Health Tips : దగ్గు, జలుబు వెంటనే తగ్గాలా... ఇలా చెయ్యండి

దగ్గు, జలుబు వెంటనే తగ్గాలా... ఇలా చెయ్యండి

Health Tips for Cold and Cough : ఏ కాలంలోనైనా వాతావరణం మారగానే... చాలా మందికి వ్యాపించే అనారోగ్య సమస్యల్లో దగ్గు, జలుబు కామన్. వాటిని లైట్ తీసుకుంటే చాలా రోగాలకు దారితీస్తాయి. అందుకే వాటిని వెంటనే ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.

 • Share this:
  Health Tips for Cold and Cough : దగ్గు, జలుబు లేకుండా ఉంటే మనం చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు ఫీలవుతాం. అదే గొంతులో తేడాగా ఉన్నా... ముక్కులో గడబిడ ఉన్నా... క్రమంగా మనం నీరసించిపోతాం. ఎందుకంటే ఈ దగ్గు, జలుబు అనేవి... మన బాడీలో చాలా రుగ్మతలకు అవకాశం కల్పిస్తాయి. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఇలా వన్ బై వన్ అన్నీ వచ్చేలా చేస్తాయి. కాబట్టి... దగ్గు, జలుబు రాగానే మనం అలర్ట్ అవ్వాలి. తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి. వేడి చేసే ఆహారం, స్పైసీ ఫుడ్ తగ్గించెయ్యాలి. ఇవన్నీ చేస్తూనే చాలా మంది టాబ్లెట్లు వేసేసుకుంటారు. అది ప్రమాదకరం. ఎందుకంటే, ప్రతీ చిన్న అనారోగ్యానికీ టాబ్లెట్లు వేసేసుకుంటే... మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఏదైనా జబ్బు రాగానే మంచి బ్యాక్టీరియా... ఆ జబ్బుకి కారణమయ్యే సూక్ష్మక్రిములను తరిమెయ్యడం మానేస్తాయి. టాబ్లెట్ వేసుకుంటారుగా మనకెందుకులే అని సైలెంటవుతాయి. అందువల్ల మంచి బ్యాక్టీరియాతోనే పని కానివ్వాలి. అందుకోసం మనం వీలైనంతవరకూ శరీరానికి మందులు అలవాటు చెయ్యకూడదు. అదే సమయంలో మనం మరో మూడు చిట్కాలు కూడా పాటించాలి. అవి పాటిస్తే... దగ్గు, జలుబు వెంటనే తగ్గుతాయి.

  1.వేడి ద్రవాలు తాగాలి : వేడి నీరు, వేడి ద్రవాలను కొద్ది కొద్దిగా (టీ తాగుతామే అలా) తాగాలి. జ్వరం వచ్చినప్పుడు కూడా ఇలాగే చెయ్యాలి. గోరువెచ్చటి నీరు, గోరువెచ్చటి సూప్స్ తాగితే... వెంటనే ఉపశమనం కలుగుతుంది.

  2. పుక్కిలింతల చిట్కా : నీటిని నోటిలో పోసుకొని... ఓ రెండు నిమిషాలు పుక్కిలించి... బయట పారేయాలి. ఇలా ఒకట్రెండుసార్లు చేస్తే... గొంతులో రిలీఫ్ లభిస్తుంది. ఇలా రోజుకు రెండుసార్లైనా చెయ్యాలి. గోరువెచ్చటి నీటిలో... ఉప్పు లేదా పసుపు వేసుకొని... పుక్కిలిస్తే... గొంతులో మంట, గరగర వంటివి తాత్కాలికంగా తగ్గుతాయి.

  3. విశ్రాంతి అవసరం : దగ్గు, జలుబు వంటివి ఉన్నప్పుడు... ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. అవి తిరిగి రావాలంటే... కాస్త విశ్రాంతి తీసుకోవాలి. అలా రెస్ట్ తీసుకోవడం వల్ల... మనలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఒక్కసారి అది పెరిగిందంటే... ఇక వ్యాధిని తెచ్చే క్రిముల పని అయిపోయినట్లే. దగ్గు, జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు... ఆఫీస్‌కి వెళ్లి పనులు చేయడం కంటే... ఆ రోజు విశ్రాంతి తీసుకుంటే... ఒక్క రోజుతోనే అనారోగ్యం పరారవుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

   

  Pics : గూగుల్ సెర్చ్‌లో దుమ్మురేపుతున్న అమృతా ఫడ్నవీస్...
  ఇవి కూడా చదవండి :

  Health Tips : ధ్యానంలో ఏకాగ్రత పెరగాలా? ఈ తైలాలు వాడితే సరి...

  Health Tips : వైట్ టీ తాగుతున్నారా... ఆరోగ్యానికి మేలు

  Health Tips : మిల్క్ చాకొలెట్స్ తింటే... ఎన్నో ప్రయోజనాలు


  Health Tips : పండగ సీజన్‌లో డయాబెటిస్ కంట్రోల్ ఎలా... ఇలా చెయ్యండి

  Fitness Health : కొలెస్ట్రాల్‌ని కట్టడి చేసే కరివేపాకు

  First published: