హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Weight loss: ఇవి తింటే కొవ్వు ఐస్‌లా కరగడం ఖాయం.. ఇట్టే సన్నబడతారు

Weight loss: ఇవి తింటే కొవ్వు ఐస్‌లా కరగడం ఖాయం.. ఇట్టే సన్నబడతారు

కపాలభారతి. ఇదో అద్భుతమైన ప్రక్రియ. దీనిని ప్రాక్టీస్ చేయడం వల్ల శరీరంలో మెరుగైన జీర్ణక్రియకు సహాయపడటం, బరువు తగ్గడం జరుగుతుంది.

కపాలభారతి. ఇదో అద్భుతమైన ప్రక్రియ. దీనిని ప్రాక్టీస్ చేయడం వల్ల శరీరంలో మెరుగైన జీర్ణక్రియకు సహాయపడటం, బరువు తగ్గడం జరుగుతుంది.

Weight Loss Tips: కొన్ని రకాల పళ్లు లేదా కూరగాయలు తింటే బాగా సన్నబడతారు. కాబట్టి మీ మెనూలో అలాంటివి ఎక్కువగా చేర్చుకునే ప్రయత్నిస్తే సన్నబడాలనే మీ తాపత్రయానికి ప్రయోజనం ఉంటుంది.

సన్నబడాలి.. నలుగురిలో నాజూగ్గా కనిపించాలి.. నేతి యువత ఆలోచనలు ఇవే. పాతికేళ్లకే ఎంతో మంది పొట్టలేసుకొని తిరుగుతున్నారు. రకరకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతన్నారు. బరువు తగ్గేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఐతే బరువు తగ్గాలంటే దృఢచిత్తం ఉండటమే కాదు.. అందుకు తగ్గ పోషకాహారం తీసుకుని, బరువు తగ్గించేందుకు సాయపడే కొన్ని వెరైటీ పళ్లు కూరగాయలను ఆశ్రయించాల్సిందే. మరి ఇలా వేగంగా మన ఒంట్లో కొవ్వు కరిగించే గుణాలు పుష్కలంగా ఉన్న వాటిలో మిర్చి ఒకటని మీకు తెలుసా. మీరు కారం పెద్దగా ఇష్టపడకపోయినా కాస్త కారం ఎక్కువ వేసుకుని తింటే మీరు బరువు తగ్గించుకోవచ్చు. అందుకే ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్ గా fat-burning పేరుగాంచిన కొన్ని పదార్థాలపై ఫోకస్ పెట్టండి. ఎక్సర్ సైజులు చేస్తూ, చెడ్డ కొవ్వు ఎక్కువగా ఉన్న పదార్థాలకు దూరంగా ఉంటూ సరైన ఆహారాన్ని తీసుకుంటే తప్పకుండా మీరు బరువు తగ్గి ఆరోగ్యంగా, సహజసిద్ధంగానే సన్నబడి ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇలా సన్నబడ్డాక కూడా మళ్లీ మీరు పెరక్కుండా చూసుకోవటం అతి ముఖ్యమైన విషయం. కాబట్టి సన్నబడేందుకు, సన్నబడ్డాక కూడా మీరు మీ మెనూను జాగ్రత్తగా డిజైన్ చేసుకోవటం తప్పనిసరి.

మిరపకాయలు

ఒంట్లోని కొవ్వు నిల్వలను తగ్గించటంలో చక్కగా సాయపడే మిరపకాయలు మీ ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోండి. మీకు కారం ఇష్టమైనా కాకపోయినా మీరు తినే తిండి కాస్త కారంగా ఉండేలా చూసుకోండి. మిరపకాయల్లోని యాంటీఆక్సిడెంట్లైన కాప్సైసిన్ కు బరువును నియంత్రించే లక్షణం ఉంటుంది. దీంతో కడుపు నిండినట్టై, అతిగా బరువు పెరగకుండా ఇద క్రమబద్ధీకరించేందుకు సాయపడుతుంది. కాబట్టి కాస్త స్పైసీ టేస్ట్ ని ఎంజాయ్ చేయటం రొటీన్‌గా పెట్టుకోండి.

కాఫీ

అదేంటి కాఫీతో సన్నబడతారా అనకండి. కాఫీలోని కెఫీన్ (caffeine) మెటబాలిజం రేటును బాగా పెంచుతుంది. కెఫిన్ తో coffee can actually help you burn excess fat ఎక్కువ కెలరీలు ఖర్చవుతాయి. అంటే ఎక్కువ ఫ్యాట్ కరిగినట్టే. అలాగని అతిగా కాఫీ తాగేసి, సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోకండి. కాఫీ ప్రియులకు ఇది గుడ్ న్యూస్ అయినా ఇందులో పాలు, చక్కెర వేసుకుని తాగడం మానుకుని చక్కెరకు బదులు కొంచెం పరిమాణంలో బెల్లం వేసుకోవచ్చు. లేదా షుగర్ లెస్ తాగితే మరీ మంచిది. నిజానికి కాఫీ డికాషన్ అంటే బ్లాక్ కాఫీతో మెటబాలిజం పెరుగుతుంది. కాబట్టి మీరు తాగాల్సింది బ్లాక్ కాఫీనే కానీ కాఫీ కాదు.

కోడి గుడ్లు

ప్రొటీన్లకు కేరాఫ్ కోడిగుడ్లు. ఫిట్నెస్ ఫ్రీక్స్ కు ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్ అంటే ఎగ్స్, ఎగ్స్ తో చేసిన ఆహారం. అంతేకాదు ఆకలిని పూర్తిగా సంతృప్తిపరిచే శక్తి గుడ్లకు ఉంది కనుక మీకు ఫుల్ ఎనర్జీ కూడా వస్తుంది. బ్రేక్ ఫాస్ట్ లో 3 గుట్లు తింటే 16శాతం బాడీ ఫ్యాట్ ను అది కరిగిస్తుందట. నూనె వేసి చేసిన ఆమ్లెట్లు వంటివాటి కంటే ఉడికించిన గుడ్లు అత్యంత ఆరోగ్యకరం.

గ్రీన్ టీ

జీరో కెలరీలున్న గ్రీన్ టీ (green tea)తో EGCG అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా మన శరీరంలోకి చేరతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు మన శరీరంలోని చెడ్డ కొవ్వును బాగా కరిగిస్తాయి. తరచూ ఓ కప్పు గ్రీన్ టీ తాగితే కడుపు నిండి, క్రేవింగ్స్ తగ్గి జంక్ ఫుడ్ (junk food) జోలికి పోకుండా చేస్తుంది. మీరు ఆఫీసుకు వెళ్లినప్పుడు కూడా గ్రీన్ టీ బ్యాగులను తీసుకెళ్తే వేడి నీళ్లలో ఈ బ్యాగును డిప్ చేసి తాగండి. మీరు ఉత్సాహంగా, తేలికగా ఫీల్ అవ్వటం ఖాయం.

యాపిల్ సెడార వెనిగర్

ఇందులోని అసెటిక్ యాసిడ్ ఫ్యాట్ బర్నింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. కాబట్టి బరువు తగ్గే ప్రక్రియ మరింత వేగం పుంజుకుంటుంది. గోరు వెచ్చని నీటిలో ఓ టేబుల్ స్పూన్ యాపిల్ సెడార్ వెనిగర్ వేసుకుని తాగండి. ఇలా రోజుకు 3-4 సార్ల వరకు చేయవచ్చు. పరగడుపున చేస్తే మరీ మంచిది. లేదా మధ్యహ్నం, రాత్రి భోజనానికి 5 నిమిషాల ముందు ఇది తాగండి. కానీ మీకు అల్సర్లు వంటివి ఉంటే మాత్రం ఇలాంటి ప్రయోగాలు చేయకండి. యాపిల్ సెడార్ వెనిగర్ తాగే సమయంలో మీ పళ్లకు తగలకుండా తాగండి. మీ పళ్లకు తగిలితే ఎనామిల్ దెబ్బతిని మీకు సెన్సిటివిటీ సమస్య పుట్టుకొస్తుంది. కాబట్టి కొంచె జాగ్రత్త అవసరం.

ఆలివ్ ఆయిల్

ఇతర నూనెలకంటే ఆలివ్ ఆయిల్ చాలా మంచిదని ఎప్పటినుంచో పరిశోధనలు ఘోషిస్తున్నాయి. హెచ్డీఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించే శక్తి దీనికి ఉంది. ఈ నూనెలోని ట్రైగ్లిసరైడ్స్ కు ఉన్న ప్రత్యేక లక్షణాలే ఇందుకు కారణం. జీఎల్పీ-1 వంటివి విడుదల చేసి కొన్ని హార్మోన్లపై ప్రభావం చూపడం కారణంగా అతిగా ఆకలి అనిపించదు. అంతేకాదు మెటబాలిక్ రేట్ ను పెంచే లక్షణాలు ఆలివ్ నూనెకు ఉన్నాయి. సలాడ్లపై కొన్ని చుక్కల ఆలివ్ నూనె వేసుకోవటం లేదా ఆలివ్ నూనెతో వంటలు చేసుకుంటే సరి.

Published by:Shiva Kumar Addula
First published:

Tags: Ayurveda health, Health benifits, Health food, Weight loss

ఉత్తమ కథలు