హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Health Tips: ఉప్పులో ఈ ఉప్పు వేరయా.. బ్లాక్ సాల్ట్‌ని ఇలా వాడితే ఊహించని ఫలితాలు

Health Tips: ఉప్పులో ఈ ఉప్పు వేరయా.. బ్లాక్ సాల్ట్‌ని ఇలా వాడితే ఊహించని ఫలితాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Health Tips: మన కూరల్లో వినియోగించే సాధారణ ఉప్పుతో పోల్చితే.. నల్ల ఉప్పులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. డయాబెటిస్ వంటి వ్యాధులపైనా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  కరోనా (Coronavirus) సమయంలో అల్లోపతి మందులే కాదు. ప్రకృతి ప్రసాదించిన ఎన్నో మూలికలు, పండ్లు కూడా మనకు బాగా సాయం చేశాయి. ఉసిరి, తులసి, గిలోయ్, పసుపు వంటి అనేక సహజ పదార్థాలు మన శరీరంలో రోగనిరోధక శక్తి(Immunity)ని పెంచుతాయి. అందుకే కరోనా సమయలో వీటి వినియోగం బాగా పెరిగింది. దగ్గు, జలుబు, జ్వరం,గ్యాస్ వంటి చిన్న చిన్న సమస్యలకు ఇంటి వద్దే చికిత్స చేసుకుంటున్నారు. వంటింట్లో లభించే వస్తువులతో వాటిని నుంచి బయటపడుతున్నారు. ఆ జాబితాలో బ్లాక్ సాల్ట్ (Black Salt) కూడా ఉంది. మన కూరల్లో వినియోగించే సాధారణ ఉప్పుతో పోల్చితే.. నల్ల ఉప్పులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. డయాబెటిస్ వంటి వ్యాధులపైనా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది.


  చాలా వంటకాల్లో బ్లాక్ సాల్ట్‌ను వినియోగిస్తారు. మన ఎంతో ఇష్టపడి తినే పానీ పూరీలో కూడా దీనిని ఉపయోగిస్తారు. చాట్ పాప్డీ నుండి బూందీ రైతా వరకు.. నలుపు ఉప్పు లేకుండా ఈ ఆహార పదార్థాల రుచి అసంపూర్ణంగా ఉంటుంది. మరి నల్ల ఉప్పుతో కలిగే లాభాలంటే తెలుసా?  నల్ల ఉప్పుతో లాభాలు (Black salt Benefits):


  నల్ల ఉప్పు నీటితో జీర్ణక్రియ బాగా జరుగుతుంది. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో నల్ల ఉప్పు నీటిని తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్, ప్రోటీన్లను జీర్ణం చేసే ఎంజైమ్‌లను పెంచుతుంది. తద్వారా జీర్ణవ్యవస్థ (Digestion)  పనితీరు మెరుగుపడుతుంది.


  బ్లాక్ సాల్ట్ వాటర్ ఊబకాయాన్ని (Obesity) తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఒబెసిటీ చిట్కాల జాబితాలో నల్లఉప్పు కూడా ఉంటుంది. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో నల్ల ఉప్పు నీటిని తాగడం వల్ల బరువు తగ్గుతారు. బ్లాక్ సాల్ట్‌లో ఉండే యాంటీ ఒబెసిటీ గుణాలు ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.


   ఈ గ్రూపు రక్తం ఉన్నవారికి గుండెపోటు కచ్చితంగా వస్తుందట? కారణం ఏంటి..


  డయాబెటిస్ రోగులకు (Diabetes Patients)  కూడా ఎంతో మేలు చేస్తుంది. డయాబెటిక్ రోగులకు చక్కెర, ఉప్పును పరిమిత పరిమాణంలో తీసుకోవాలని తరచుగా వైద్యులు సలహా ఇస్తారు. బ్లాక్ సాల్ట్‌లోని సోడియం పరిమాణం సాదా ఉప్పు కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా నల్ల ఉప్పు మధుమేహ రోగులకు మేలు చేస్తుంది.  జుట్టును శుభ్రం (Hair Cleaning) చేయడానికి కూడా నల్ల ఉప్పు నీటిని కూడా ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే క్లెన్సింగ్ ఎక్స్‌ఫోలియేటింగ్ పదార్థాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడమే కాకుండా.. స్కాల్ప్‌ (తలపై ఉండే చర్మం)ను కూడా శుభ్రం చేస్తాయి.


  ఈ రోజుల్లో చాలా మంది గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మలబద్ధకం కూడా సర్వ సాధారణమయిపోయింది. ఇలాంటి పరిస్థితిల్లో బ్లాక్ సాల్ట్ కలిపిన తర్వాత గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మలబద్ధకం నుండి సులభంగా ఉపశమనం పొందవచ్చు. గ్యాస్ ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి.


  (Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Health, Health Tips, Life Style, Lifestyle

  ఉత్తమ కథలు