హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Ginseng Benefits: ఈ ఒక్కమూలిక చాలు.. పురుషుల్లోని లైంగిక సమస్యలన్నింటికీ చెక్..!

Ginseng Benefits: ఈ ఒక్కమూలిక చాలు.. పురుషుల్లోని లైంగిక సమస్యలన్నింటికీ చెక్..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Ginseng Health Benefits: జిన్సెంగ్ మూలిక.. పురుషులకు ఇది గొప్పవరం లాంటిది. పురుషుల ఆరోగ్యాన్ని మెరుగుపరించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. దాని వల్ల ఉపయోగాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఈ రోజుల్లో పురుషుల్లో లైంగిక సమస్యలు (Sexual Problems in Men) సర్వ సాధారణమయ్యాయి. మారిన జీవన విధానం, ఆహార అలవాట్ల కారణంగా ఎంతో మంది లైంగిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి జిన్సెంగ్ (Ginseng herb) మూలిక.. దివ్యౌషధంగా పనిచేస్తుంది. జిన్సెంగ్ మూలికను వందల సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. మధుమేహం, ఫ్లూ, క్యాన్సర్ వంటి వ్యాధుల చికిత్సలో జిన్సెంగ్‌ను వినియోగిస్తున్నారు. అంతేకాదు పురుషులకు ఇది గొప్పవరం లాంటిది. పురుషుల ఆరోగ్యాన్ని మెరుగుపరించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది.

  జిన్సెంగ్ మూలిక.. అన్ని చోట్లా దొరకదు. కొరియా ద్వీపకల్పం, ఈశాన్య చైనా, కెనడా, అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే లభిస్తుంది. ఐతే పౌడర్‌లు, క్యాప్సూల్స్, టి-ప్యాక్‌ల రూపంలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. ఐతే దీనిని ఎలా పడితే అలా వాడడానికి వీల్లేదు. వైద్య నిపుణుల సాయంతోనే వినియోగించాలి. శారీరక అవసరాలు, మానసిక స్థితి దృష్టిలో ఉంచుకొని.. ఎంత మోతాదులో తీసుకోవాలి? ఎలా వాడాలి? ఎన్ని రోజుల పాటు కొనసాగించాలన్న దానిపై డాక్టర్ల సలహాలు తీసుకోవాలి. ఆ తర్వాతే జిన్సెంగ్ మూలికను వాడాలి.

  జిన్సెంగ్ మూలికతో లాభాలు (Ginseng Health Benefits):

  పురుషుల్లో అంగస్తంభన, వీర్య సంబంధిత సమస్యలు, వంధ్యత్వానికి సంబంధించిన సమస్యలను జిన్సెంగ్ మూలిక తొలగిస్తుంది. జిన్సెంగ్ తీసుకోవడం వల్ల పురుషులలో ప్రైవేట్ పార్ట్‌లో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. జిన్సెంగ్‌పై చేసిన అనేక విభిన్న పరిశోధనలలో ఈ విషయం వెల్లడయింది. జిన్సెంగ్‌ను వాడడం వల్ల శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుందని తేలింది.

  టెస్టోస్టెరాన్ ఒక పురుష హార్మోన్. టెస్టోస్టెరాన్ లోపం ఉంటే మగవారిలో శృంగార కోరికలు తగ్గుతాయి. కొన్ని సందర్భాల్లో వారిలో సెక్స్ కోరికలే చచ్చిపోతాయి. ఈ సమస్యకు జిన్సెంగ్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది టెస్టోస్టెరాన్ విడుదలను మెరుగుపరుస్తుంది, స్పెర్మ్ కౌంట్‌ను పెంచుతుంది.

  Tomato Juice: సిగరెట్ తాగేవారికి టమోటా జ్యూస్ ఒక వరం.. నిత్యం తాగితే మీ బాడీలో ఊహించని మార్పులు

  లైంగిక సమస్యలతో పాటు, అనేక ఇతర తీవ్రమైన వ్యాధులు మరియు అందం సమస్యలను నివారించడంలో జిన్సెంగ్ చాలా సహాయపడుతుంది. ఆరోగ్య నిపుణుడు లేదా వైద్యుడిని సంప్రదించిన తర్వాత, మీరు వివిధ సమస్యల నుండి బయటపడటానికి దీనిని ఉపయోగించవచ్చు, దాని గురించి ఇక్కడ తెలుసుకోండి ...

  వృద్ధాప్య ప్రభావాన్ని నివారిస్తుంది. శరీరం అంతర్గత వాపు నుంచి రక్షిస్తుంది. ఊపిరితిత్తులను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుతుంది. జిన్సెంగ్ తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్‌లు రాకుండా అడ్డుకుంటుంది.

  ఒత్తిడి లేని జీవితాన్ని ఆస్వాదించడానికి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇది చక్కగా పనిచేస్తుంది. పురుషుల్లో లైంగిక సంబంధ సమస్యలను తొలగిస్తుంది. మధుమేహం చికిత్సలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

  బరువు తగ్గాలనుకునే వారికి కూడా జిన్సెంగ్ మూలిక దోహదం చేస్తుంది. శరీరంలో శక్తిని పెంచుతుంది. ప్రాణంతకమైన క్యాన్సర్ చికిత్స, నివారణలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ మూలికల పొడిని క్రమం తీసుకుంటే శరీరంలో అద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయి.

  (Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Health, Health benefits, Life Style, Lifestyle

  ఉత్తమ కథలు