Health Tips : ఎక్కువ వేడిగా ఉండే కాఫీ, టీలు తాగుతున్నారా..అయితే జాగ్రత్త..

గుప్పుగుప్పుమనే కాఫీ, టీలు తాగడం చాలామందికి ఇష్టం. ఆఫీస్, ఇళ్లు ఇలా ఎక్కడైనా సరే పొగలు కక్కే కాఫీలు తాగుతూ రిలాక్స్ అవుతుంటారు. కానీ, అలా ఎక్కువగా వేడిగా ఉండే డ్రింక్స్ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని లేటెస్ట్ పరిశోధనలు చెబుతున్నాయి.

Amala Ravula | news18-telugu
Updated: April 20, 2019, 12:33 PM IST
Health Tips : ఎక్కువ వేడిగా ఉండే కాఫీ, టీలు తాగుతున్నారా..అయితే జాగ్రత్త..
అల్లం రసం తీసుకోవడం, డార్క్ చాక్లెట్, కాఫీ తాగడం వంటివికూడా ఆకలిని నియంత్రణలో ఉంచుతాయి.
  • Share this:
ఆఫీస్‌లో ఫుల్ వర్క్ ఉన్నప్పుడు ఓ కప్పు టీ వచ్చిందంటే చాలు.. ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తోంది. ఇంట్లో ఉదయం నుంచి రాత్రి వరకూ పనితో ఉక్కిరిబిక్కిరైనప్పుడు ఓ కప్పు కాఫీ పెట్టుకుని తాగితే.. ఆహా ఆ రిలీఫ్ ఎంత బాగుంటుంది. వేడివేడి కప్పు కాఫీ నీళ్లు పడగానే చక్కని ఫీలింగ్. అయితే, ఎక్కువగా వేడిగా ఉన్న టీ, కాఫీలనే చాలామంది ఇష్టపడతారు. అయితే, ఇలా తాగడం వల్ల కాన్సర్ వస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. సాధారణంగా 60 డిగ్రీల కంటే ఎక్కువగా వేడి ఉన్న టీ, కాఫీలు తాగడం వల్ల కాన్సర్ వచ్చే అవకాశముందని చెబుతున్నారు.
కాఫీ, టీలు తాగుతున్న 40 నుంచి 75 మధ్య వయసున్న సుమారు 50వేలమందిపై కొన్ని సంవత్సరాల పాటు పరిశోధన జరిగింది. ఇందులో దాదాపు 317 మందికి ఒసోఫాగస్ క్యాన్సర్ వచ్చింది. అంటే మన గొంతు నుండి పొట్ట వరకు ఓ గొట్టం ఉంటుంది. దీనికి వచ్చే వ్యాధినే ఒసోఫాగస్ కాన్సర్ అంటారు. వేడివేడి కాఫీ, టీలు తాగడం వల్ల సున్నితంగా ఉండే ఆ ప్రభావం గొంతునాళంపై పడి మంట, పుండ్లు ఏర్పడతాయి. ఇది అధికంగా మారి ఒసోఫాగస్ కాన్సర్( oesophagus cancer)రిస్క్ ఎక్కువగా ఉంటుందని తేల్చారు. కేవలం కాఫీ, టీలే కాదు.. వేడిగా ఉండే ఏ లిక్విడ్ ఐటైమ్స్ అయినా సరే ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని తేల్చారు.


చాలామందికి ఉదయాన్నే ఎక్కువగా టీ, కాఫీలు తాగే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో.. ఇక ఇతర దేశాల్లో వేడివేడి ఆల్కహాల్‌ని తీసుకుంటారు. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిదికాదు.. అత్యంత వేడిగా ఉండే ఈ లిక్విడ్స్ వల్ల గొంతునాళానికి వేడిపుట్టి మంటగా ఉండి పుండ్లు అవుతాయని దీనివల్ల కాన్సర్ రిస్క్ ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థతో నివేదికలు చెప్పడమే కాక.. అమెరికా కాన్సర్ సొసైటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు.
ఒసోఫాగస్ కాన్సర్ అంటే ఏంటంటే..
ముందుగా చెప్పుకున్నట్టు మన గొంతు నుంచి పొట్టవరకూ ఆహారాన్ని చేర్చే గొట్టం ఉంటుంది. ఈ గొట్టానికి వచ్చే సమస్యలనే ఒసోఫాగస్ కాన్సర్ అంటారు. కాఫీ, టీలు ఎక్కువగా తాగడమే కాకుండా, వారానికి 14 గ్లాసులకి మించి ఆల్కహాల్ తీసుకున్నా.. ఎక్కువగా పొగతాగినా ఈ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. తాజా నివేదికల ప్రకారం ఈ సమస్య కారణంగా సంవత్సరానికి 4లక్షల మంది ప్రాణాలు వదులుతున్నారు. అంతేకాదు.. ఈ కాన్సర్ వస్తే మిగతా కాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు చెబుతున్నారు.
గొంతు మంటగా ఉండడం, గొంతునొప్పి, బరువు తగ్గడం, గుండెలో మంట వంటివన్నీ ఈ కాన్సర్ లక్షణాలే..

అయితే, కాఫీ, టీలు, వేడిగా ఉండే లిక్విడ్స్ మానొద్దని చెప్పడం లేదు. సాధారణంగా మనం తాగే కాఫీ, టీలు 70 నుంచి 80 డిగ్రీల వరకూ వేడిగా ఉంటాయి. అలా తాగకుండా కాస్తాచల్లారిన తర్వాత తాగడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు పరిశోధకులు.ఇవి కూడా చదవండి..

మగువల నడుమంటే మగాళ్లు పడి చచ్చేది ఇందుకే...

ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఈ ఫుడ్ తీసుకుంటే మొదటికే మోసం..
Published by: Amala Ravula
First published: April 20, 2019, 12:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading