Sabja seeds benefits: చియాను పక్కనబెట్టి సబ్జాను తినండి.. ఇవీ ప్రయోజనాలు

సబ్జా గింజలు

Sabja seeds benefits: సబ్జా గింజల్లో ఫైబర్, గుడ్ ఫ్యాట్, క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందుకే సబ్జా గింజలను నిత్యం తీసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

  • Share this:
Sabja seeds benefits: చవకగా పోషకాలు రావాలన్నా, శరీరానికి ఈజీగా పోషకాలు అందాలన్నా సబ్జా గింజలు బెస్ట్ ఆప్షన్. ఇటీవల కాలంలో న్యూట్రిషనిస్టులు పదేపదే సబ్జా గింజల ప్రయోజనాలను చెబుతుండటంతో ఫిట్నెస్ ఫ్రీక్స్ (fitness freaks) కూడా వీటిని మెనూలో చేర్చుకుంటున్నారు. బేసిల్ సీడ్స్‌గా (basil seeds) వీటిని పిలుస్తారు. పాశ్చాత్య దేశాల్లో చియా గింజలు (chia seeds) ఎక్కువగా తింటే మనదేశంలో చియా సీడ్స్‌కు అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా సబ్జా సీడ్స్ ఉపయోగిస్తారు. శతాబ్దాలుగా సబ్జా గింజల ఉపయోగం మనదేశంలో ఉన్నప్పటికీ ఇటీవల కాలంలోనే వీటిని విస్తృతంగా ఉపయోగించటం మొదలుపెట్టారని చెప్పచ్చు. చియా గింజలకు డిమాండ్ పెరిగాకగానీ మనం మన సబ్జా గొప్పతనాన్ని గుర్తించలేకపోయాం.


సూపర్ ఫుడ్

సబ్జా గింజలను దేశీ సూపర్ ఫుడ్ గా పేర్కొంటారు. ఎక్కువ ప్రొటీన్, తక్కువ కెలరీలున్న గింజల లిస్ట్ తీసుకుంటే వాటిలో మొదటి స్థానం సబ్జాదే కావడం విశేషం. మనదేశంలో అన్ని ప్రాంతాల్లో ఇవి లభిస్తాయి. కాబట్టి ఏడాది పొడవునా మీకు నచ్చిన రూపంలో సబ్జా గింజలు తింటే మంచి ప్రయోజనాలుంటాయి. ఆయుర్వేదలో వీటి వాడకాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇందులో మెటబాలిజం బూస్టింగ్ (metabolism boosting) ప్రాపర్టీలు ఎక్కువ అంతేకాదు గుండె జబ్బులు రాకుండా చేసే శక్తి కూడా ఈ చిన్న గింజలకు ఉంది.


సంప్రదాయ వంటల్లో భాగం

సంప్రదాయ వంటలైన మొఘలాయి, దక్షిణ భారత దేశ వంటలు, ఉత్తరాది వంటల్లో వీటిని వివిధ రూపాల్లో ఉపయోగిస్తారు. ఫలూదా, ఐస్ క్రీమ్, మిల్క్ షేక్, మజ్జిగ, పలు స్వీట్లలో ఈ గింజలు ఉపయోగిస్తారు. దీంతో వాటికి మంచి రుచి, టెక్చర్ వస్తుంది. సబ్జా గింజలు వేసిన ఈ పదార్థాలు నోరూరిస్తాయి.


ఫైబర్ లోడెడ్..

ఫైబర్ పుష్కలంగా ఉన్న గింజల్లో సబ్జా కూడా ఒకటి. ఒక్క టేబుల్ స్పూన్ సబ్జా గింజల్లో 7 గ్రాముల ఫైబర్ ఉంటుంది. కాబట్టి మీరు తినే ఆహారంలో ఫైబర్ తక్కువ ఉంటే దానికి విరుగుడుగా సబ్జా గింజలను తీసుకోండి. ఓ వాటర్ బాటిల్ లో నీళ్లు తీసుకుని, అందులో కొంచెం సబ్జా గింజలు వేస్తే సరి. అరగంట తిరక్కముందే అవి బాగా నాని, ఉబ్బి, జెల్లీగా కనిపిస్తాయి. ఈ నీటిని రోజంతా తాగుతూ ఉంటే సరి. రోజూ ఇలా చేస్తే మీకు ఆరోగ్యం మెరుగవ్వటమే కాదు, బరువు తగ్గాలనుకున్న (weight loss) వారికి ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది.


బ్లడ్ షుగర్

బ్లడ్ షుగర్ అదుపుచేసేందుకు అత్యుత్తమ సాధనంగా సబ్జా గింజలు వాడచ్చు. డయాబెటిక్స్ ఉన్న వారికి ఇది మంచి పోషకాహారం కూడా. భోజనం తరువాత సబ్జా గింజలు తీసుకుంటే చాలు బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి. అందుకే వీటిని డెజర్ట్స్ లో కలుపుతారు. డెజర్ట్స్ మనం తీసుకునేది భోజనం తరువాతే కదా. స్మూతీలు, ఐస్ క్రీములు, ఫలూదా వంటి వాటిని భోజనం తరువాత తీసుకుంటారు కనుక అప్పుడు సబ్జా గింజలు బొజ్జలోకి పోతే వైద్యపరంగా చాలా మంచిదన్నమాట.


కొవ్వు

బేసిల్ సీడ్స్ లో 'పెక్టిన్స్' అంటే గాలెక్టరోనిక్ యాసిడ్ ఉంటుంది. మన ఒంట్లోని కొలెస్ట్రాల్ తగ్గించే శక్తి పెక్టిన్స్ కు ఉంటుంది.


పేగుల ఆరోగ్యం మెరుగుపరుస్తుంది

పెక్టిన్స్ ప్రీబయోటిక్స్ (prebiotics) కనుక కడుపులో మంచి బ్యాక్టీరియా వృద్ధిచెందేలా చేస్తుంది. దీంతో పేగుల ఆరోగ్యం మెరుగవుతుంది. జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా పెరిగినప్పుడు జీర్ణం బాగా అయి, మనం తిన్న ఆహారంలోని పోషకాలు మన ఒంట్లోకి చేరతాయి.


మినరల్స్ అధికం

సబ్జా గింజల్లో మినరల్స్ అధికంగా ఉంటాయి. మనకు శక్తిని ఇచ్చేందుకు, మెటబాలిజం పెంచేందుకు, మంచి నిద్ర వచ్చేందుకు మినరల్స్ చాలా అవసరం. ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటివి అధికంగా ఉన్న సబ్జా గింజలతో మినరల్స్ లోపాన్ని అధిగమించవచ్చు. అంతేకాదు మన శరీరంలోని ఎముకలు మరింత బలపడి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తి బాగా పెరిగి, కండరాలు రిపేరీ అయ్యేలా సబ్జా గింజల్లోని ఔషధ గుణాలు సాయపడతాయి. ముఖ్యంగా శాకాహారులకు, వేగన్స్ కు (vegans) ఇది సూపర్ ఫుడ్ లా పనిచేస్తుంది.


ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్..

మనిషి మెదడు చురుగ్గా పనిచేయాలంటే శరీరంలో గుడ్ ఫ్యాట్ నిల్వలు ఎక్కువ ఉండాలి. ఇలా గుడ్ ఫ్యాట్ పెంచేందుకు సబ్జా గింజలు చక్కగా పనిచేస్తాయి కనుక ఈ చిన్న గింజలు మన మెదడుకు ఇంధనంలా పనిచేస్తాయంటే అతిశయోక్తి కాదు. ఒమేగా-3 (Omega-3) ఫ్యాట్ లోని ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA) ఈ గింజల్లో ఉంటుంది. ఈ యాసిడ్ తీసుకోవటం వల్ల ఇన్ఫ్లమేటరీ బెనిఫిట్లు దక్కుతాయి. రోజూ ఒకే ఒక్క స్పూన్ సబ్జా గింజలు తింటే చాలు మీ శరీరానికి రోజూ కావాల్సిన ALA పూర్తిస్థాయిలో లభిస్తుంది. ఇన్న సుగుణాలుండి మన శరీరానికి మంచి చేసే సబ్జా గింజలను మీ మెనూలో తప్పకుండా చేర్చుకుని, సబ్జా రుచులను ఆస్వాదించండి.
Published by:Shiva Kumar Addula
First published: