HEALTH TIPS IN TEUGU HERE IS THE MAJOR CAUSES AND RISK FACTORS OF BLOOD CANCER LEUKEMIA EVERYONE SHOULD KNOW SK
Blood Cancer: బ్లడ్ క్యాన్సర్‌కు ఇవే ప్రధాన కారణాలు.. తప్పక తెలుసుకోండి..జాగ్రత్తగా ఉండండి
ప్రతీకాత్మక చిత్రం
Blood Cancer: అణు బాంబు పేలుడు వంటి అధిక శక్తి కలిగిన రేడియేషన్‌కు గురికావడం, లేదంటే తక్కువ రేడియేషన్ వంటి విద్యుదయస్కాంత క్షేత్రాలకు గురికావడం కూడా రక్త క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధి. ఎవరైనా దీని బారిన పడితే బతికి బట్టకట్టడం చాలా కష్టం. ఇటీవల టెక్నాలజీ పెరిగి, అధునాతన వైద్య చికిత్స అందుబాటులోకి వచ్చనప్పటికీ ఇంకా మరణాల రేటు ఎక్కువగానే ఉంది. చాలా కొద్ది మంది మాత్రమే క్యాన్సర్ నుంచి ప్రాణాలను బయటపడుతున్నారు. ఇది అంత ప్రమాదకరమైనది. క్యాన్సర్స్‌లో చాలా రకాలన్నాయి. అందులో ఒకటి బ్లడ్ క్యాన్సర్ (Blood Cancer). వైద్య పరిభాషల దీనిని లుకేమియా అంటారు. ఇది రక్తం లేదా ఎముకల మజ్జలో వస్తుంది. శరీరలో తెల్లరక్త కణాల సంఖ్య విపరితంగా పెరిగినప్పుడు ఈ వ్యాధి వస్తుంది. లుకేమియా అంటే ఎముకల మజ్జలో క్యానర్ కణాలు వేగంగా, అనియంత్రిత పద్దతిలో పెరుగుతాయి. ఇవి రక్తంలో కలిసి శరీరమంతా వ్యాపిస్తాయి. ఇతర క్యాన్సర్‌లా కణితులుగా కనిపించదు. ఎక్స్ రే వంటి ఇమేజింగ్ పరీక్షల్లో మాత్రమే వీటిని గుర్తిచగలం.
అమెరికాలోని క్యాన్సర్ చికిత్సా కేంద్రం నివేదిక ప్రకారం.. లుకేమియాలో అనేక రకాలు ఉన్నాయి. కొన్ని పిల్లల్లో ఎక్కువగా వస్తే, మరికొన్ని పెద్దవారిలో ఎక్కువగా ఉంటాయి. లుకేమియా రకం, ఇతర కారకాలపై దీని చికిత్స విధానం ఆధారపడి ఉంటుంది. బ్లడ్ క్యాన్సర్ బారిన పడిన వారు చాలా బక్కచిక్కిపోతారు. బలహీనత లేదా అలసట కనిపిస్తుంది. శరీరంపై రక్తస్రావం, జ్వరం, చలి, ఎముకలు కీళ్లలో నొప్పి, బరువు తగ్గడం, రాత్రి చెమటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి.
బ్లడ్ డిజార్డర్:
ఒక వ్యక్తికి లుకేమియా వస్తే.. అసలు అది ఎలా వచ్చిదో తెలుసుకోవడం చాలా కష్టం. ఐతే కొన్ని క్యాన్సర్ కారకాలు, రేడియేషన్‌కు గురికావడం వంటి కారణాల వల్ల లుకేమియా వస్తుంది. పాలిసిథెమియా వెరా, ఇడియోపతిక్ మైలోఫైబ్రోసిస్, థ్రోంబోసైటోపెనియాతో సహా కొన్ని రక్త రుగ్మతలు రక్త క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. మీలో గానీ, కుటుంబంలో గానీ ఎవరికైనా ఈ రుగ్మతలు ఏవైనా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇలాంటి వారికి చికిత్స అవసరం.
ధూమపానం: ధూమపానం ఆరోగ్యానికి హానికరం. క్యాన్స్‌కు కారకం. ఇది అన్ని సిగరెట్ల డబ్బాలపై రాసి ఉంటుంది. కానీ ఇవేమీ పట్టించుకుండా చాలా మంది సిగరెట్లు డబ్బాలకు డబ్బాలకు పీల్చేస్తారు. వీటి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. రక్త క్యాన్సర్‌తో ధూమపానానికి నేరుగా సంబంధం లేకుపోయినా.. సిగరెట్ ఎక్కువగా తాగితే తేలికపాటి రక్త క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది. ధూమపానం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది.
కుటుంబ చరిత్ర:
లుకేమియా కూడా జన్యుపరమైన వ్యాధి కావచ్చు. కానీ దీనిని కొందరు అంగీకరించరు. ఐతే చాలా లుకేమియాలకు కుటుంబ సంబంధం లేదు. కానీ మీ కుటుంబంలో ఎవరైనా ఇంతకు ముందు దీనితో బాధపడుతుంటే.. మీరు కూడా ప్రమాదంలో ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేసుకోవాలి. కవలలలో ఒకరికి ఇది ఉంటే.. మరొకరికి కూడా ప్రమాదం పొంచి ఉన్నట్లు భావించాలి.
పుట్టుకతో వచ్చే సిండ్రోమ్
డౌన్ సిండ్రోమ్, ఫ్యాన్కోని అనీమియా, బ్లూమ్ సిండ్రోమ్, టెలాంగియెక్టాసియా, బ్లాక్ఫాన్-డైమండ్ సిండ్రోమ్‌తో సహా కొన్ని పుట్టుకతో వచ్చే సిండ్రోమ్‌లు AML (Acute myeloid leukemia) ప్రమాదాన్ని పెంచుతాయి. మీ ఇంట్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే వెంటనే పరీక్షలు చేయించి.. అవసరమైన చికిత్స అందించాలి.
రేడియేషన్
అణు బాంబు పేలుడు వంటి అధిక శక్తి కలిగిన రేడియేషన్‌కు గురికావడం, లేదంటే తక్కువ రేడియేషన్ వంటి విద్యుదయస్కాంత క్షేత్రాలకు గురికావడం కూడా రక్త క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. కొన్ని క్రిమిసంహారకాలు, పారిశ్రామిక రసాయనాల మధ్య ఎక్కువ కాలం ఉన్నా లుకేమియా వచ్చే అవకాశముంది. అందుకే హానికార రసాయనాలకు వీలైనంత దూరంగా ఉండాలి.
(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.