Home /News /life-style /

HEALTH TIPS HERE IS THE 5 TIPS FOR BETTER ORAL HYGIENE SU GH

Oral Hygiene: దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 టిప్స్ పాటిస్తే చాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రోజుకు రెండు సార్లు రోజూ పళ్లు తోమండి.. అయినా మీ దంతాల రంగు మారుతుంటే.. మీ నోరు దుర్వాసన వస్తోందంటే వెంటనే మీరు డెంటిస్ట్ ను సంప్రదించాల్సిందే.

మీ నోరు శుభ్రంగా ఉండాలంటే దంతాలు పరిశుభ్రంగా (Dental hygiene) ఉండటం అత్యవసరం. లేదంటే పళ్లు పుచ్చిపోవటం, నోరు వాసన రావటం, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవటం వంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. మీ దంతాలు ఆరోగ్యంగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఎందుకంటే మనం తినే ఆహారమంతా నోటి నుంచే పోతుంది కనుక, నోరు శుభ్రంగా ఉండటం తప్పనిసరి. నోరు శుభ్రంగా లేకపోతే ఎన్నో ఇతర అనారోగ్యాలు చుట్టుముడతాయని గతంలో జరిగిన పలు పరిశోధనల్లో రుజువైంది. చిగుళ్ల నొప్పి, పంటి నొప్పి, పళ్ల నుంచి రక్తం కారటం, పళ్లు పుచ్చుపట్టిపోవటం వంటివి అయితే మీరు ఆ పంటి నొప్పిని భరించటమే కాదు ఒకవేళ ఆ దంతం తీసేయాల్సి వస్తే నలుగురిలో వెళ్లేందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతారు కూడా. వీటన్నిటికీ విరుగుడు ఓరల్ హైజీన్, డెంటల్ హైజీన్ అని దంత వైద్యులు సింపుల్ గా చెబుతారు.

మాట సరిగా రాదు..
ఒక్కోసారి మీకు మాట సరిగ్గా రాదు. దానికి పంటి సమస్య కూడా కారణం కావచ్చని డెంటిస్టులు చెబుతున్నారు. ఇలా మాట సరిగ్గా రాకపోతే ప్రొఫెషనల్స్ చాలా ఇబ్బందిపడతారు. పంటి సమస్యలు పోషకాల లేమికి (malnutrition) కూడా దారితీస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లల్లో పంటి సమస్యలు ఉండటం వల్ల పోషకాహారం తినకుండా వారు బలహీనులవుతారు. అయినా ఓరల్ హెల్త్ ను మెయిన్టెన్ చేయటం పెద్ద కష్టమేమీ కాదని దంతవైద్యులు ఎప్పటినుంచో చెబుతున్నారు. రోజూ రెండు సార్లు బ్రష్ చేసుకోవటంతో పాటు రెగ్యులర్ గా డెంటల్ చెకప్స్ కు వెళ్లండి.

ఓరల్ హైజీన్ కోసం ఇలా చేయండి..
1. బండగా బ్రషింగ్ వద్దు..
రోజూ బ్రష్ చేసుకునేప్పుడు మీరు కొన్ని చిన్న విషయాలను గుర్తుంచుకుంటే పంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. కొంతమంది రుద్దినట్టు బ్రష్ చేస్తారు, ఇలా బలవంతంగా చేసే బ్రషింగ్ తో పంటిపైన ఉన్న సున్నితమైన ఎనామిల్ పొర డ్యామేజ్ అవుతుంది. దీంతో మీకు సెన్సిటివిటీ సమస్య పుట్టుకొస్తుంది. కాబట్టి మరీ బండగా బ్రష్ చేయకండి. మరికొందరైతే నిమిషాల తరబడి బ్రష్ చేస్తారు, అలా అతిగా చేయకండి. ఇంకొందరు ఏకంగా కొన్ని సెకెన్లపాటు చేసి.. నామమాత్రంగా బ్రష్ చేశామనిపిస్తారు. ఇలా కూడా చేయకండి. కనీసం 1-2 నిమిషాలపాటు చక్కగా బ్రష్ చేయండని దంత వైద్యులు చెబుతున్నారు.

