Home /News /life-style /

Tea or Coffee: టీ లేదా కాఫీ‌లో ఆరోగ్యానికి ఏది మంచిది ?.. ఈ విషయాలు తెలుసుకోండి

Tea or Coffee: టీ లేదా కాఫీ‌లో ఆరోగ్యానికి ఏది మంచిది ?.. ఈ విషయాలు తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎప్పుడైనా మన ఆరోగ్యానికి టీ మంచిదా? లేక కాఫీనా? అన్న ఆలోచన మీకు వచ్చిందా? అయితే టీ కాఫీ రెండింటి ప్రయోజనాలు, వాటివల్ల ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకొని ఏది తాగితే బెటర్ అని నిర్ణయించుకోండి.

    చాలామందికి ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగందే రోజు మొదలవ్వదు. అది లేకపోతే ఏదో మిస్సయిన ఫీలింగ్ ఇబ్బంది పెడుతుంది. ఇంకొందరికి తలనొప్పి కూడా మొదలవుతుంది. ఇవి తాగగానే వారికి వెంటనే శక్తి అందినట్లుగా ఫీలవుతుంటారు మనలో చాలా మంది. దీనికి వీటిలోని చక్కెర, కెఫీన్ రెండూ కారణాలు. అయితే ఎప్పుడైనా మన ఆరోగ్యానికి టీ మంచిదా? లేక కాఫీనా? అన్న ఆలోచన మీకు వచ్చిందా? అయితే టీ కాఫీ రెండింటి ప్రయోజనాలు, వాటివల్ల ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకొని ఏది తాగితే బెటర్ అని నిర్ణయించుకోండి. టీ లో ఎల్ - థియోనైన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మన మెదడును స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ మనలో ఫోకస్, అటెన్షన్, ఆలోచనా శక్తిని పెంచుతుంది.

    రెగ్యులర్ గా టీ తాగే వారిలో ఎముకల సాంద్రత ఎక్కువగా ఉండడంతో పాటు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే టీ మీ పళ్లను పసుపు రంగులోకి మార్చుతుంది. టీ ఎక్కువగా తాగడం వల్ల ఆహారంలోని ఐరన్ ని తీసుకోవడానికి ఇబ్బంది ఎదురవుతుంది. ఆహారం తిన్న తర్వాత టీ తాగడం వల్ల ఆహారంలోని ఐరన్ ని తీసుకునే శక్తి 62 శాతం మేర తగ్గుతుంది. కాఫీ తీసుకుంటే ఇది కేవలం 35 శాతం మేరకే ఉంటుంది.

    కాఫీ లో ఎక్కువగా ఉండే కెఫీన్ వల్ల బరువు తగ్గే వీలుంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకే చాలామంది బ్లాక్ కాఫీని వర్కవుట్ ముందు ప్రీ వర్కవుట్ గా తీసుకుంటూ ఉంటారు. కొవ్వును కరిగించే గుణాలు కాఫీలో ఎక్కువగా ఉంటాయి. అలాగే గుండె జబ్బులు, డయాబెటిస్, పార్కిన్సన్స్ వంటి సమస్యలను కూడా తగ్గించేందుకు కాఫీ దోహదపడుతుంది. అయితే కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. టీ తో పోల్చితే కాఫీ చాలా ఎసిడిక్ గుణం కలిగి ఉంటుంది. ఫిల్టర్ చేయని కాఫీ వల్ల కొలెస్ట్రాల్ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. రోజూ నాలుగు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే ఎముకల సాంద్రత తగ్గే అవకాశాలుంటాయి. దీనివల్ల ఎముకలు పెళుసుబారడం, విరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

    Weight Loss: బరువు తగ్గాలని ట్రై చేస్తున్నారా.. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా చేయండి

    మీరు నాన్ వెజ్ తినరా ?.. అయితే ప్రొటీన్లు పుష్కలంగా లభించే ఈ ఆహారాలను తీసుకోండి..

    ఈ రెండింటిలో పోల్చితే కాఫీ కంటే టీ మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీలో కెఫీన్ స్థాయులు చాలా తక్కువగా ఉంటాయి. కప్పు బ్లాక్ టీ లో 14 నుంచి 70 మిల్లీ గ్రాముల కెఫీన్ ఉండగా.. కప్పు కాఫీలో 95 నుంచి 200 మిల్లీ గ్రాముల కెఫీన్ ఉంటుంది. అయితే తయారు చేసే విధానాన్ని బట్టి కూడా మనం తాగే డ్రింక్ మంచిదా? చెడ్డదా? అని నిర్ధారణ అవుతుంది. టీ లేదా కాఫీని బాగా మరిగిస్తే అందులోని యాంటీ ఆక్సిడెంట్లు చాలా తగ్గిపోతాయి. అందుకే వీలైనంత వరకు నీటిని వేడి చేసి అందులో టీ లేదా కాఫీ పొడి వేసి ఒక్కసారి కాస్త మరగగానే దింపేయడం మంచిది. ఇది యాంటీ ఆక్సిడెంట్లనే కాదు.. వాటిలోని రుచిని కూడా తగ్గించకుండా కాపాడుతుంది. అయితే ఎంత కాఫీ లేదా టీ లవర్ అయినా సరే రోజుకి రెండు కప్పుల కంటే ఎక్కువ టీ, కాఫీలు తాగడం మంచిది కాదు. మీకు కాఫీ, టీలు తాగే అలవాటుంటే వాటిని చిన్న చిన్న కప్పుల్లో తాగడం వల్ల కెఫీన్ డోస్ ఎక్కువ కాకుండా కాపాడుకోవచ్చు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Coffee, Tea

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు