Health Tips : లోబీపీ ఉన్నవారు రోజూ ఇలా చేయండి..

Health Tips | పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటుండాలి. దానిమ్మ, బీట్ రూట్ జ్యూస్ మరీ మంచిది. రెగ్యులర్‌గా తీసుకుంటుండం వల్ల రక్తప్రసరణ మెరుగ్గా మారి బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.

news18-telugu
Updated: June 2, 2019, 10:51 AM IST
Health Tips : లోబీపీ ఉన్నవారు రోజూ ఇలా చేయండి..
లో బీపీకి చిట్కాలు
news18-telugu
Updated: June 2, 2019, 10:51 AM IST
నీరసంగా అనిపించడం.. టెన్షన్ పడడం, ఏ పని చేయాలనుకోకపోవడం వంటివన్నీ లోబీపీ సూచనలే.. అనేక కారణాల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యతో సతమతమవుతున్నప్పుడు వెంటనే చెమటలు పట్టడం, కళ్లు తిరగడం వంటివి కూడా వస్తుంటాయి. అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్యను చాలావరకూ తగ్గించుకోవచ్చు.. అవేంటంటే..

* లోబీపీతో బాధపడేవారు ముందుగా ఖచ్చితంగా ఆహారాన్ని కాస్తా సరైన సమయాల్లో తీసుకుంటుండాలి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. తినాలనిపించకపోయినా.. కాసింతైనా తినాలి.

* నీరు తాగుతుండాలి. దీనివల్ల శరీరం అలిసిపోకుండా ఉంటుంది.

* పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటుండాలి. దానిమ్మ, బీట్ రూట్ జ్యూస్ మరీ మంచిది. రెగ్యులర్‌గా తీసుకుంటుండం వల్ల రక్తప్రసరణ మెరుగ్గా మారి బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.



* కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగుతుండాలి. వీటివల్ల లోబీపీ సమస్య తగ్గుతుంది.

* లోబీపీ ఉన్నవారు సరైన సమయానికి నిద్ర పోవాలి. రోజుకి ఖచ్చితంగా 8 గంటలు తగ్గకుండా నిద్రపోవడం వల్ల శరీరం నూతనోత్సాహంతో ఉంటుంది.

ఈ వీడియో కూడా చూడండి..
Loading...
First published: June 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...