2. దంతాలే కాదు చిగుళ్లు ముఖ్యమే
సాధారణంగా అందరూ దంతాలు బాగుంటే చాలు. ఇందుకు పళ్లు నిగనిగలాడేలా తెల్లగా ఉంటే చాలనుకుని పొరబడతారు. కానీ మీ దంతాలు ఎంత ముఖ్యమైనవో చిగుళ్లు కూడా అంతే ముఖ్యమైనవి. తరచూ మీ చిగుళ్లు చీల్చుకుని రక్తం కారుతుంటే మీరు జాగ్రత్త పడాలని అర్థం. ఇక కరకరలాడే పదార్థాలు తిన్నప్పుడు మీ చిగుళ్లు గాయాలపాలవుతున్నాయా ఈసారి గమనించండి. ఇక ఇన్ఫ్లమేషన్ కారణంగా చిగుళ్లు పాడవ్వటం సర్వసాధారణం. అందుకే బ్రష్ చేశాక.. మీ చిగుళ్లపై సున్నితంగా రబ్బరుతో చిన్నగా మసాజ్ చేయండి. అంతేకాదు ఏదైనా తిన్నాక చిన్న ముక్కల్లాంటివి మీ చిగుళ్లపై పేరుకోకుండా జాగ్రత్తపడండి. ఇలా చిన్న పరమాణువులు దంతాలు, చిగుళ్లపై పేరుకుంటే ఇన్ఫెక్షన్లు, ఇన్ఫ్లమేషన్లు వచ్చే ప్రమాదముంది. కాబట్టి తరచూ నీటితో పుక్కళించండి. ఇలా చిక్కుకున్న ఆహారం బయటికి వచ్చేస్తుంది.

3. దంతాలు ఆహారం తినేందుకు మాత్రమే
ఆహారం నమిలి తినేందుకు మాత్రమే మీ దంతాలను వాడండి. ఓపనర్ గా, ప్యాకేజింగ్ టేపు తీసేందుకు, బట్టలు కుట్టేప్పుడు దారం తెంచేందుకు, నట్స్ పగలగొట్టేందుకు మీ దంతాలను ఉపయోగించకండి. మీ దంతాలు చాలా బలంగా ఉన్నాయని పదేపదే ఇలాంటివి చేస్తే పళ్లు వదులు అయి తొందరగా పడిపోతాయి.

4. ఫ్లోరైడ్ బెనిఫిట్స్
మీరు కొనే టూత్ పేస్టులు, మౌత్ వాషుల్లో ఎటువంటి పదార్ధాలున్నాయో చెక్ చేసుకోండి. ఇందులో విపరీతమైన, ఘాటు రసాయనాలు ఉంటే మాత్రం వీటిని కొనకండి. అందుకే ఓరల్ కేర్ ప్రాడక్ట్స్ పై ఉన్న ఇంగ్రేడియంట్ లేబుల్ ను బాగా చదవండి. ఇందులో ఫ్లోరైడ్ ( Fluoride) ఎక్కువగా ఉన్నదాన్నే ఎంచుకోండి. ఫ్లోరైడ్ ఉన్న పేస్టుతో బ్రష్ చేస్తే మీ దంతాలు డ్యామేజ్ కావు, డెంటల్ కేర్ లో ఫ్లోరైడ్ కీలక పాత్ర పోషిస్తుంది.

5. ఎనామిల్ తో జాగ్రత్త
దంతాలను సంరక్షించే సున్నితమైన పొర ఎనామిల్. ఈ ఎనామిల్ డ్యామేజ్ (enamel damage) అయిందో మీకు ఇక సెన్సిటివిటీ, దంతాల నొప్పులు, దంత క్షయం విపరీతంగా పెరుగుతాయి. సోడాలు, షుగరీ డ్రింగ్స్, ఆల్కహాల్, ధూమపానంతో మీ దంతాలపై ఉన్న ఎనామిల్ డ్యామేజ్ అవుతుంది. ఇక పళ్ల రసాలు మంచివని ఎక్కువగా లాగిస్తుంటే మీ పళ్లు త్వరగా పటుత్వం కోల్పోయి ఊడతాయి. అందుకే చక్కెర వేసిన ఇలాంటి జ్యూసులను తగ్గించి, పళ్లను తినండి. ఒకవేళ పళ్ల జ్యూసులు తాగాల్సివస్తే చక్కెర వేయకుండా తాగండి. ఐస్ ఎక్కువ వేసిన జ్యాసులు, ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్ తాగటం, చాలా వేడిగా ఉన్న టీ, కాఫీలు అతిగా తాగటంతో కూడా ఎనామిల్ సమస్యలు వస్తాయి. ఈ చిన్న విషయాలపై జాగ్రత్త వహిస్తే మీకు పంటి సమస్యలు తగ్గుతాయి.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Dental clinic, Health Tips

తదుపరి వార్తలు