Home /News /life-style /

HEALTH TIPS SHOULD YOU REPLACE YOUR SUGAR WITH JAGGERY HERE IS THE DETAILS SU GH

Jaggery Benefits: బెల్లం వాడకం మేలా?, లేక చక్కెర వాడడమే మంచిదా?... ఈ విషయాలు తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెల్లని రిఫైన్డ్ చక్కెర (sugar) కంటే బెల్లం (Jaggery) అన్ని విధాలా మెరుగైనది.  మంచి పోషకాలున్న బెల్లంను మితంగా తింటే కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి.

తెల్లని రిఫైన్డ్ చక్కెర (sugar) కంటే బెల్లం (Jaggery) అన్ని విధాలా మెరుగైనది.  మంచి పోషకాలున్న బెల్లంను మితంగా తింటే కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి.  మధుమేహ వ్యాధిగ్రస్తులు (diabetics) కూడా కొంత వరకు బెల్లంను తినచ్చు.  చక్కెర, బెల్లం రెంటిలోనూ ఒకే కాలోరిఫిక్ వాల్యూలు ఉంటాయి. కనుక బెల్లం మంచిదని హ్యాపీగా లాగించేయకండి. రసాయనాలతో చేసే చక్కెర.. పంచదారను పలు రసాయనాలతో తయారు చేస్తారు కనుక వీలైనంత ఈ వైట్ షుగర్ కు దూరంగా ఉంటే మంచిది.  మీరు చేసుకునే టీ, కాఫీ, స్వీట్లు, డెజర్ట్సు, జ్యూసుల్లో వీలైనంత మేరకు చక్కెర వాడకుండా జాగ్రత్తపడండి.  చక్కెరకు చక్కని ప్రత్యామ్నాయమైన బెల్లాన్ని వాడటం అలవాటు చేసుకోండి.  బెల్లంలోని పోషకాలు రక్తహీనత వంటి వాటిని అధిగమించేలా చేస్తాయి. కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని పెంపొందించే స్వచ్ఛమైన బెల్లంను ఎంపిక చేసుకోండి.  బెల్లం తయారీలో కూడా రసాయనాలు ఉపయోగిస్తారు. కాబట్టి నల్ల బెల్లంను అందునా గానుగలో తయారు చేసే బెల్లంను ఎంపిక చేసుకోవటం చాలా మంచిది.  డేట్ పామ్, కోకోనట్ సాప్, తాటి చెట్లు, చెరకు నుంచి తయారు చేసే వెరైటీ బెల్లం మార్కెట్లో అందుబాటులో ఉంది.   దిమ్మెలు, అచ్చులు, వుండలు, పొడి రూపంలో బెల్లం దొరుకుతుంది.

బెల్లంలో ఉన్న పోషకాలు..
బెల్లంలో 40-60% సుక్రోజ్ ఉంటుంది, 30-40% నీరు, 20-25% ఇన్వర్టెడ్ షుగర్ ఉంటుంది.100 గ్రాముల బెల్లంలో ఈకిందివన్నీ ఉంటాయి..
358 కెలరీలు
27 మిల్లీ గ్రాముల సోడియం
453 మిల్లీ గ్రాముల పొటాషియం
0.22% క్యాల్షియం
32% ఐరన్
85 గ్రాముల కార్బోహైడ్రేట్స్

ఆరోగ్యానికి మంచిది:
బెల్లంతో వంటలకు వచ్చే రుచి చాలా బాగుంటుంది కనుక చెఫ్ లు దీన్ని 'లిక్విడ్ గోల్డ్' (liquid gold) అంటారు.  రక్త హీనత (anaemia) ఉన్నవారికి బెల్లం దివ్యౌషధంలా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తి (immunity) పెంచటంలో బెల్లం ఉపయోగపడుతుంది.

1. ఆస్తమా, బ్రాంకైటిస్ నివారణబెల్లంలోని యాంటీ-అలర్జిక్, బాడీ టెంపరేచర్ రెగ్యులేటింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. పలు శ్వాసకోస సమస్యలకు చెక్ పెట్టేలా ఔషధంలా బెల్లం పనిచేస్తుంది. ఆస్తమా, బ్రాంకైటిస్ రాకుండా నివారించే శక్తి బెల్లానికి ఉంది.   అందుకే శ్వాస సంబంధిత సమస్యలున్నవారు చక్కెర వాడకాన్ని నిలిపివేసి, బెల్లం వాడమని నిపుణులు సూచిస్తున్నారు.

2. మినరల్స్ ఎక్కువఎన్నో మంచి మినరల్స్, యాంటీఆక్సిడెంట్లైన పొటాషియం, జింక్, సెలీనియం ఇందులో పుష్కలంగా ఉన్నాయి.  ఇలా మినరల్స్, యాంటీయాక్సిడెంట్ల కాంబినేషన్ బెల్లంలో ఉండటం వల్ల ఫ్రీ ర్యాడికల్ డ్యామేజ్ ను అడ్డుకుని.. శరీరానికి ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి వస్తుంది.

3. మెటబాలిజం పెరుగుతుందిబెల్లం తింటే బరువు తగ్గే (weight loss) అవకాశాలు ఎక్కువ.  బెల్లంలోని పొటాషియం మెటబాలిజం (metabolism) వృద్ధి చేస్తుంది.  ఇది ఎలెక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేసేందుకు, బరువును నియంత్రించేందుకు సహకరిస్తుంది.

4. రక్తహీనత అధిగమించవచ్చుఐరన్, ఫొలేట్ అధికంగా ఉన్న బెల్లం తింటే రక్త హీనతను అధిగమించవచ్చు.  పదేపదే అలసిపోయేవారు రోజూ బెల్లం తింటే ఈ అలసట నుంచి శాశ్వతంగా బయటపడవచ్చు. హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచటానికి బెల్లం చక్కగా పనిచేస్తుంది, అందుకే బాలింతలకు బెల్లం తప్పకుండా ఇస్తారు.  తరచూ బెల్లం తినేవారిలో రక్త శుద్ధి జరుగుతుంది.

5. జీర్ణక్రియలో మెరుగుదలబెల్లం తీసుకుంటే అజీర్తి సమస్యలు పోతాయి.  జీర్ణక్రియల్లో కీలక పాత్ర పోషించే ఎంజైముల విడుదలలో బెల్లం చురుకైనపాత్ర పోషిస్తుంది. దీంతో మలబద్ధకం, పొత్తి కడుపులో కొన్ని సమస్యలు తగ్గుముఖం పడతాయి.  పేగులను మరింత బలోపేతం చేసేందుకు బెల్లంలోని మెగ్నీషియం ఉపయోగపడుతుంది.

6. నెలసరి సమస్యలకు చెక్మహిళల మెనుస్ట్రువల్ సైకిల్ (menstrual cycle) ను క్రమబద్ధీకరించే శక్తి బెల్లానికి ఉంది. అందుకే ఇప్పటికీ మన గ్రామీణ ప్రాంతాల్లో నెలసరి సమయంలో తప్పకుండా బెల్లాన్ని తింటారు.  బెల్లంలోని పోషకాలు అధిక రక్తస్రావం వంటి సమస్యలు రాకుండా నియంత్రిస్తుంది.  హ్యాపీ హార్మోన్లను విడుదల చేసే బెల్లంతో మూడ్ స్వింగ్స్ కూడా పోతాయి.  బహిష్టు సమయంలో వచ్చే కడుపునొప్పి వంటివి కూడా తగ్గుముఖం పట్టేలా చేసే బెల్లంను మహిళలు తమ ఆహారంలో తప్పకుండా తీసుకోవాలి.

7. బాడీ క్లెన్సర్కాలుష్యం ఎక్కువగా ఉన్న చోట్ల నివసించే వారికి అత్యుత్తమ బాడీ క్లెన్సర్ గా బెల్లం పనిచేస్తుంది.  పైగా ఇది చవక కూడా.  ఇరుకు సందుల్లోని షాపులు, వర్కుషాపులు, కాలుష్యం అధికంగా ఉండే ఫ్యాక్టరీల్లో పనిచేసే వారు బెల్లం తినటం చాలా అవసరం.  శ్వాస సమస్యలు రాకుండా చేసే బెల్లం,  పేగులు, కడుపు, ఆహారనాళంను శుద్ధి చేస్తుంది.

సైడ్-ఎఫెక్స్ట్.. ఇంతలా మేలు చేసే బెల్లం మంచిది కదా అని అతిగా తిన్నారంటే అది అసలు ఆరోగ్యానికి మంచిది కాదనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.  బెల్లం ఎక్కువ తింటే బరువు పెరుగుతారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపు తప్పుతాయి.  కొన్ని రకాలు ఇన్ఫెక్షన్లు రావటంతో కడుపు నొప్పి వస్తుంది.  రోజూ బెల్లం తిన్నప్పటికీ అది తక్కువ పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి.  బెల్లం మంచిదని బెల్లంతో చేసిన స్వీట్లు కిలోలకొద్దీ తిన్నారంటేమాత్రం మీరు అనారోగ్యంపాలు కావాల్సిందే.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Health benefits, Sugar

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు