హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Pinto Beans: పింటో బీన్స్‌ తినండి... ఈ ప్రయోజనాలు పొందండి

Pinto Beans: పింటో బీన్స్‌ తినండి... ఈ ప్రయోజనాలు పొందండి

పింటో బీన్స్‌ తినండి... ఈ ప్రయోజనాలు పొందండి

పింటో బీన్స్‌ తినండి... ఈ ప్రయోజనాలు పొందండి

Pinto Beans: పింటో బీన్స్ అనేవి ఒకప్పుడు అమెరికాలో డ్రై బీన్స్. మెక్సికోలో వీటి వాడకం ఎక్కువ. ఇప్పుడు ఇండియాలో కూడా ఇవి అన్ని షాపుల్లో దొరుకుతున్నాయి. మరి వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

Health Tips : చూడటానికి పింటో బీన్స్ కూడా రెగ్యులర్ బీన్స్‌లాగే కనిపిస్తాయి. కాకపోతే ఇవి ప్రత్యేక రకం. ఈ గింజలు ఎరుపు, గోధుమ రంగు తొక్కతో ఉంటాయి. వండినప్పుడు కొద్దిగా గోధుమ, పాలిపోయిన గులాబీ రంగులో కనిపిస్తాయి. ఇవి మంచి రుచితో, వంటడానికి ఎంతో ఈజీగా ఉంటాయి. వీటిలో ఫుల్లుగా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అందువల్ల వీటిని తింటే ఎంతో ఆరోగ్యం. పింటో బీన్స్‌లో ప్రధానంగా కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ప్రోటీన్ ఉంటాయి. వాటిలో చాలా విటమిన్లూ, ఖనిజాలూ ఉంటాయి. ఒక కప్పు (171 గ్రాములు) పింటో బీన్స్‌ని ఉప్పుతో ఉడికించి తింటే... 245 కేలరీల ఎనర్జీతోపాటూ... కార్బోహైడ్రేట్స్ 45 గ్రాములు, ఫైబర్ 15 గ్రాములు, ప్రోటీన్ 15 గ్రాములు, ఫ్యాట్ 1 గ్రాము, సోడియం 407 మిల్లీ గ్రాములు, థయామిన్ 28 శాతం (రోజులో కావాల్సింది), ఐరన్ 20 శాతం (రోజులో కావాల్సింది), మెగ్నీషియం 21 శాతం (రోజులో కావాల్సింది), ఫాస్పరస్ 20 శాతం (రోజులో కావాల్సింది), పొటాషియం 16 శాతం (రోజులో కావాల్సింది) లభిస్తాయి. థయామిన్ (విటమిన్ B1) మనకు అత్యంత ముఖ్యం. ఇది ఆహారాన్ని ఎనర్జీగా మార్చుతుంది. పింటో బీన్స్‌లో జింక్, కాల్షియం కూడా ఉంటాయి. ఉప్పు లేకుండా కూడా వీటిని ఉడికించుకొని తినవచ్చు.

- పింటో బీన్స్ తింటే... జీర్ణ వ్యవస్థ బాగా మెరుగవుతుంది. మనకు రోజుకు 25 గ్రాముల ఫైబర్ అవసరం. ముఖ్యంగా మహిళలు ఇవి బాగా తినాలి.

- పింటో బీన్స్‌లో వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. మన శరీరంలో కణాలు చక్కగా ఉండాలంటే వీటిని కరకరా నమిలెయ్యాలి.

- బ్లడ్ షుగర్ (డయాబెటిస్) కంట్రోల్‌లో ఉండాలంటే పింటో బీన్స్ తినాలి. ఇవి ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పెరగకుండా చేస్తాయి.

- గుండెకు ఈ గింజలు చాలా మేలు చేస్తాయి. రోజూ అరకప్పు పింటో బీన్స్ తింటే... చెడు కొలెస్ట్రాల్ పోతుంది. అందువల్ల గుండె హాయిగా ఉంటుంది.

- ఇవి రేటు తక్కువే. తయారుచేసుకోవడమూ తేలికే. డ్రై బీన్స్ అయితే... రాత్రంతా నీటిలో నానబెట్టి... తెల్లారే ఉడకబెట్టుకోవచ్చు, కూరల్లో వేసుకోవచ్చు. వీటిలో ఉల్లి, వెల్లుల్లి, ఇతరత్రా వేసుకొని... చిరుతిళ్లలా తినవచ్చు.

- మాంసం తిననివారు బలం కోసం పింటో బీన్స్ తినవచ్చు. వీటిలోని ప్రోటీన్స్ శక్తిని ఇస్తాయి.

- పింటో బీన్స్ నిండా పోషకాలే. అందువల్ల ప్రమాదకరమైన కాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా అవి అడ్డుకుంటాయి. అందువల్ల కనీసం రెండు రోజులకు ఓసారైనా ఈ గింజల్ని నానబెట్టి తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు సొంతమవుతాయి.

First published:

Tags: Health benefits, Health Tips, HOME REMEDIES, Tips For Women, Women health

ఉత్తమ కథలు