హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Health Tips: ఉదయం నిద్రలేచాక.. కాళ్లు, చేతుల్లో వాపు ఉందా? అస్సలు లైట్ తీసుకోవద్దు

Health Tips: ఉదయం నిద్రలేచాక.. కాళ్లు, చేతుల్లో వాపు ఉందా? అస్సలు లైట్ తీసుకోవద్దు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Health Tips: ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే.. కాళ్లు, చేతుల్లో వాపు (Swelling in hands and legs)  ఉంటుంది. అందుకే వీటిని తేలిగ్గా తీసుకోవద్దు. అస్సులు నిర్లక్ష్యం చేయవద్దు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  రాత్రి బాగా నిద్రపోయి.. ఉదయం మేల్కొన తర్వాత.. కొందరికి చేతులు, కాళ్లలో వాపు కనిపిస్తుంటుంది. బాగా ఉబ్బినట్లుగా ఉంటాయి. ఉదయం నిద్రలేచిన తర్వాత, చేతుల్లో వాపు ఉంటే.. దానిని తేలిగ్గా తీసుకోవద్దు.  ఏదైనా అనారోగ్య సమస్య ఉంటేనే అలా జరుగుతుంది. ఏం కాదులే అని నిర్లక్ష్యంగా ఉంటే.. రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవు. మరి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉంటే.. కాళ్లు, చేతుల్లో వాపు (Swelling in hands and legs)  ఉంటుంది. తప్పకుండా తెలుసుకోండి.

  మీరు చాలా కాలంగా ఆర్థరైటిస్ (Arthritis) వంటి వ్యాధితో బాధపడుతున్నా... కీళ్లనొప్పులు ఉన్నా.. ఈ సమస్య కనిపిస్తుంది. ఉదయం నిద్రలేచాక.. కాళ్లు, చేతల్లో వాపు కనిపిస్తుంది. దీనికి సకాలంలో చికిత్స చేయించుకోవాలి. అప్పుడే ప్రమాదం నుంచి బయటపడతారు. మీలో ఈ సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందండి.

  మీ గుండె ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలంటే..? మీకోసం డైట్ చిట్కాలు.

  ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఇలా చాలా సార్లు జరుగుతూ ఉంటుంది. గర్భధారణ సమయంలో మన చీలమండలు, చేతుల్లో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అందవుల్ల కాళ్లు, చేతుల్లో వాపు కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో పెద్దగా ఇబ్బదేం ఉండదు. కానీ చేతుల్లో వాపు సమస్య మరీ ఎక్కువగా ఉంటే మాత్రం.. డాక్టర్‌ని కలవడం మంచిది.

  కొబ్బరి చట్నీ తినడం వల్ల చాలా ప్రయోజనాలు.. తెలుసుకోండి..

  కిడ్నీ సమస్యల వల్ల కూడా ఇలా చాలా సార్లు జరుగుతుంది. మూత్రపిండాలు మన శరీరంలోని అతి ముఖ్యమైన భాగం. ఇది శరీరంలోని మలినాలను బయటకు పంపిస్తుంది. కాళ్లు, చేతుల్లో వాపు కనిపిస్తే.. కిడ్నీ పనితీరులో ఏదో తేడా జరిగిందని అనుమానింవచ్చు. అలాంటప్పుడు డాక్టర్‌ని కలిసి సలహాలు తీసుకోవాలి. అప్పుడే రాబోయే వ్యాధి నుంచి ఈజీగా బయటపడవచ్చు.

  చాలా మంది ఆహారంలో ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కేవలం రుచి కోసమే ఉప్పును అధికంతా వాడుతారు. కానీ దాని వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఆలోచించరు. ఉప్పు అధికంగా ఉండటం వల్ల చేతులు, కాళ్లకు సంబంధించిన సమస్యలు వస్తాయి. వాపు కనిపించి.. కీళ్ల నొప్పులు వస్తాయి. మీలో ఇలాంటి సమస్య ఉంటే తేలిగ్గా తీసుకోవద్దు. ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలి.

  (Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Health, Health Tips, Life Style

  ఉత్తమ కథలు