ తాగితే ఆరోగ్యానికి మంచిది.

    మీరు కొబ్బరి పాల టీకి గ్రీన్ టీ బ్యాగ్‌లను కలిపినప్పుడు.. అందులో పాలీఫెనోలిక్ సమ్మేళనాలు , ఇతర క్రియాశీల పదార్థాలు కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి.

    ఆయుర్వేదంలో కొబ్బరి పాలను ఎన్నో పోషక విలువలు కలిగినవిగా పరిగణిస్తారు. ఇందులో హైపర్లిపిడెమిక్‌ను సమతుల్యం చేసే మూలకాలు ఉంటాయి. కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు.  యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఇది చర్మానికి మేలు చేస్తుంది. చర్మం నిగారింపును  సంతరించుకుంటుంది. కొబ్బరి టీ తాగితే యవ్వనం పెరుగుతుంది. దీర్ఘకాలం పాటు అందాన్ని కాపాడుతుంది.

    మీరు ఒకవేళ బరువు తగ్గాలని భావివిస్తుంటే.. కొబ్బరి పాల టీ తాగండి. కొబ్బరి నీళ్లలాగే ఈ టీ కూడా బరువు తగ్గడంలో దోహదపడుతుంది. బరువు పెరగడానికి కారణమయ్యే కొవ్వును నాశనం చేసే గుణాలు కొబ్బరిలో పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఇందులో ఉండే క్యాలరీలు కూడా చాలా తక్కువ. నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గడానికి ఇది సాయపడుతుంది.

    ఈ వర్షాకాలంలో మొక్కజొన్న తింటే ఉంటదీ.. డైట్ చేసే వారికి చాలా బెనిఫిట్.

    ఒక పరిశోధన ప్రకారం.. కొబ్బరిలో ఉండే హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్, లారిక్ యాసిడ్‌లు అధిక రక్తపోటు, కరోనరీ హార్ట్ డిసీజ్ నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. అందుకే కొబ్బరి పాలు టీ తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

    కొబ్బరి పాల టీ రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. కరోనా సమయంలో చాలా మంది నిపుణులు కరోనావైరస్ నుంచి రక్షణ పొందడానికి కొబ్బరి నీళ్ళు తాగాలని సూచించారు. కొబ్బరి పాలతో చేసిన టీ తాగడం ద్వారా కూడా మీరు రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.



    కొబ్బరి పాల టీ తయారీ విధానం:
    కొబ్బరి పాల టీ తయారీ కోసం మీకు 3 గ్రీన్ టీ బ్యాగ్‌లు, 1 కప్పు కొబ్బరి పాలు, 4 కప్పుల నీరు, 2 టేబుల్ స్పూన్ల క్రీమ్, వైట్ లేదా బ్రౌన్ షుగర్ అవసరం అవుతాయి. ముందుగా టీ పాట్‌లో 4 కప్పుల నీటిని మరిగించండి. అందులో గ్రీన్ టీ బ్యాగ్స్ వేయండి. ఇప్పుడు ఒక కప్పు కొబ్బరి పాలు, మీగడ వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత కాసేపటికి గ్రీన్ టీ బ్యాగ్‌లను తొలగించండి. అనంతరం మీ రుచికి తగ్గట్టుగా చక్కెరను వేసి.. బాగా కలపండి. అంతే.. టేస్టీ అండ్ హెల్తీ.. కోకోనట్ మిల్క్ టీ రెడీ. ఈ టీని రెగ్యులర్‌తా తాగడం వల్ల మీ ఆరోగ్యం ఎంతో మెరుపడుతుంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Health, Health Tips, Life Style, Lifestyle

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు