Health Tips : ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి మనం ఎన్ని అడుగులు నడవాలంటే..

నడవడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ... దాన్ని అంత సీరియస్‌గా ఎవరూ తీసుకోరు. పైగా.. నడవాలా.. ఎంతదూరం అని ఆ విషయం తెలుసుకోకుండా బద్దకిస్తారు. అయితే, రోజుకి ఇన్ని అడుగులు నడిస్తే ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు నిపుణులు..

Amala Ravula | news18-telugu
Updated: May 22, 2019, 9:48 AM IST
Health Tips : ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి మనం ఎన్ని అడుగులు నడవాలంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వ్యాయామం చేయడం కుదరకపోతే సరే ఈరోజు కుదరలేదని ఓ కుంటి సాకు చెప్పి తప్పించుకుంటారు. కానీ, అలా చేయడం మంచిది కాదు.. వ్యాయమం చేయడం కుదరకపోతే నడవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. దాదాపు రోజులో 5000 అడుగులు వేయాలి. కానీ, మన లైఫ్ స్టైల్ చూస్తే రెండువేల అడుగులు దాటడం కష్టం. కాబట్టి రోజూ 5వేల అడుగులకి మించి నడవడం మంచిది. ఇది కూడా మెల్లిగా కాకుండా వీలైనంత వేగంగా నడవాలి. ఈ అడుగుల సంఖ్యని పెంచుకుంటూ పోవాలి. రోజూకి 10వేల అడుగులు వేయడం చాలా మంచిది. కేవలం ఖాళీ ప్రాంతాల్లోనే కాదు.. ఆఫీస్ పరిసరాల్లోనూ అడుగులు వేయొచ్చు. అయితే.. ఈ అడుగుల సంఖ్య మనకి ఎలా తెలుస్తుందంటే మాత్రం ఫిట్‌నెస్ ట్రాకర్స్‌పై ఆధారపడాల్సిందే. ఇది కష్టమనుకుంటే మాత్రం.. స్మార్ట్‌ఫోన్స్‌లోనే యాప్స్‌ని ఇన్‌స్టా్ చేసుకోవచ్చు. దీనివల్ల నడుస్తున్నంత సేపు మొబైల్ పట్టుకుంటే మనం ఎంతదూరం నడిచామన్నది తెలుసుకోవచ్చు.

ఇక మాములు రోజుల్లో 5వేల అడుగులు మించి నడిచి..సెలవు దినాల్లో ఎక్కువదూరం నడవాలి. ఖచ్చితంగా 10వేల అడుగులు వేయాలి. పనులతో ఎలా కుదురుతుందంటే.. బయటికి వెళ్లాలనుకుప్పుడు బైక్స్, కార్లు ఉపయోగించే బదులు.. నడిచి వెళ్లండి.. కూరగాయలు, సరుకులు తీసుకురావడానికి నడవడం మంచిది. రెండు పనులు అవుతాయి. అదేవిధంగా.. స్నేహితులు, బంధువులు దగ్గర్లో ఉంటే వారింటికి వెళ్లి మాట్లాడండి..


ఇలా చిన్న మార్పులతోనే ఆరోగ్యంగా ఉండొచ్చు. మనకి కావాల్సింది టైమ్ కాదు.. బద్దకం వీడి శరీరానికి పనిచెప్పడం.. ఆల్ ది బెస్ట్..
First published: May 22, 2019, 9:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading