Health Tips : వాకింగ్ చేస్తే గుండెజబ్బులు, కాన్సర్‌ వ్యాధులు రావట..

గుండెసమస్యలు, కాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు పెరిగిపోతున్నాయి. చాలామంది ఈ సమస్యలు రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, తాజా పరిశోధనల ప్రకారం తోటపని, వాకింగ్ వంటి తేలికపాటి పనులు చేయడం వల్ల కూడా ఈ ప్రాణాంతక వ్యాధులు రావని తేలింది.

news18-telugu
Updated: March 24, 2019, 5:57 PM IST
Health Tips : వాకింగ్ చేస్తే గుండెజబ్బులు, కాన్సర్‌ వ్యాధులు రావట..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 24, 2019, 5:57 PM IST
ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్‌సైజ్ ఎంతో ముఖ్యం. ఎవరైనా సరే ప్రతీరోజూ ఎంతోకొంత ఎక్సర్‌సైజ్ చేస్తుండాలి అని చెబుతున్నారు వైద్యులు. ఇది అందరికీ కుదరకపోవచ్చు. అలాంటివారు ఇంట్లోనేకొన్ని పనులు చేయడం, వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా హార్ట్‌ఎటాక్స్, కాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే రెగ్యులర్‌గా వాకింగ్, ఇంట్లో తోటపని వంటివి చేస్తే సరి అని చెబుతున్నారు పరిశోధకులు.
1997 నుంచి 2008 మధ్యకాలంలో 85ఏళ్ల వయసున్న 88వేల మందిపై పరిశోధన జరిగింది. ఇందులో వారు పడిన శ్రమ ఆధారంగా.. వారంలో కనీసం 10 నుంచి 59 నిమిషాల పాటు తోటపని, వాకింగ్ చేసినవారికి గుండెజబ్బులు, ఇతర సమస్యలు 18శాతం తక్కువగా వచ్చాయని తేలింది. అంతేకాదు.. వీరు మిగతావారికంటే ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
కాబట్టి.. వ్యాయామం చేయలేని వారు వాకింగ్, తోటపని, ఇంట్లో పనులు చేయడం అలవాటుగా చేసుకుంటే ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు వాటిల్లదని చెబుతున్నారు.

ఇవికూడా చదవండి..

Summer Tips : బీపీని కంట్రోల్ చేసే కొబ్బరి నీళ్లు..

First published: March 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు