ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు (Obesity), మల బద్ధకం (Constipation) సమస్యలతో బాధపడుతున్నారు. గుండె వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. ఐతే ఈ సమస్యలకు ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. అదే ఇసబ్గోల్ (Isabgol). ఈ మొక్క అచ్చం గోధుమలా కనిపిస్తుంది. ఇది చిన్న ఆకులు, పువ్వులు కలిగి ఉంటుంది. వీటి కంకులపై ఉండే విత్తనాలపై తెల్లటి రంగు పదార్థం అంటుకుంటుంది. ఇందులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇసబ్‌గోల్‌ని పిస్లియమ్ హస్క్ అని కూడా పిలుస్తారు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. నాచురల్ ఫైబర్‌గా పనిచేస్తుంది. వీటిని నీళ్లలో వేసి నానబెడితే.. కాసేపటి జెల్లీలా మారుతాయి. సగ్గుబియ్యం, సబ్జా గింజల్లాగే కనిపిస్తాయి. ఇసబ్గోల్తో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
పిల్లలకు రోజూ మెడిటేషన్ చేయడం నేర్పండి... దాని వల్ల ఇన్ని ప్రయోజనాలు
ఐతే ముఖ్యంగా మూడు సమస్యలపై అద్భుతంగా పోరాడుతోంది. నిత్యం ఇసబ్‌గోల్‌ని తీసుకుంటే.. మలబద్ధకం, డయేరియా, అధిక బరువు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ మూడు సమస్యలకు ఒకే ఒక్క పరిష్కారమని డైటీషియన్ మన్సీ తన ఇస్స్టగ్రామ్లో వీడియో పోస్ట్ చేశారు.
View this post on Instagram
అధిక బరువుతో బాధపడుతున్న వారు ఇసబ్‌గోల్‌ని వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ ఇసబ్‌గోల్‌ని నీళ్లలో కలిపి.. లంచ్, డిన్నర్‌కు ముందు సేవించాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే.. కొన్ని రోజుల్లో బరువు తగ్గుతారు.
చలికాలంలో కండరాల బిగుతు తగ్గాలంటే ఈ ఆసనాలు ట్రై చేయండి..!
మనలో చాలా మంది బలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. ఎసిడిటీ, గ్యాస్ వల్ల మూడు నాలుగు రోజులకోసారి మాత్రమే మల విసర్జనకు వెళ్తారు. అలాంటప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ఇసబ్‌గోల్‌ని గ్లాసు గోరువెచ్చని నీళ్లలో కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రపోయే ముందు తాగితే.. ఉదయాన్నే సుఖ విరేచనమవుతుంది.
డయేరియాకు కూడా ఇసబ్గోల్ చక్కగా పనిచేస్తుంది. కప్పు పెరుగులో రెండు టేబుల్ స్పూన్ల ఇసబ్గోల్ కలపాలి. భోజనం చేసిన తర్వాత.. దీనిని తీసుకుంటే.. డయేరియా సమస్య నుంచి బయటపడవచ్చు. ఇవి మాత్రమే కాదు...ఇసబ్గోల్ మీ గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. హృదయ సంబంధ రోగాలను రానీయదు. శరీరంలో చెడు కొలెస్టరాల్ స్థాయిని పెరగనీయదు. ఈసబ్ ఎక్కడ దొరుకుతుంది? అనే టెన్షన్ అవసరం లేదు. అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలో అందుబాటులో ఉంది.
(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health, Health Tips, Life Style, Lifestyle