Health Tips : తిన్నవెంటనే ఈ పనులు అస్సలు చేయొద్దు..

అన్నం తిన్న వెంటనే కొన్ని పనులు చేయొద్దని పెద్దవారు చెబుతారు. అసలు అలా ఎందుకు చెబుతారు. ఆ పనులేంటి.. వాటిని చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

Amala Ravula | news18-telugu
Updated: June 2, 2019, 10:28 AM IST
Health Tips : తిన్నవెంటనే  ఈ పనులు అస్సలు చేయొద్దు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అన్నం.. ఎన్ని ఆహారపదార్థాలున్నా అన్నంకి సాటిరాదు. అందుకే చాలామంది ఇష్టంగా అన్నం తింటారు. అయితే, అన్నం తిన్న వెంటనే కొన్ని పనులు చేయొద్దని చెబుతారు. ధూమపానం, స్నానం చేయడం, కూల్‌డ్రింక్స్ తాగడం ఇలాంటివి చేయొద్దని చెబుతుంటారు. మరి ఈ పనులు చేయడం వల్ల ఏం జరుగుతుందో చూద్దాం..

అన్నం తిన్న వెంటనే చాలామంది స్నానం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, అలసటగా అనిపిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఎందుకంటే స్నానం చేయడం వల్ల శరీరంలోని రక్త సరఫరా విషయంలో మార్పులు వస్తాయి. దీని కారణంగా జీర్ణశక్తి తగ్గుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

పొగత్రాగడమే చాలా ప్రమాదకరం. ఇక అన్నం తీసుకున్న వెంటనే స్మోకింగ్ చేస్తే ఆ ప్రభావం పదింతలు ఎక్కువగా హానికరమని చెబుతున్నారు వైద్యులు.
తిన్నవెంటనే పండ్లు తీసుకోవడం కూడా మంచిది కాదు. ఇలా చేయడం వల్ల అసిడిటీ సమస్య తలెత్తుతుంది.

అన్నం తింటనే కాఫీ, టీలు తాగడం కూడా జీర్ణశక్తిపై ప్రభావం చూపుతాయి. ఎందుకంటే తీసుకున్న ఆహారంలో ప్రోటీన్స్ ఉంటాయి. టీలోని ఇలాంటి ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టిజీర్ణం కావడానికి సమయం పడుతుంది.

చాలామంది తిన్నవెంటనే పడుకుంటారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. దీని వల్ల అన్నం జీర్ణం కాదు. అందుకే తిన్న వెంటనే కాకుండా కాసేపు సమయం తీసుకున్న తర్వాత పడుకోవాలి. నిజానికీ తినడం, నిద్రపోవడానికి మధ్య 2 గంటల వ్యవధి ఉండడం మంచిది.

ఈ వీడియో కూడా చూడండి..
First published: June 2, 2019, 10:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading