Health : మైదాతో కలిగే నష్టమేంటి? ఎందుకు వాడకూడదు?

Avoid Maida Get Health : చాలా మంది తమకు తెలియకుండానే మైదాను తింటూ ఉంటారు. ఎందుకంటే ఏ పదార్థాల్లో మైదా ఉందో తెలియకపోవడమే కారణం.

news18-telugu
Updated: June 2, 2020, 2:51 PM IST
Health : మైదాతో కలిగే నష్టమేంటి? ఎందుకు వాడకూడదు?
Health : మైదాతో కలిగే నష్టమేంటి? ఎందుకు వాడకూడదు?
  • Share this:
Avoid Maida Get Health : మైదా పిండి చూడటానికి చాలా బాగుంటుంది. స్మూత్‌గా ఉంటుంది. కానీ దాన్ని వైట్ పాయిజన్ (తెల్ల విషం) అంటారని తెలుసా మీకు. మైదా అనేది తినేటప్పుడు ఎంతో టేస్టీగా ఉంటుంది. పైగా మైదాతో వంటలు వేగంగా అయిపోతాయి. అందుకే చాలా మంది దాన్ని వాడుతుంటారు. కానీ మైదా ఎంత డేంజరస్సో తెలిస్తే... కచ్చితంగా దాన్ని దూరం పెడతారు. బ్రెడ్, పిజ్జా, పాస్తా, కేక్స్, కుకీస్, మఫ్పిన్స్, డోనట్స్, న్యూడుల్స్, బర్గర్స్... వీటి తయారీలో మైదా కలుపుతారని తెలుసా మీకు. జస్ట్ 2 మినిట్స్‌లో పూర్తయిపోతుందనే న్యూడుల్స్ వంటకాన్ని చాలా మంది తల్లులు... తమ పిల్లలకు చేసి పెడుతుంటారు. అందులో మైదా ఉంటుంది. అంటే తమకు తెలియకుండానే పిల్లలకు విషాన్ని పెడుతున్నట్లే.

గోధుమ పిండి వ్యర్థాల్లో ప్రమాదకర రసాయనాలు (కెమికల్స్) కలిపి రిఫైన్డ్ చేయడం ద్వారా... మైదాపిండి తయారవుతుంది. ఇందులో పోషకాలు, ఫైబర్, విటమిన్లు ఏవీ ఉండవు. ఇది ఈజీగా జీర్ణం అవుతుంది. అందువల్ల బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి. తద్వారా ఎన్నో అనారోగ్యాలు చుట్టుముడతాయి. మైదా తినడం వల్ల కలిగే నష్టాల్ని తెలుసుకుందాం. తద్వారా... వీలైనంత త్వరగా దాన్ని దూరం చేసుకోవచ్చు.

బరువు పెరుగుదల : మైసూర్ బోండాం (లేదా మైసూర్ బజ్జీ) లాంటి వాటిని మైదాతోనే చేస్తారు. అలాంటి వాటిని రెగ్యులర్‌గా తింటే... ఆటోమేటిక్‌గా బరువు పెరుగుతారు. బాడీలో కొవ్వు పేరుకుపోతుంది. ఊబకాయం (Obesity) వచ్చేస్తుంది. కాబట్టే మైదా మనం తినకూడదు.

షుగర్ లెవెల్స్ పెరుగుదల : మైదా తింటూ ఉంటే... క్రమంగా టైప్ 2 డయాబెటిస్ వచ్చేస్తుంది. మైదాలో షుగర్ లెవెల్స్ పెంచే గుణాలు చాలా ఎక్కువ. మైదా వంటలు తింటే... ఒక్కసారిగా ఇన్సులిన్, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఒక్కసారి డయాబెటిస్ వస్తే ఇక పోదు. దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఆ ఇబ్బంది పడకూడదంటే మైదా వదిలేయాలి.

చెడ్డ కొవ్వు పెరుగుదల : మైదాలో చెడు కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ. అది బాడీలో పెరిగే కొద్దీ అడ్డమైన రోగాలు వచ్చేలా చేస్తుంది.

హైబీపీ సమస్య : బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత, వేడి... ఇలాంటి అంశాలన్నీ కలిసి... హైబీపీ వచ్చేలా చేస్తాయి. అందుకే మైదాతో చేసిన పదార్థాలు తినకూడదు.

జంక్ ఫుడ్డే : మైదాను మరో రకంగా చెప్పాలంటే జంక్ ఫుడ్ అనుకోవచ్చు. ఇది నోటికి రుచిగా ఉంటుంది కానీ... ఆరోగ్యాన్ని చెడగొట్టి... మనస్శాంతిని దూరం చేస్తుంది.

యాసీడీటీ : తరచూ మైదా పదార్థాలు తింటూ ఉంటే... పొట్టలో బరువుగా, ఏదో రాయిని మోస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. తిన్న ఆహారం అరగదు. జీర్ణం కాదు. గ్యాస్ తయారపవుతుంది. త్రేన్పులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ సమస్యలే. యాసీడీటీ అంటారు కదా అది వస్తుంది. మలబద్ధకం కూడా వేధిస్తూ ఉంటుంది.

గుండె జబ్బు, ఇతర రోగాలు : మైదా అనేది ఓ అందమైన రోగాల పుట్ట అనుకోవచ్చు. మైదా ఎంత టేస్టీయో... అంత చేదైన రోగాలని అది ఇస్తుంది. గుండె, బ్రెయిన్, చర్మం, కళ్లు, ఇతర శరీర అవయవాల్ని నాశనం చేస్తుంది. స్లో పాయిజన్‌లా ఇది పనిచేస్తుంది.

మీకు ఆరోగ్యం కావాలనుకుంటే మైదాను వదిలేయండి. మైదాతో తయారయ్యే ఒక్క పదార్థం కూడా తినొద్దు. మీరు గమనించారో లేదో... మన దేశంలో నడుస్తున్న చాలా విదేశీ ఫుడ్ కంపెనీలు ఈ మైదా పదార్థాల్నే మనకు జంక్ ఫుడ్ రూపంలో అలవాటు చేస్తున్నాయి. పిజ్జాలు, బర్గర్లు, నూడుల్స్, మక్రోనీ వంటివి మన దేశ ఆహారం కాదు. సింపుల్‌గా వండేయాలని విదేశీయులు వీటిని అలవాటు చేసుకున్నారు. ఆ తర్వాత వాటిని భారతీయులకు అలవాటు చేశారు. ఆ సంస్థలకేమో డబ్బులు మనకేమో జబ్బులు. ఆలోచించుకోండి.

ఇవి కూడా చదవండి :

Fitness : వర్కవుట్ తర్వాత ఈ జ్యూస్ తాగితే... ఫుల్ ఎనర్జీ...

Health Tips : పడక సుఖానికి దివ్య ఔషధం యాలకులు...

Health Tips : కొబ్బరి నీళ్లతో 20 రకాల ప్రయోజనాలు... తాగితే రోగాలు దరిచేరవు

Diabetes Diet: షుగర్ పేషెంట్స్.. తినండి ఈ ఫ్రూట్స్..


Fennec Fox : పెద్ద చెవుల చిన్న నక్క... ఎప్పుడైనా చూశారా...
Published by: Krishna Kumar N
First published: June 2, 2020, 2:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading