హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Mustard Oil: ఆవ నూనె ఉంటే.. మీ ఇల్లే ఒక హాస్పిటల్.. బ్యూటీ పార్లర్

Mustard Oil: ఆవ నూనె ఉంటే.. మీ ఇల్లే ఒక హాస్పిటల్.. బ్యూటీ పార్లర్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జలుబు వంటివి చేస్తే ముక్కు, చెవులలో ఆవనూనె చుక్కలు వేసేవారు. ఈ ఆవనూనెతో ఇంకా బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూడండి.

  ఆవ నూనె.  ఆహార పదార్థాలకు  రుచి ఇవ్వడమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఉత్తరాది రాష్ట్రాల్లో వంటలతో పాటు ఇతర అవసరాలకు కూడా ఆవనూనెను వినియోగిస్తుంటారు. ఇది యాంటీ బాక్టీరియల్. అందుకే ఔషదంగానూ పనిచేస్తుంది. పాత రోజుల్లో చిన్నారులు ఇన్ఫెక్షన్‌కు గురి కాకుండా ఆవనూనెతో మర్దన చేసేవారు. జలుబు వంటివి చేస్తే ముక్కు, చెవులలో ఆవనూనె చుక్కలు వేసేవారు.  ఇవే కాదు. ఈ ఆవనూనెతో ఇంకా బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూడండి.

  ఆవనూనెతో జీర్ణశక్తి పెరుగుతుంది. కొంత మందికి ఎంత తిన్నా మళ్లీ ఆకలి అవుతుంది. అలాంటి వారు వంటల్లో ఆవనూనె వినియోగిస్తే ఎక్కువగా ఆకలి అనిపించదు.

  తియామిన్, ఫొలేట్, నైసిన్ వంటి విటమిన్లు ఆవనూనెలో పుష్కలంగా ఉంటాయి. అందుకే బరువు తగ్గేందుకు ఆవనూనె ఎంతో ఉపయోగపడుతుంది. బాడీలో ఎక్స్‌ట్రా ఫ్యాట్‌ను తొలగిస్తుంది.

  ఆస్తమాకు ఇంత వరకూ శాశ్వత పరిష్కారం లేదు. ఐతే ఆవనూనెతో కొంత ఉపశమనం లభిస్తుంది. వేడి ఆవనూనెలలో కర్పూరం వేసి దానితో మర్దన చేసుకుంటే రిలీఫ్ ఉంటుంది.

  మస్టర్డ్ ఆయిల్‌తో అప్పుడప్పుడూ శరీరం మొత్తాన్ని మర్దన చేస్తే కండరాలకు బలంగా మారుతాయి. రక్తప్రసరణ బాగా పెరుగుతుంది.

  ఒక టీ స్పూన్ ఆవనూనెను తాగితే అది ఔషధంలా పనిచేస్తుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.

  చలికాలంలో పెదాలు పగులుతుంటాయి. అలాంటప్పుడు రాత్రివేళల్లో పెదాలకు ఆవనూనె రాసుకొని పడుకోవాలి. తెల్లారేసరికి మీ పెదాలు ఎంతో మృదువుగా అవుతాయి.

  జలుబు కారణంగా ముక్కు దిబ్బడ వేస్తే రెండు చుక్కలు ఆవ నూనె వేసుకోండి. క్షణాల్లోనే ఉపశమనం లభిస్తుంది.

  పసుపులో ఆవనూనె కలిపి రాసుకుంటే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. పొడిబారిన చర్మం మళ్లీ కాంతిమంతమవుతుంది.

  దంత సంబంధ సమస్యలకు కూడా ఆవనూనె చెక్ పెడుతుంది. పసుపు, ఉప్పులో ఆవ నూనెను కలిపి ఆ మిశ్రమాన్ని దంతాలపై రద్దుకోవాలి. అప్పుడు పన్ను నొప్పి వంటి సమస్యలు రావు.

  ఒంట్లో కొలెస్టరాల్‌ను ఆవనూనె చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. సాధారణ నూనెలు కాకుండా ఆవనూనెను వంటలో వినియోగిస్తే గుండె సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం 70శాతం వరకు తగ్గుతుంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Ayurveda health, Health, Health Tips, Life Style

  ఉత్తమ కథలు